కూలిపోతున్న “డ్రీమ్ జాబ్” కలల సౌధం..
మారుతున్న జీవన శైలి, టెక్ కంపెనీల్లో వస్తున్న మార్పులు తమ కలల సాకారానికి విరుద్ధంగా ఉంటున్నాయని చెబుతున్నారు ‘జెన్ జీ’. 1997 నుంచి 2005 మధ్య జన్మించిన యువతకు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. కొవిడ్ సమయంలో ఐటీ కంపెనీలు లేఆఫ్స్ పేరుతో చాలామంది ఉద్యోగులను తొలగించారు. ‘జెన్ జీ’ యువతకు కొత్తగా టెక్ జాబ్స్ సంపాదించడం సవాలుగా మారింది.
మారుతున్న జీవన శైలి, టెక్ కంపెనీల్లో వస్తున్న మార్పులు తమ కలల సాకారానికి విరుద్ధంగా ఉంటున్నాయని చెబుతున్నారు ‘జెన్ జీ’. 1997 నుంచి 2005 మధ్య జన్మించిన యువతకు ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంది. కొవిడ్ సమయంలో ఐటీ కంపెనీలు లేఆఫ్స్ పేరుతో చాలామంది ఉద్యోగులను తొలగించారు. ‘జెన్ జీ’ యువతకు కొత్తగా టెక్ జాబ్స్ సంపాదించడం సవాలుగా మారింది. ఇప్పటికీ ఇది కొనసాగుతోంది. కొన్ని కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహించి నెలలు గడుస్తున్నా ఆఫర్ లెటర్ ఇవ్వకపోవడంతో అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. కాలం గడుస్తున్న కొద్దీ ‘డ్రీమ్‌జాబ్’ ఊహ నుంచి క్రమంగా బయటకొచ్చి ఇతర ఉద్యోగాలను ఎంచుకుంటున్నారు. సాఫ్ట్‌వేర్ కంపెనీలే ఉద్యోగులను తొలగించడంతోపాటు ఉన్నవారిపై పని ఒత్తిడి పెంచుతున్నాయి. 2022లో ప్రపంచవ్యాప్తంగా 1064 ప్రధాన కంపెనీలు 1,65,269 మంది ఉద్యోగులకు లేఆఫ్స్ ప్రకటించాయి. 2023లో 1193 సంస్థల నుంచి 2,64,220 మంది టెకీలు, 2024లో ఇప్పటి వరకు 398 కంపెనీల్లో 1,30,482 మంది సాఫ్ట్‌వేర్లను ఇంటికి పంపించాయి. వర్క్‌ఫ్రమ్ హోం ఇస్తున్నామనే ఉద్దేశంతో దాదాపు అన్ని కంపెనీలు నియమాలకంటే ఎక్కువ సేపు పని చేయిస్తున్నాయి. దాంతో ఉద్యోగుల వ్యక్తిగత జీవితాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. ఈ వ్యవహారాన్ని గమనిస్తున్న కొందరు ఉద్యోగార్థులు తమ చిన్నప్పటి ‘డ్రీమ్‌జాబ్’కు స్వస్తి పలుకుతున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
పోన్లే పాపం అని ఫోన్ ఇస్తే.. రూ.99 వేలు స్వాహా
పంటపొలాల్లో చేపల సందడి !! పట్టుకునేందుకు ఎగబడిన జనం
“టాడ్‌పోల్ వాటర్”తో అదుపులో బరువు.. వైరల్‌గా మారిన ఆరోగ్య చిట్కా
విమానం క్యూట్‌గా ఉందనా ?? లేక ప్రయాణికులు అందంగా ఉన్నారనా ??