Sarkaru Vaari Paata: ఓటీటీలోకి సర్కారు వారి పాట.. డేట్ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే?

ఈ సంవత్సరం 12 రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాగా రికార్డు సృష్టించింది. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురించి తాజా సమాచారం నెట్టింట్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది.

Sarkaru Vaari Paata: ఓటీటీలోకి సర్కారు వారి పాట.. డేట్ ఫిక్స్.. వచ్చేది ఎప్పుడంటే?
Sarkaru Vaari Patta Ott Release Date
Follow us
Venkata Chari

|

Updated on: May 28, 2022 | 8:01 AM

Sarkaru Vaari Paata OTT Streaming: సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు(Mahesh Babu), కీర్తి సురేష్(Keethy Suresh) జంటగా నటించిన ‘సర్కారు వారి పాట’ సినిమా థియేటర్లలో విడుదలై రెండు వారాలైంది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. కాగా, మొదటి రోజే ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లు వసూళ్లు చేసింది. అయితే, ఐదు రోజుల్లోనే రూ.160.2 కోట్ల గ్రాస్‌, రూ. 100.44 కోట్ల షేర్‌ని సాధించింది. మొత్తానికి సర్కారు వారి పాట రూ.200 కోట్ల క్లబ్బులో జయిన్ అయింది. కాగా, ఈ సంవత్సరం 12 రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాగా రికార్డు సృష్టించింది. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురించి తాజా సమాచారం నెట్టింట్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. సర్కారు వారి పాట సినిమా త్వరలోనే OTTలో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.

తాజా నివేదికల ప్రకారం, ఈ సినిమా జూన్ 10 లేదా జూన్ 24న ప్రముఖ OTT ప్లాట్‌ఫారమ్‌ అమెజాన్‌లో విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతానికి దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. సముద్రఖని, నదియా, సుబ్బరాజు, బ్రహ్మాజీ, వెన్నెల కిషోర్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సంగీతం థమన్ స్వరాలు సమకుర్చారు.

ఇవి కూడా చదవండి

కాగా, మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో తన తదుపరి సినిమాకు సిద్ధమవుతున్నాడు. ఇది వచ్చే నెలలో సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా , ‘SVP’కి సంగీతం అందించిన ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం అందించనున్నారు. ఇతర నటీనటులు, సిబ్బందికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో విడుదల కానున్నాయి.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే