AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Curry Leaves: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరిగిన కరివేపాకు ధరలు.. ఇప్పుడు ఎంతంటే..?

సామాన్యులకు షాక్ తగిలింది. రోజూ వంటిల్లో ఉపయోగించే కరివేపాకు ధరలు భారీగా పెరిగాయి. మొన్నటివరకు కేజీ రూ.30కే లభించగా.. ఇప్పుడు మూడు రెట్లు ధరలు పెరిగాయి. పెరిగిన ధరలతో కరివేపాకు కొనుగోలు చేయాలంటేనే కస్టమర్లను భయపడుతున్నారు. ధరలు పెరగడానికి కారణాలు ఏంటంటే..

Curry Leaves: సామాన్యులకు మరో షాక్.. భారీగా పెరిగిన కరివేపాకు ధరలు.. ఇప్పుడు ఎంతంటే..?
Curry Leaves
Venkatrao Lella
|

Updated on: Feb 16, 2026 | 12:38 PM

Share

వంటిట్లో కూరివేపాకు లేనిది ఏ పని జరగదు. ఏ కూర వండాలన్నా కరివేపాకు తప్పనిసరి. ఇది వేయనిది ఏ కూరకు అంతగా టేస్ట్ రాదు. ఇక నాన్ వెజ్ వంటకాల్లో అయితే కరివేపాకుకు మరింత ప్రత్యేకత ఉంది. దీంతో వంటిట్లో ఎప్పుడూ కరివేపాకు అందుబాటులో ఉంచుకుంటారు. ఇక కరివేపాకు వల్ల కూరకు అదనపు రుచి రావడమే కాకుండా దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ కారణంతో ఏ కూరలో అయినా కరివేపాకు తప్పనిసరిగా వాడుతూ ఉంటారు. అయితే సామాన్యులకు షాక్ తగిలింది. రోజూ వంటిట్లో వాడే కరివేపాకు ధరలు భారీగా పెరిగాయి. ఒకేసారి మూడు రెట్లు పెరగడంతో వీటిని కొనుగోలు చేయాలంటేనే సామాన్యులు జంకుతున్నారు.

కిలో రూ.100కు చేరుకున్న ధర

ఈ నెల ప్రారంభంలో కేజీ కరివేపాకు కేవలం రూ.30గా ఉంది. కానీ ఇప్పుడు ఏకంగా రూ.100 వరకు చేరుకకుంది. రిటైల్ మార్కెట్‌లో ప్రస్తుతం ఈ ధర పలుకుతుంది. కరివేపాకు దిగుబడి తగ్గడం, సరఫరా లేకపోవడంతో డిమాండ్ పెరిగింది. దీని కారణంగా కరివేపాకు ధరలు భారీగా పెరిగాయి. రానున్న కొన్ని రోజుల వరకు ఇలాగే ధరలు ఉండే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు. షాక్ కొట్టే ఈ ధరలతో సామాన్యులు కరివేపాకు వైపే చూడటం లేదు. ధర మరీ ఇంత ఎక్కువగా ఉంటే ఎలా కొనుగోలు చేస్తామంటూ కస్టమర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హోల్ సేల్ ధర రూ.55

హోల్‌సేల్‌ మార్కెట్ విషయానికొస్తే టన్ను కరివేపాకు రూ.55 పలుకుతుంది. రవాణా ఛార్జీలతో కలిపి కేజీ రూ.60 పడుతుండగా.. వ్యాపారులు కేజీ రూ.100కి విక్రయిస్తున్నారు. చలికాలం కారణంగా ఆకులు సరిగ్గా రావడం లేదు. పొగమంచు వల్ల రంగు మారిపోతుండటంతో పాడైపోతున్నాయి. పాడైనవాటిని విక్రయించడానికి కుదరదు. దీని వల్ల సరఫరా తగ్గిపోవడంతో డిమాండ్ పెరిగింది. కరివేపాకు పంట అనేది లాభంతో కూడుకున్నది. ఒకసారి పంట వేస్తే 20 ఏళ్ల పాటు దిగుబడి వస్తుంది. ఏడాదికి నాలుగు కోతలు వస్తాయి. కానీ వాతావరణ పరిస్థితులు, చీడపురుగుల సమస్య వల్ల దిగుబడి తగ్గిపోతుంది. ధరలు పెరగడానికి ఇవే కారణాలుగా తెలుస్తోంది,.

Follow Us
భారీగా పెరిగిన కరివేపాకు ధరలు.. సామాన్యులకు షాక్
భారీగా పెరిగిన కరివేపాకు ధరలు.. సామాన్యులకు షాక్
టీ20 ప్రపంచ కప్‌ 2026లో తొలిసారి ఇలా.. చెత్త జాబితాలో ఆ ప్లేయర్
టీ20 ప్రపంచ కప్‌ 2026లో తొలిసారి ఇలా.. చెత్త జాబితాలో ఆ ప్లేయర్
ప్రపంచం ఎప్పుడు అంతం అవుతుంది..? డేట్ చెప్పిన బాబా వంగా..!
ప్రపంచం ఎప్పుడు అంతం అవుతుంది..? డేట్ చెప్పిన బాబా వంగా..!
రోజుకు 8 రూపాయలు కడితే రూ.60 లక్షలు.. ఎస్‌బీఐ బంపర్ ఆఫర్..
రోజుకు 8 రూపాయలు కడితే రూ.60 లక్షలు.. ఎస్‌బీఐ బంపర్ ఆఫర్..
15 ఏళ్లు నిండిన అమ్మాయిలకు ప్రభుత్వం అలర్ట్.. ఉచితంగా వ్యాక్సిన్
15 ఏళ్లు నిండిన అమ్మాయిలకు ప్రభుత్వం అలర్ట్.. ఉచితంగా వ్యాక్సిన్
మీ ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతున్నారా? ఈ తప్పు చేశారంటే మీకే లాస్ !
మీ ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుతున్నారా? ఈ తప్పు చేశారంటే మీకే లాస్ !
కుర్రాళ్లను ఉర్రుతలూగించిన ఫోక్ సాంగ్..
కుర్రాళ్లను ఉర్రుతలూగించిన ఫోక్ సాంగ్..
ఆ రూల్ బ్రేక్ చేసిన రోహిత్ శర్మ.. శిక్షకు సిద్ధమైన బీసీసీఐ..?
ఆ రూల్ బ్రేక్ చేసిన రోహిత్ శర్మ.. శిక్షకు సిద్ధమైన బీసీసీఐ..?
చిరంజీవి చేతికి కట్టు.. అభిమానుల్లో ఆందోళన.. ఏం జరిగిందంటే?
చిరంజీవి చేతికి కట్టు.. అభిమానుల్లో ఆందోళన.. ఏం జరిగిందంటే?
ఆచారం కాదు.. సైన్స్..! మొలతాడు కట్టుకోవడం వల్ల ఎన్ని లాభాలో..
ఆచారం కాదు.. సైన్స్..! మొలతాడు కట్టుకోవడం వల్ల ఎన్ని లాభాలో..