Hyderabad: హీరో నాగార్జున ఎన్ కన్వెన్షన్‌ను కూల్చివేస్తున్న హైడ్రా..
ఈ రోజు నాగార్జునకు సంబంధించిన N కన్వెన్షన్‌ను కూల్చివేస్తుంది HYDRA.. పోలీసులు బందోబస్తు మధ్యలో కూల్చివేతలు చేపట్టారు అధికారులు. తిమ్మిడి కుంటకు సంబందించిన బఫర్‌లో N కన్వెన్షన్ నిర్మాణాలను చేపట్టారు అని అనేక ఫిర్యాదులు రావడంతో కూల్చివేతలు జరుపుతున్నారు అధికారులు.
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా.. చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన కట్టడాలపై ఉక్కుపాదం మోపుతున్న విషయం తెలిసిందే. అయితే గతంలో హాట్ టాపిక్‌గా మారిన ఎన్ కన్వెన్షన్( నాగ్ కన్వెన్షన్ హాల్) వివాదం మరోసారి తెర మీదకు వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో ఈ కట్టడం అక్రమంగా జరిగిందని.. చెరువు భూమిని కబ్జా చేసి కట్టారనే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా హైడ్రా అక్రమ కట్టడాలపై విరుచుకు పడుతుండటంతో.. తమడికుంట చెరువును కబ్జా చేసి.. ఎన్ కన్వెన్షన్ నిర్మించారని హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు జనం కోసం సంస్థ ప్రతినిధి భాస్కర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదులో తమడికుంట చెరువులోని 3.30 ఎకరాల స్థలంలో ఎన్ కన్వెన్షన్ కబ్జా చేసి కన్వెన్షన్ హాల్ నిర్మించారని.. ఈ అక్రమ కట్టడాలపై హైడ్రా చర్యలు తీసుకుని.. తమడికుంట చెరువుకు పూర్వవైభవం తీసుకురావాలని.. తన ఫిర్యాదులో రాసుకొచ్చారు. దీంతో డాక్యూమెంట్స్ పరిశీలించి.. ఆక్రమించిన స్థలాల్లో కట్టిన ఎన్ కన్వెన్షన్ నిర్మాణాన్ని కూల్చి వేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..