Hyderabad: కైకాలకు సీఎం కేసీఆర్ నివాళి.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఆదేశం

సినీ నటుడు మాజీ ఎంపీ శ్రీ కైకాల సత్యనారాయణ చేసిన సేవలకు గౌరవంగా, ఆయన అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

Hyderabad: కైకాలకు సీఎం కేసీఆర్ నివాళి.. అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఆదేశం
CM KCR condoles death of actor Kaikala Satyanarayana
Follow us
Ram Naramaneni

|

Updated on: Dec 23, 2022 | 3:29 PM

దివికేగిన దిగ్గజ నటుడికి… సినీ, రాజకీయ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌… కైకాల సత్యానారాయణ పార్థివ దేహానికి నివాళులర్పించారు. కైకాల కుటుంబసభ్యులను పరామర్శించారు. కైకాల సత్యనారాయణ మరణం తెలుగు చలన చిత్ర రంగానికి తీరని లోటని సీఎం విచారం వ్యక్తం చేశారు. తెలుగు చలన చిత్ర రంగంలో తొలితరం నటుడిగా విభిన్న పాత్రలను పోషిస్తూ, తమ వైవిధ్యమైన నటన ద్వారా, మూడు తరాల ప్రేక్షకుల అభిమానాన్ని పొందారని సీఎం గుర్తుచేసుకున్నారు.  ఇప్పటికే, కైకాల అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించారు కేసీఆర్‌. శనివారం మహాప్రస్థానంలో జరిగే అంత్యక్రియలకు ఏర్పాట్లు చేయాలని సీఎస్‌ను ఆదేశించారు. ఏర్పాట్లను దగ్గరుండి పరిశీలించాలని జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గొపినాథ్‌కు సూచించారు.

పెద్ద ఎన్టీఆర్‌తో కైకాలకు ప్రత్యేక అనుబంధం

తనదైన నటనను ప్రదర్శించే పాత్రలు వచ్చిన ప్రతీసారి వెండితెరపై చెలరేగిపోయిన సత్యనారాయణ.. మిగిలిన సమయాల్లో విలన్​గా, కామెడీ విలన్​గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా మంచి పాత్రలను పోషించారు. అడవిరాముడు, వేటగాడు సినిమాల్లో విభిన్నమైన కామెడీ విలన్‌ పాత్రలు పోషించి అద్భుతంగా మెప్పించిన సత్యనారాయణ నటనకు సరికొత్త భాష్యం చెప్పారు. మోస‌గాళ్ళకు మోస‌గాడు, దొంగ‌ల వేట మొద‌లైన సినిమాల్లో ఆయ‌న పోషించిన విల‌న్ పాత్రలు మ‌ర్చిపోలేనివి.

— సత్యనారాయణకు ఎన్టీఆర్​తో ఉన్న ప్రత్యేక అనుబంధాన్ని కచ్చితంగా చెప్పుకుని తీరాల్సిందే. సత్యనారాయణ ఎదుగుదలలో రామారావు పాత్ర కీలకమని సత్యనారాయణే చాలా సందర్భాల్లో చెప్పారు. సినిమాల్లోకి రావటానికి ఎన్టీఆర్​కు దగ్గర పోలికలు ఉండటం ఓ కారణమైతే.. నటించి నిరూపించుకోవటానికి అవకాశాలే లేనప్పుడు ఎన్టీఆర్​కు డూప్ గా చేసిన పాత్రలే ఆయనకు దగ్గర చేశాయి అంటారు సత్యనారాయణ.

— ఎన్టీఆర్, సత్యనారాయణ కలిసి నటించిన సినిమాలు అక్షరాలా 100. ఓ క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఓ నటుడు కలిసి నటించిన అత్యధిక చిత్రాల రికార్డు దక్షిణాదిన వీరిదేనేమో. రాముడు-భీముడు సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ద్విపాత్రాభినయం కాగా…. ఓ పాత్రలో కైకాల సత్యనారాయణే ఎన్టీఆర్​కు డూప్​గా నటించారు. క్లైమాక్స్‌ సన్నివేశాల్లో, ఫైట్ సీన్లలో నేరుగా సత్యనారాయణే ఎన్టీఆర్‌గా నటించిన సందర్భాలు ఉన్నాయి.

— దీంతో ఎన్టీఆర్ పోషించటానికి వీలులేని పాత్రలన్నీ సత్యనారాయణ దగ్గరకు రావటం ప్రారంభించాయి. తన కోసం ఇంత కష్టపడుతున్న సత్యనారాయణ.. నటుడిగానూ నిరూపించుకోవాలని ఎన్టీఆర్ తాపత్రయ పడేవారట. అలా ఎన్నో పౌరాణిక చిత్రాల్లో తన పాత్ర తర్వాత అంత ప్రాధాన్యం ఉన్న పాత్రలను సత్యనారాయణకు ఇప్పించేవారట ఎన్టీఆర్. ఆ పాత్రతో ప్రేక్షకులచేత కన్నీరు పెట్టించి నటుడిగా తనేంటో నిరూపించుకునే అవకాశాన్ని ఎన్టీఆర్ కల్పించారంటూ చాలాసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నారు సత్యనారాయణ.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం చూడండి..

ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఈజీగా ఇంట్లోనే ఈ చికెన్ కట్‌లెట్ చేయండి.. స్నాక్స్‌గా అదురుతాయి..
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఏపీ కొత్త చీఫ్ సెక్రటరీగా విజయానంద్.. అధికారిక ఉత్తర్వులు
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
ఎయిర్‌పోర్ట్‌లో పోలీసుల తనిఖీలు.. చాక్లెట్ బాక్సులు చెక్ చేయగా..
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
టమాటా ఎండు చేపల కూర.. వేడి అన్నంతో తింటే అదుర్సే!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
గురు గ్రహం అనుకూలత.. ఆ రాశుల వారికి డబ్బే డబ్బు..!
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
ఇక ఆ రాశుల వారికి శని నుంచి విముక్తి.. వారికి ఆర్థిక వృద్ధి
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
అశ్వగంధ టీ.. ఈ ఒక్క ఛాయ్ తాగితే సీజనల్ వ్యాధులు పరార్..
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
స్టోర్‌ యజమాని బంపరాఫర్‌.. ఒక్కసారిగా వందల సంఖ్యలో ఎగబడ్డ జనం...
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
మెడ నొప్పితో బాధ పడుతున్నారా.. ఈ చిట్కాలతో ఈజీగా తగ్గుతుంది..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
బాలయ్య అన్ స్టాపబుల్‌లో డాకు మహారాజ్ టీమ్..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..