AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nagarjuna: ఇదేం ట్విస్ట్.. అలా అయితే నేనే కూల్చేసేవాడిని.. ఎన్‌-కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించిన నాగార్జున

భారీ పోలీసు బందోబస్తు మధ్య.. జంబో జేసీబీలతో కన్వెన్షన్‌ను గంటల వ్యవథిలోనే అధికారులు కూల్చివేశారు. కాగా.. N కన్వేషన్‌ కూల్చివేతపై సినీనటుడు అక్కినేని నాగార్జున స్పందించారు. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్‌-కన్వెన్షన్ కూల్చడం బాధాకరమని నాగార్జున పేర్కొన్నారు.

Nagarjuna: ఇదేం ట్విస్ట్.. అలా అయితే నేనే కూల్చేసేవాడిని.. ఎన్‌-కన్వెన్షన్ కూల్చివేతపై స్పందించిన నాగార్జున
N Convention Nagarjuna
Shaik Madar Saheb
|

Updated on: Aug 24, 2024 | 1:12 PM

Share

హైదరాబాద్ నగరంలోని మాదాపూర్‌లో నాగార్జునకు చెందిన N కన్వేషన్‌ను హైడ్రా అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు. హైటెక్ సిటీ సమీపంలో ఉన్న తుమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించి N కన్వెన్షన్ కట్టారని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. తాజాగా హైడ్రాకు మరోసారి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులు పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్.. చెరువు ఆక్రమణకు గురైనట్టు నిర్ధారించి..కూల్చివేతలకు ఆదేశాలు ఇచ్చారు. భారీ పోలీసు బందోబస్తు మధ్య.. జంబో జేసీబీలతో కన్వెన్షన్‌ను గంటల వ్యవథిలోనే అధికారులు కూల్చివేశారు. కాగా.. N కన్వేషన్‌ కూల్చివేతపై సినీనటుడు అక్కినేని నాగార్జున స్పందించారు. స్టే ఆర్డర్లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్‌-కన్వెన్షన్ కూల్చడం బాధాకరమని నాగార్జున పేర్కొన్నారు. ఎన్‌-కన్వెన్షన్ పట్టా భూమిలో కట్టామని.. ప్రైవేటు స్థలంలో నిర్మించిన భవనమని నాగార్జున పేర్కొన్నారు. గతంలో ఇచ్చిన నోటీసులపై స్టే కూడా ఇచ్చారన్నారు. ఎలాంటి నోటీసులివ్వకుండా కూల్చడం సరికాదన్నారు. కోర్టు తనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చి ఉంటే నేనే కూల్చేవాడినంటూ పేర్కొన్నారు. ఈ పరిణామాల వల్ల అక్రమ నిర్మాణాలు చేశామని ప్రజలు భావించే అవకాశం ఉందన్నారు. కూల్చివేతలపై న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని నాగార్జున స్పష్టంచేశారు.

ఆ భూమి పట్టా భూమి అని.. ఒక్క అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురికాలేదన్నారు.. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిదని.. కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన అక్రమ నోటీసుపై స్టే కూడా మంజూరు చేసినట్లు నాగార్జున తెలిపారు. కూల్చివేత తప్పుడు సమాచారంతో లేదా చట్ట విరుద్ధంగా జరిగిందన్నారు. ఈరోజు ఉదయం కూల్చివేతకు ముందు తమకు ఎలాంటి నోటీసు జారీ చేయలేదని నాగార్జున తెలిపారు.

నాగార్జున ట్వీట్..

కాగా.. ఎన్ కన్వెన్షన్ నర్మించిన 3 ఎకరాల 30 గుంటల్లో 2 ఎకరాలు బఫర్ జోన్‌లో ఉందని పేర్కొంటున్నారు. మిగిలిన భూమి చెరువు శిఖంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ కన్వెన్షన్ నిర్మాణం అక్రమమని గత ప్రభుత్వంలోనూ ఫిర్యాదులు అందాయి. అప్పట్లోనే కూల్చివేస్తారని వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాలతో అప్పుడు కూల్చివేత జరగలేదు. ఇప్పుడు హైడ్రా రంగంలోకి దిగింది. సినీ హీరో నాగార్జున N3 రియాల్టీ ఎంటర్‌ప్రైజెస్ కింద N-కన్వెన్షన్ ఏర్పాటు చేశారు. మొత్తం 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ నిర్మాణం చేపట్టారు. దాదాపు 2,3 వేల మంది కూర్చునేలా మెయిన్‌ హాల్‌, అవుట్‌డోర్‌ సీటింగ్‌ నిర్మించారు. ఇందులో సోషల్ ఈవెంట్స్, ప్రీవెడ్డింగ్, వెడ్డింగ్స్ నిర్వహిస్తున్నారు. 2015 ఆగస్ట్‌ 20 నుంచి N-కన్వెన్షన్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. తుమ్మిడికుంట చెరువును కబ్జా చేసి N-కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారనే ఆరోపణలు వచ్చాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
స్టిండీస్‌తో తొలి టీ20.. అభిషేక్ శర్మ ముందు 3 కీలక మైలురాళ్లు..!
స్టిండీస్‌తో తొలి టీ20.. అభిషేక్ శర్మ ముందు 3 కీలక మైలురాళ్లు..!
Satellite Internet: వైర్లు లేకుండా నింగి నుంచే నెట్!
Satellite Internet: వైర్లు లేకుండా నింగి నుంచే నెట్!
టైల్స్, మార్బుల్, గ్రానైట్.. ఇంటి ఫ్లోరింగ్‌కు ఏది బెస్ట్..?
టైల్స్, మార్బుల్, గ్రానైట్.. ఇంటి ఫ్లోరింగ్‌కు ఏది బెస్ట్..?
శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్..
శ్రీవారిని దర్శించుకున్న ఏపీ ఎఫ్డిసి చైర్మన్ భరత్ భూషణ్..
సింగీతం శ్రీనివాసరావు ఫ్యామిలీని చూశారా? వారసులు ఏం చేస్తున్నారంట
సింగీతం శ్రీనివాసరావు ఫ్యామిలీని చూశారా? వారసులు ఏం చేస్తున్నారంట
వర్షాకాలం పోయినా తగ్గని వేడి.. అక్టోబర్ హీట్‌పై షాకింగ్ అలర్ట్!
వర్షాకాలం పోయినా తగ్గని వేడి.. అక్టోబర్ హీట్‌పై షాకింగ్ అలర్ట్!
ఈ కాంబో సెట్‌ కొన్నారంటే కిచెన్‌లో పనులన్నీ ఈజీగా అయిపోతాయ్
ఈ కాంబో సెట్‌ కొన్నారంటే కిచెన్‌లో పనులన్నీ ఈజీగా అయిపోతాయ్
చంద్రుడి పై అణుశక్తి పోటీ.. అమెరికాకు చైనా, రష్యా సవాల్
చంద్రుడి పై అణుశక్తి పోటీ.. అమెరికాకు చైనా, రష్యా సవాల్
తక్కువ ధరలో బ్లూటూత్ స్పీకర్‌‌ కొనాలంటే ఇదే బెస్ట్‌
తక్కువ ధరలో బ్లూటూత్ స్పీకర్‌‌ కొనాలంటే ఇదే బెస్ట్‌
ఇక AI వాషింగ్ మెషీన్లు చౌకగా.. కేవలం రూ.1388 EMIతోనే కొనేయండి..!
ఇక AI వాషింగ్ మెషీన్లు చౌకగా.. కేవలం రూ.1388 EMIతోనే కొనేయండి..!