AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TV9 Seed Ball Campaign 2025: టీవీ9 సీడ్‌బాల్ క్యాంపెయిన్ అభినందనీయం.. మంత్రి కొండా సురేఖ

TV9 సీడ్‌బాల్ కార్యక్రమాన్ని తాజాగా గుమ్మడివల్లి ఫారెస్ట్‌ ఏరియాలో చేపట్టింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. టీవీ9 సీడ్ బాల్ ప్రచారాన్ని మంత్రి కొండా సురేఖ ఈ సందర్భంగా ప్రశంసించారు. ఇది చాలా మంచి కార్యక్రమం అని.. పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ తొడ్పడాలని పిలుపునిచ్చారు.

TV9 Seed Ball Campaign 2025: టీవీ9 సీడ్‌బాల్ క్యాంపెయిన్ అభినందనీయం.. మంత్రి కొండా సురేఖ
Tv9 Seed Ball Campaign 2025
Shaik Madar Saheb
|

Updated on: Jul 30, 2025 | 2:05 PM

Share

పర్యావరణ పరిరక్షణలో భాగంగా టీవీ9 నెట్‌వర్క్ సీడ్ బాల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా పచ్చదనాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా సీడ్‌బాల్ కార్యక్రమాన్ని నిర్వహించడంతోపాటు.. పర్యావరణ పరిరక్షణ తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కలిగిస్తోంది టీవీ9 నెట్‌వర్క్.. పర్యావరణ అనుకూల పద్ధతులను ప్రోత్సహించాలనే లక్ష్యంతో.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా సీడ్‌బాల్ క్యాంపైన్ ను నిర్వహిస్తోంది.. TV9 సీడ్‌బాల్ కార్యక్రమాన్ని తాజాగా గుమ్మడివల్లి ఫారెస్ట్‌ ఏరియాలో చేపట్టింది. ఈ కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు. టీవీ9 సీడ్ బాల్ ప్రచారాన్ని మంత్రి కొండా సురేఖ ఈ సందర్భంగా ప్రశంసించారు. ఇది చాలా మంచి కార్యక్రమం అని.. పర్యావరణ పరిరక్షణకు ప్రతిఒక్కరూ తొడ్పడాలని పిలుపునిచ్చారు. ఓపెన్‌ ఫారెస్ట్‌లో చెట్లను నాటడం కష్టంగా మారినప్పుడు ఈ సీడ్‌ బాల్ (విత్తన బంతులు) కార్యక్రమం బాగా పనిచేస్తుందన్నారు. పర్యావరణానికి మేలు చేసే ఇలాంటి కార్యక్రమాలు అవసరం అని.. ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ భాగస్వామ్యం కావాలని సూచించారు.

వీడియో చూడండి..

అత్యధిక అర్బన్‌ ఫారెస్ట్రీ ఉన్న ప్రాంతం హైదరాబాద్‌ అని..  హైదరాబాద్‌లో పొల్యూషన్‌ కూడా అధికంగానే ఉందని మంత్రి పేర్కొన్నారు.  పరిశ్రమల పరిసర ప్రాంతాల్లో మొక్కలు పెంచాలి.. పటాన్‌చెరువు లాంటి ప్రాంతాల్లోని.. పరిశ్రమలను దూరంగా తరలించాలని ఆదేశాలు ఇచ్చామని..  మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.

సీడ్ బాల్ ప్రచారం అంటే పలు రకాల విత్తనాలను మట్టి, కంపోస్ట్ వంటి వాటితో కలిపి బంతులుగా చేసి, వాటిని వివిధ ప్రదేశాలలో విసిరేయడం ద్వారా మొక్కలు మొలకెత్తించే ఒక పర్యావరణ కార్యక్రమం.. ఇది పచ్చదనం పెంపొందించడానికి, పర్యావరణాన్ని పరిరక్షించడానికి దోహదం చేస్తుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..