AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: మీరు వాడేదంతా ఈ నూనే.. పైకి లేబుల్ ఒరిజినల్.. లోపల సరుకు మాత్రం..

హలీమ్‌ సీజన్‌ షురూ అయ్యింది...! ఆయిల్‌కి యమా డిమాండ్‌ పెరిగింది...! ఇంకేముంది కల్తీగాళ్లకు క్రియేటివిటీ కూడా ఎక్కువైంది. లేబుల్స్‌ మార్చి రెచ్చిపోతున్నారు. బ్రాండ్‌ పేరును కాస్త అటూఇటుగా చేసి కల్తీ నూనె రవాణా చేస్తూ జనాల ఆరోగ్యానికి బ్యాండ్‌ వేస్తున్నారు. హైదరాబాద్‌ మలక్‌పేటలో వెలుగుచూసిన ఘటన షాక్‌కు గురిచేస్తోంది. డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్‌ పేరుతో నడుస్తున్న దందా పోలీసులనే అవాక్కయ్యేలా చేస్తోంది.

Hyderabad: మీరు వాడేదంతా ఈ నూనే.. పైకి లేబుల్ ఒరిజినల్.. లోపల సరుకు మాత్రం..
Cooking Oil
Noor Mohammed Shaik
| Edited By: |

Updated on: Mar 13, 2025 | 12:06 PM

Share

హైదరాబాద్‌ మహబూబ్‌ మాన్షన్‌గా పిలువబడే మలక్‌పేట గంజ్‌ మార్కెట్‌లో అక్రమ దందా గుట్టురట్టయింది. ప్రముఖ కంపెనీల పేరుతో అందమైన ప్యాకింగులు, కంపెనీల లేబుళ్లతో పాటు అనేక ప్రమాణాలను పాటిస్తున్నామనే డిస్ట్రిబ్యూటర్ల ప్రకటనలు అంతా బూటకమని టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల సోదాల్లో తేలింది.

నాసిరకం వంటనూనెకు కంపెనీ లేబుళ్లు వేసి నాణ్యమైన వంట నూనెగా విక్రయాలు జరుపుతున్నారు కేటుగాళ్లు. హలీమ్‌ సీజన్‌ కావడంతో లారీలకొద్దీ కల్తీ నూనె షాపులకు తరలిస్తున్నారు. మలక్‌పేటలోని శ్రీ గణేష్ బాలాజీ ఆయిల్‌ కంపెనీ షాపుపై దాడులు నిర్వహించిన సౌత్ ఈస్ట్‌ టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు… షాకింగ్‌ విషయాలు వెల్లడించారు. అధిక లాభాల కోసం వంట నూనెతో అక్రమ దందా చేస్తున్నారని గుర్తించారు. ప్రముఖ ఆయిల్ కంపెనీ డిస్ట్రిబ్యూటర్‌గా చెప్పుకుంటూ రెచ్చిపోతున్నారని తెలిపారు. గోడౌన్‌ డ్రమ్ముల్లో ఉన్న నూనెను 20 లీటర్ల క్యానుల్లో హోటళ్లకు తరలిస్తున్నట్లు తేల్చారు. అంతేకాదు పెద్ద ఎత్తున పేరున్న కంపెనీల కార్టన్లను పోలి ఉన్న ఖాళీ అట్టపెట్టెలు, ప్రముఖ కంపెనీల లేబుళ్లు గుట్టలుగా పడి ఉండటం చూసి అవాక్కయ్యారు. గోదాము నిండా ఆయిల్ నింపని నూనె డబ్బాలు దర్శనమివ్వడంతో అసలీ దందా ఎప్పటినుంచి జరుగుతోంది…? ఇప్పటివరకూ ఎంత కల్తీ నూనె సప్లై చేశారన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
భారీగా పెరిగిన కరివేపాకు ధరలు.. సామాన్యులకు షాక్
భారీగా పెరిగిన కరివేపాకు ధరలు.. సామాన్యులకు షాక్
టీ20 ప్రపంచ కప్‌ 2026లో తొలిసారి ఇలా.. చెత్త జాబితాలో ఆ ప్లేయర్
టీ20 ప్రపంచ కప్‌ 2026లో తొలిసారి ఇలా.. చెత్త జాబితాలో ఆ ప్లేయర్
ప్రపంచం ఎప్పుడు అంతం అవుతుంది..? డేట్ చెప్పిన బాబా వంగా..!
ప్రపంచం ఎప్పుడు అంతం అవుతుంది..? డేట్ చెప్పిన బాబా వంగా..!
రోజుకు 8 రూపాయలు కడితే రూ.60 లక్షలు.. ఎస్‌బీఐ బంపర్ ఆఫర్..
రోజుకు 8 రూపాయలు కడితే రూ.60 లక్షలు.. ఎస్‌బీఐ బంపర్ ఆఫర్..
15 ఏళ్లు నిండిన అమ్మాయిలకు ప్రభుత్వం అలర్ట్.. ఉచితంగా వ్యాక్సిన్
15 ఏళ్లు నిండిన అమ్మాయిలకు ప్రభుత్వం అలర్ట్.. ఉచితంగా వ్యాక్సిన్
మీ ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతున్నారా? ఈ తప్పు చేశారంటే మీకే లాస్ !
మీ ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతున్నారా? ఈ తప్పు చేశారంటే మీకే లాస్ !
కుర్రాళ్లను ఉర్రుతలూగించిన ఫోక్ సాంగ్..
కుర్రాళ్లను ఉర్రుతలూగించిన ఫోక్ సాంగ్..
ఆ రూల్ బ్రేక్ చేసిన రోహిత్ శర్మ.. శిక్షకు సిద్ధమైన బీసీసీఐ..?
ఆ రూల్ బ్రేక్ చేసిన రోహిత్ శర్మ.. శిక్షకు సిద్ధమైన బీసీసీఐ..?
చిరంజీవి చేతికి కట్టు.. అభిమానుల్లో ఆందోళన.. ఏం జరిగిందంటే?
చిరంజీవి చేతికి కట్టు.. అభిమానుల్లో ఆందోళన.. ఏం జరిగిందంటే?
ఆచారం కాదు.. సైన్స్..! మొలతాడు కట్టుకోవడం వల్ల ఎన్ని లాభాలో..
ఆచారం కాదు.. సైన్స్..! మొలతాడు కట్టుకోవడం వల్ల ఎన్ని లాభాలో..