Hyderabad: హైదరాబాద్ నగరవాసులకు గమనిక.. ఆ రెండు రోజులు నీటి సరఫరాకు అంతరాయం

Hyderabad Water Supply Alert: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 9,10 తేదీల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. ఈ మేరకు హైదరాబాద్ జలమండలి ఓ ప్రకటన విడుదల చేసింది.

Hyderabad: హైదరాబాద్ నగరవాసులకు గమనిక.. ఆ రెండు రోజులు నీటి సరఫరాకు అంతరాయం
Hyderabad Water Supply
Follow us
Janardhan Veluru

|

Updated on: Aug 06, 2021 | 6:49 PM

Hyderabad Water Supply Alert: హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఈ నెల 9,10 తేదీల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది. ఈ మేరకు హైదరాబాద్ జలమండలి ఓ ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-2 రింగ్ మెయిన్-2 నాగోల్ జంక్షన్ వద్ద ఆటో టాక్ నుండి చర్బుజా మార్బుల్స్ వరకు గల 1600 ఎంఎం డయా ఎమ్ఎస్ మెయిన్ పైపులైన్ కు జంక్షన్ పనులు చేపడుతున్నారు. సోమవారం(09.08.2021) ఉదయం 6 గంటల నుండి మరుసటి రోజు  మంగళవారం (10.08.2021) ఉదయం 6 గంటల వరకు మొత్తం 24 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి. ఈ పనుల కారణంగా ఈ 24 గంటలు కింద ఇవ్వబడిన రిజర్వాయర్ ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:

1. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 2 – బాలాపూర్, మైసారం, బార్కాస్. 2. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 5 – మేకలమండి, భోలక్ పూర్. 3. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం.7 – తార్నాక, లాలాపేట్, భౌద్ధ నగర్, మారెడ్ పల్లి, కంట్రోల్ రూమ్, రైల్వేస్, ఎమ్ఈఎస్, కంటోన్మెంట్, ప్రకాష్ నగర్, పాటిగడ్డ. 4. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 9 – హస్మత్ పేట్, ఫిరోజ్ గూడ, గౌతమ్ నగర్. 5. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 10 – వైశాలినగర్, బీఎన్ రెడ్డి నగర్, వనస్థలిపురం, ఆటోనగర్, మారుతినగర్. 6. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 13 – మహింద్ర హిల్స్. 7.ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 14 – ఏలుగుట్ట, రామంతాపూర్, ఉప్పల్, నాచారం, హబ్సిగూడ, చిల్కానగర్, బీరప్పగడ్డ. 8. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 19 – బోడుప్పల్ లోని కొన్ని ప్రాంతాలు. 9. ఓ అండ్ ఎమ్ డివిజన్ నం. 20 – మీర్ పేట్, బడంగ్ పేట్, శంషాబాద్.

రేపు(శనివారం) ప‌లుచోట్ల మంచినీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం.. అలాగే శనివారం(ఆగస్టు 7)నాడు హైదరాబాద్‌లో పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలుగుతుంది.  మహానగరానికి మంచినీటి సరఫరా చేస్తున్న కృష్ణా ఫేస్-3 రింగ్ మెయిన్ -2 , పీర్జాదిగూడ‌ లోని మ‌ల్లిఖార్జున న‌గ‌ర్ వ‌ద్ద 1500 ఎంఎం డ‌యా ఆఫ్ టేక్ పైప్ లైన్ కు 500 ఎంఎం డయా వాల్వ్ లు అమ‌ర్చే పనులు చేప‌డుతున్నారు. కావున రేపు అన‌గా తేదీ: 07.08.2021, శ‌నివారం ఉదయం 6 గంటల నుండి అదే రోజు సాయంత్రం 6 గంటల వరకు మొత్తం 12 గంటల పాటు ఈ పనులు కొనసాగుతాయి. దీంతో ఈ 12 గంటలు కింద ఇవ్వబడిన ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని జలమండలి ఓ ప్రకటనలో తెలిపింది.

రేపు(ఆగస్టు 7) అంత‌రాయం ఏర్ప‌డే ప్రాంతాలు: బోడుప్పల్ మున్సిప‌ల్ కార్పొరేషన్, పీర్జాదిగూడ మున్సిప‌ల్ కార్పొరేషన్, పోచారం మున్సిపాలిటీ, అల్వాల్ మున్సిపాలిటీ ప్రాంతం, మౌలాలి, హౌసింగ్ బోర్డు, నాచారం, సైనిక్ పురి, కాప్రా, కుత్బుల్లాపూర్, హస్మత్‌పేట్, గన్‌రాక్.

నీటి సరఫరాలో అంతరాయం కలిగే రోజుల్లో ఆ ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోవాలని హైదరాబాద్ జలమండలి ఓ ప్రకటనలో కోరింది.

Also Read..

నెలలో 12 రోజుల పాటు ఎమ్మెల్యేలు గ్రామ సచివాలయాల సందర్శన చేయాలని నిర్ణయం : పేర్ని నాని

Mahesh Babu: నయా లుక్‌‌‌‌లో కనిపించిన సూపర్ స్టార్.. సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ఫ్యాన్స్..