స్మార్ట్‌ ఫోన్‌ వాడేవారికి హెచ్చరిక.. ముంచుకొస్తున్న వృద్ధాప్యం ముప్పు !!

స్మార్ట్‌ ఫోన్‌ వాడేవారికి హెచ్చరిక.. ముంచుకొస్తున్న వృద్ధాప్యం ముప్పు !!

Phani CH

|

Updated on: Aug 23, 2024 | 11:21 PM

ప్రస్తుత కాలంలో మొబైల్‌, కంప్యూటర్‌, ల్యాపట్యాప్‌ వాడకం తప్పనిసరి అయపోయింది. అయితే వీటిని ఎక్కువగా వినియోగించడం వలన చర్మవ్యాధులు, వృద్ధాప్యం త్వరగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మొబైల్ ఎక్కువగా వాడేవారిలో చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. దాదాపు రోజంతా మొబైల్ ఫోన్ వాడేవారి కళ్ళు మాత్రమే కాదు, చర్మం కూడా చాలా తీవ్రంగా దెబ్బతింటుంది.

ప్రస్తుత కాలంలో మొబైల్‌, కంప్యూటర్‌, ల్యాపట్యాప్‌ వాడకం తప్పనిసరి అయపోయింది. అయితే వీటిని ఎక్కువగా వినియోగించడం వలన చర్మవ్యాధులు, వృద్ధాప్యం త్వరగా వస్తుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మొబైల్ ఎక్కువగా వాడేవారిలో చర్మ సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. దాదాపు రోజంతా మొబైల్ ఫోన్ వాడేవారి కళ్ళు మాత్రమే కాదు, చర్మం కూడా చాలా తీవ్రంగా దెబ్బతింటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మొబైల్ మాత్రమే కాదు, కంప్యూటర్, ల్యాప్‌టాప్ వంటి డిజిటల్ పరికరాల నుంచి వెలువడే కిరణాలు చర్మాన్ని దెబ్బతీస్తాయి. దీని వెనుక వీటి నుంచి వెలువడే ‘బ్లూ లైట్’ పాత్ర కీలకం. ఈ కాంతి చర్మలోని ప్రోటీన్లు, కొల్లాజెన్, ఫైబర్‌లను నాశనం చేస్తుంది. చర్మంలో ‘మెలనిన్’ ఉత్పత్తిని పెంచుతుంది. ఫలితంగా రకరకాల చర్మ సమస్యలు తలెత్తుతాయి. మొబైల్ లేదా ల్యాప్‌టాప్ స్క్రీన్‌ను నాలుగు గంటలు లేదా అంతకంటే ఎక్కువసేపు నిరంతరం వాడితే ‘మెలనిన్’ స్రావాల పరిమాణం పెరుగుతుంది. ఫలితంగా చిన్న వయసులోనే చర్మం డల్ గా మారుతుంది. ముఖంపై నల్ల మచ్చలు కనిపించవచ్చు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మీ సిబిల్‌ స్కోర్ పెంచుకోవాలనుకుంటున్నారా ?? ఇలా చేయండి

పామాయిల్‌ తోటలో జంటపాముల సయ్యాట.. ఆసక్తిగా చూసిన స్థానికులు

కూలిపోతున్న “డ్రీమ్‌ జాబ్‌” కలల సౌధం..

పోన్లే పాపం అని ఫోన్‌ ఇస్తే.. రూ.99 వేలు స్వాహా

పంటపొలాల్లో చేపల సందడి !! పట్టుకునేందుకు ఎగబడిన జనం