TRS Plenary: గులాబీమయమైన హైదరాబాద్‌.. టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో ప్రవేశపెట్టే తీర్మానాలు ఇవే..!

TRS Plenary: నేడు టీఆర్‌ఎస్‌ ప్లీనరీతో హైదరాబాద్‌ గులాబీమయం కానుంది. హైటెక్స్‌లో సోమవారం నిర్వహించే టీఆర్‌ఎస్ ప్లీనరీకి వివిధ జిల్లాల నుంచి పలువురు..

TRS Plenary: గులాబీమయమైన హైదరాబాద్‌.. టీఆర్‌ఎస్‌ ప్లీనరీలో ప్రవేశపెట్టే తీర్మానాలు ఇవే..!
Follow us
Subhash Goud

|

Updated on: Oct 25, 2021 | 10:08 AM

TRS Plenary: నేడు టీఆర్‌ఎస్‌ ప్లీనరీతో హైదరాబాద్‌ గులాబీమయం కానుంది. హైటెక్స్‌లో సోమవారం నిర్వహించే టీఆర్‌ఎస్ ప్లీనరీకి వివిధ జిల్లాల నుంచి పలువురు టీఆర్‌ఎస్ ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు హాజరుకానున్నారు. సోమవారం ఉదయం 10గంటల వరకు ఆహ్వానితులందరూ ప్లీనరీ ప్రాంగణానికి చేరుకోవాలని పార్టీ ఆదేశించింది. ఉదయం 10 నుంచి 10.30 వరకు ప్రతినిధుల పేర్ల నమోదు జరుగుతుంది. ఉదయం 11 గంటలకు పార్టీ ప్లీనరీ ప్రారంభం అవుతుంది.

ఈ టీఆర్‌ఎస్‌ ప్లీనరీకి అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేశారు. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీ ప్రతినిధులతో పాటు మొత్తం 6 వేల మంది వరకు తరలిరానున్నారు. పార్లమెంట్‌ సమావేశాలు, కరోనా కారణంగా మూడేళ్ల పాటు ప్లీనరీ సమావేశాలు జరగలేదు. ఇక ఈ సమావేశాల్లో పార్టీ అధ్యక్షుడి ఎన్నిక జరగనుంది. ఈసారి కూడా కేసీఆర్‌ను పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడం లాంఛనం కానున్నట్లు తెలుస్తోంది.

ప్లీనరీలో ప్రవేశపెట్టే తీర్మానాలు:

ఈ ప్లీనరీ సందర్భంగా పలు తీర్మానాలను ప్రవేశపెట్టనుంది టీఆర్‌ఎస్‌. ఎలాంటి తీర్మానాలంటే.. అధ్యక్షులకు అభినందన, టీఆర్‌ఎస్‌ విజయాలు, ఆవిష్కరణలు, సాగునీరు, వ్యవసాయం, గ్రామీణ అర్ధిక వ్యవస్థలకు పరిపుష్టి, సంక్షేమ తెలంగాణ సాకారం, పరిపాలనా సంస్కరణలు, విద్యుత్‌ రంగాభివృద్ధి, అలాగే పారిశ్రామిక అభివృద్ధి, ఐటీ రంగం అభివృద్ధి, మౌలిక వసతుల కల్పన, దేశానికే దిక్సూచి దళితబంధు, విద్యు, వైద్య రంగాల అభివృద్ధి, కేంద్ర ప్రభుత్వానికి టీఆర్‌ఎస్‌ వివిధ డిమాండ్లు తదితర తీర్మాణాలను ప్రవేశపెట్టనుంది టీఆర్‌ఎస్‌.

ఇవీ కూడా చదవండి:

TRS Plenary: నేడు హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ ప్లీనరీ.. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు.. భారీగా తరలిరానున్న నేతలు..!

Baby Born on Plane: విమాన ప్రయాణంలో జన్మించిన శిశువుకు ఏ దేశ పౌరసత్వం లభిస్తుంది..? ఆసక్తికర విషయాలు..!