MMTS Trains Cancelled: ప్రయాణికులకు అలర్ట్.. హైదరాబాద్‌లో 34 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు..
హైదరాబాద్ - లింగంపల్లి మధ్య నడిచే 18 సర్వీసులను, ఫలక్‌నుమా - లింగంపల్లి మధ్య నడిచే 14 సర్వీసులతోపాటు సికింద్రాబాద్ - లింగంపల్లి మధ్య నడిచే 2 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసినట్లు పేర్కొంది.
హైదరాబాద్‌లో రేపు అంటే మే 29, ఆదివారం నాడు 34 ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు కానున్నాయి. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనను విడుదల చేసింది. హైదరాబాద్ – లింగంపల్లి మధ్య నడిచే 18 సర్వీసులను, ఫలక్‌నుమా – లింగంపల్లి మధ్య నడిచే 14 సర్వీసులతోపాటు సికింద్రాబాద్ – లింగంపల్లి మధ్య నడిచే 2 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేసినట్లు పేర్కొంది.
లింగపల్లి-హైదరాబాద్ రూట్ లో మొత్తం 9 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు.
47129, 47132, 47133, 47135, 47136, 47137, 47138, 47139, 47140 ఈ ట్రైన్ సర్వీసులు రద్దయ్యాయి.
హైదరాబాద్-లింగపల్లి మార్గంలో 9 సర్వీసులు రద్దయ్యాయి.
47105, 47109, 47110, 47111, 47112, 47114, 47116, 47118, 47120 సర్వీసులను రద్దు చేశారు.
ఫలక్ నుమా-లింగంపల్లి రూట్లో 7 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు.
47153, 47164, 47165, 47166, 47203, 47220, 47170 సర్వీసులను రద్దు చేశారు.
లింగంపల్లి-ఫలక్ నుమా మార్గంలో 7 ఎంఎంటీఎస్ సర్వీసులు రద్దు.
47176, 47189, 47210, 47187, 47190, 47191, 47192 సర్వీసులను రద్దు చేశారు.
సికింద్రాబాద్-లింగంపల్లి మార్గంలో 47150 నంబర్ గల సర్వీసును రద్దు చేశారు. అలాగే లింగంపల్లి-సికింద్రాబాద్ మార్గంలో 47195 ఎంఎంటీఎస్ సర్వీసులను క్యాన్సిల్ చేశారు.