Hyderabad: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 20 మంది?

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రాయదుర్గం పీఎస్‌ దగ్గర ప్రైవేటు హోటల్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Hyderabad: హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న 20 మంది?
Fire Accident
Follow us
Venkata Chari

| Edited By: Srinivas Chekkilla

Updated on: May 28, 2022 | 12:46 PM

రాయదుర్గంలోని ఓ హోటల్‌లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హోటల్లో భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల ధాటికి హోటల్‌లోని జనం, సిబ్బంది బయటకు పరుగులు తీశారు.  అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నారు. ఈ ప్రమాదంతో హోటల్‌ పరిసరాల్లో పొగలు దట్టంగా అలముకున్నాయి. ప్రమాదానికి విద్యుదాఘాతమే కారణమని హోటల్‌ సిబ్బంది చెబుతున్నారు.

మొదట భవనంలోని రెండో అంతస్తులో మంటలు చెలరేగి మూడో అంతస్తుకు వ్యాపించాయి. యాక్షన్‌ గార్డింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సిబ్బందికి కేటాయించిన కార్యాలయంలో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో కార్యాలయంలో 15 మంది సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. మంటల్లో చిక్కుకున్న వారిని అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు క్రేన్‌ ద్వారా కిందకి దించారు. దట్టమైన పొగతో ఊపిరాడక ఇబ్బందిపడినవారికి ప్రాథమిక చికిత్స అందించారు. 4 అగ్నిమాపక యంత్రాలతో మంటలార్పుతున్నారు. ఆ హోటల్‌లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
నువ్వు గల్లీ క్రికెట్‌ ఆడుతున్నావా? జైస్వాల్‌కు రోహిత్ వార్నింగ్
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
ఇంటి వద్దనే డైట్ చేస్తూ ఏకంగా 18 కేజీల బరువు తగ్గిన లేడీ..
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
హార్మోన్ ఇన్‌‌బ్యాలెన్స్ వల్లే కంట్రోల్ తప్పాను.. విష్ణుప్రియ
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
Jio, Airtel నుంచి దిమ్మదిరిగే ప్లాన్‌.. రూ.650తో ఏడాది పాటు డేటా
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
యాదాద్రి జిల్లాలో నకిలీ కరెన్సీ కలకలం..కేటుగాళ్ల టార్గెట్‌ ఎవరంటే
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..