Hyderabad: ఉన్నట్టుండి కూలిపోయిన నాలా.. పలువురికి గాయాలు.. షాకింగ్ దృశ్యాలు
గోషామహల్‌లో షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. చక్నవాడి వద్ద నాలా ఒక్కసారిగా కుంగిపోయింది. దీంతో పలువురికి గాయాలయ్యాయి.
అటెన్షన్ ప్లీజ్.. నాలాపై నుంచి నడుస్తున్నారా? అయితే జరభద్రం. అది కూలడానికి సిద్ధంగా ఉండొచ్చు. లేదంటే ఎప్పుడైనా కూలిపోవచ్చు. హైదరాబాద్ గోషామహల్‌లో సరిగ్గా ఇదే జరిగింది. అక్కడి రోడ్డు, నాలా దృశ్యాలు చూస్తే.. వెన్నులో వణుకు పడుతోంది. హైదరాబాద్ గోషామహల్ చాక్నవాడిలో నాలా ఉన్నట్టుండి కుంగిపోయింది. దానిపై నిలిపి ఉన్న కార్లు, ఆటోలు, కూరగాయల బండ్లు, ద్విచక్ర వాహనాలు ధ్వంసమయ్యాయి. ఇవాళ శుక్రవారం మార్కెట్ కావడంతో ఆ ప్రాంతంలో రద్దీ ఎక్కువగా ఉంది. దీంతో మార్కెట్లో కూరగాయల దుకాణాలు సహా నాలాలో పడిన కొంతమందికి గాయాలయ్యాయి. ఘటన జరిగిన వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు.. అక్కడి నుంచి జనాన్ని తరలిస్తున్నారు. డీఆర్‌ఎఫ్ బృందాలతో సహాయక చర్యలు సాగిస్తున్నారు. నాలా కుంగడంపై కారణాలు అంతుచిక్కడం లేదు. ఈ ఘటనతో ఎప్పుడు ఏం కూలుతుందో అన్న భయాందోళనలో ఉన్నారు స్థానికులు.
నాలా గురించి వివరాలు
– నాలా మీద సిమెంట్ స్లాబ్ వేసి దానిపై రోడ్డు వేశారు. – స్లాబ్ వేసిన మొత్తం రోడ్డు పొడవు 500 అడుగులు – పది అడుగుల వెడల్పుతో కూలిన రోడ్డు మొత్తం పొడవు 70 అడుగులు – కిందకు చూస్తే కళ్లు బైర్లుగమ్మేలా 12 అడుగుల మేర కుంగింది నాలా.. !
ఘటన గురించి తెలియగానే స్పాట్‌కు చేరుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్.. పరిస్థితిని సమీక్షించారు. స్థానికులతో మాట్లాడారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..