AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smart AI Notebook: హైదరాబాద్ టెకీల అద్భుత సృష్టి.. అందుబాటులోకి AI నోట్‌బుక్‌.. ధర ఎంతో తెలిసా?

హైదరాబాద్‌ టెకీలు అద్భుతాన్ని సృష్టించారు. ప్రపంచంలోనే తొలి ఏఐ టెక్స్ట్‌ బుక్‌ను అందుబాలులోకి తీసుకొచ్చారు. తమ అద్భుత సృష్టితో ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నారు. పుస్తకాలు డైరీలు పక్కన పెట్టి కొత్త టెక్నాలజీతో రాతలు మార్చేలా హైదరాబాద్‌కు చెందిన క్వాడ్రిక్ ఐటీ సంస్థ రూపొందించిన ఈ సరికొత్త రీనోట్ ఏఐ నోట్ బుక్ చూపురులను హౌరా అనిపిస్తుంది.

Smart AI Notebook: హైదరాబాద్ టెకీల అద్భుత సృష్టి.. అందుబాటులోకి AI నోట్‌బుక్‌.. ధర ఎంతో తెలిసా?
Ai Notebook
Anand T
|

Updated on: Jul 30, 2025 | 7:55 PM

Share

రీనోట్ ఏఐ నోట్ బుక్ డిజిటల్ రాతల్లో కొత్త విప్లవం తీసుకొచ్చింది. పుస్తకాలు డైరీలు పక్కన పెట్టి కొత్త టెక్నాలజీతో రాతలు మార్చేలా హైదరాబాద్‌కు చెందిన క్వాడ్రిక్ ఐటీ సంస్థ రూపొందించిన ఈ సరికొత్త రీనోట్ ఏఐ నోట్ బుక్ చూపురులను హౌరా అనిపిస్తుంది. ఈ రీనోట్ ఏఐ నోట్ బుక్ అనేది ఒక స్మార్ట్, రీయూజ్ పరికరం. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఫిజికల్ రాతలను డిజిటల్ టెక్నాలజీతో కలిపి అద్భుతమైన అనుభవాన్ని అందిస్తుంది. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి AI-ఆధారిత రీయూజబుల్ నోట్ బుక్‌గా గుర్తించబడింది.

ప్రస్తుతం ఢిల్లీ ఎక్స్ ఫోలో ఈ ఏఐనోట్ బుక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. 25 పేజీలు ఉండే ఈ పుస్తకాన్ని హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్ సుమన్ బాలబొమ్మ సృష్టించారు. టెక్నాలజీని ఉపయోగించి చేతిరాతను డిజిటల్ టెక్స్ట్‌గా మార్చే వినూత్న ఆలోచన ఆచరణలో పెట్టి అందర్ని ఆశ్చర్య పరిచారుడు సుమన్. తాను రూపొందించిన పరికరం అందరికీ అందుబాటులో ఉండాలనే ఆలోచనతో దీని ధరను కూడా కేవలం రూ.999కే ఆయన అందుబాటులో ఉంచారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు, ప్రొఫెషనల్స్, క్రియేటివ్ వ్యక్తులకు ఒక ఇదొక సంపూర్ణ సొల్యూషన్‌గా మారనుంది.

ఈ సందర్భంగా సుమన్ బాబొమ్మ మాట్లాడుతూ.. ప్రస్తుతం టాప్ సిటీలు, ఇన్నోవేషన్‌ను ఇష్టపడే సంస్థలను టార్గెట్ చేసినా, త్వరలో చిన్న టౌన్లు, ప్రభుత్వ పాఠశాలలు, పల్లెటూళ్లకు కూడా దీన్ని తీసుకెళ్లాలన్నది తమ లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం లోకల్ భాషల్లో ట్రైనింగ్ ఇస్తూ, అందరికీ ఈ టెక్నాలజీని పరిచయం చేస్తామన్నారు. ReNote AIకి దుబాయ్, జపాన్ వంటి దేశాల్లో జరిగిన టెక్ ఈవెంట్లలో సూపర్ రెస్పాన్స్ వచ్చిందని ఆయన తెలిపారు. జపాన్ ప్రభుత్వం సబ్సిడీ కూడా ఆఫర్ చేసినట్టు పేర్కొన్నారు. మన దేశంలో గూగుల్, కేంద్ర IT శాఖ కలిసి గుర్తించిన టాప్ 100 యాప్స్‌లో ఇదీ ఒకటి అని ఆయన తెలిపారు. ఇండియన్ టెక్నాలజీ ప్రపంచాన్ని ఎలా నడిపించగలదో చెప్పడానికి ఇదే నిదర్శనమని సుమన్ చెప్పుకొచ్చారు.

వీడియో చూడండి..

మరిన్ని సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.