AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: చిరంజీవికి ఏమయ్యింది? చేతికి కట్టుతో కనిపించిన మెగాస్టార్.. అభిమానుల్లో ఆందోళన

రీసెంట్ గా బయటకు వచ్చిన కొన్ని ఫొటోలు, వీడియోల్లో మెగాస్టార్ చిరంజీవి చేతికి కట్టుతో కనిపించారు. ఇవి నెట్టింట బాగా వైరలయ్యాయి. వీటిని చూసిన అభిమానులు చిరంజీవికి ఏమైందోనని ఆందోళన చెందుతున్నారు. మరి ఇంతకీ చిరు చేతికి ఏమయ్యింది? ఎందుకు షోల్డర్ బ్యాగ్ తో కనిపించారో తెలుసుకుందాం రండి.

Chiranjeevi: చిరంజీవికి ఏమయ్యింది? చేతికి కట్టుతో కనిపించిన మెగాస్టార్.. అభిమానుల్లో ఆందోళన
Chiranjeevi
Basha Shek
|

Updated on: Feb 16, 2026 | 12:01 PM

Share

మన శంకరవరప్రసాద్ గారు సినిమా తర్వాత మెగాస్టార్ చిరంజీవి పెద్దగా కనిపించలేదు. అయితే ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. వీటిని చూసి అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఎందుకంటే ఈ ఫొటోల్లో చిరంజీవి చేతికి కట్టుతో కనిపించారు. వివరాల్లోకి వెళితే.. మార్చి 6న అల్లు అరవింద్ చిన్న కుమారుడు అల్లు శిరీష్ పెళ్లి జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు అట్టహాసంగా జరుగుతున్నాయి. పెళ్లి శుభలేఖల పంపిణీ కూడా ప్రారంభించారు. ఈక్రమంలో అల్లు ఫ్యామిలీ మొదటి శుభలేఖను మెగాస్టార్ చిరంజీవికి ఇచ్చారు. అల్లు అరవింద్ తో పాటు ఆయన సతీమణి, అలు శిరీష్ తో కలిసి చిరంజీవి నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సంప్రదాయం ప్రకారం నూతన వస్త్రాలతో పాటు పెళ్లి శుభలేఖ ను చిరంజీవి-సురేఖ దంపతులకు అందించారు. అయితే ఈ ఫోటోల్లో చిరంజీవి ఎడమ చేతికి హ్యాండ్ బెల్ట్ వేసుకుని కనిపించారు. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. అసలు చిరంజీవి చేతికి ఏమయ్యింది. ఎందుకు ఇలా షోల్డర్ బ్యాగ్ తో కనిపించారు? అని ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.

రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి భుజానికి చిన్న సర్జరీ జరిగినట్లు తెలుస్తోంది. గత నెలలో ఈ శస్త్ర చికిత్స జరిగిందని సమాచారం. అందుకే భుజంపై ఒత్తిడి పడకుండా ఉండడం కోసమే చిరంజీవి ఈ హ్యాండ్ బెల్ట్ ను వాడుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇటీవల చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్ ను సందర్శించారు. అక్కడ కూడా తన అభిమానులతో కలిసి సరదాగా ఫొటోలు, వీడియోలు దిగారు. నొప్పిని భరిస్తూనే ఫ్యాన్స్ తో ఫొటోలు దిగారు మెగాస్టార్.

ఇవి కూడా చదవండి

చేతికి కట్టుతో చిరంజీవి.. వీడియో ఇదిగో..

ఇక చిరంజీవి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇందులో ప్రియమణి హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. అనస్వర రాజన్ లేదా సారా అర్జున్ ఎవరిలో ఒకరు చిరంజీవి కూతురిగా నటిస్తున్నట్లు సమాచారం. దీంతో పాటు ఇప్పటికే ప్రారంభమైన విశ్వంభర సినిమా కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి

Follow Us
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం... పెళ్లి బృందం కారును ఢీకొన్న వాహనం.. నలుగురు మృతి
Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం... పెళ్లి బృందం కారును ఢీకొన్న వాహనం.. నలుగురు మృతి
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో కొత్త పథకం
తెలంగాణ ప్రజలకు గుడ్‌న్యూస్.. అందుబాటులోకి మరో కొత్త పథకం
బిజీ లైఫ్‌లోనూ ఫిట్‌గా ఉండాలంటే ఈ చిన్న పని చేస్తే చాలు.. 
బిజీ లైఫ్‌లోనూ ఫిట్‌గా ఉండాలంటే ఈ చిన్న పని చేస్తే చాలు.. 
పరగడుపున ఉసిరికాయ తింటే ఏమవుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
పరగడుపున ఉసిరికాయ తింటే ఏమవుతుంది? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
ప్రపంచ కప్ 2027కు రోహిత్, కోహ్లీ టికెట్స్ కన్ఫర్మ్?
ప్రపంచ కప్ 2027కు రోహిత్, కోహ్లీ టికెట్స్ కన్ఫర్మ్?
సచిన్, కోహ్లీ సరసన కేఎల్ రాహుల్
సచిన్, కోహ్లీ సరసన కేఎల్ రాహుల్
చెక్‌ఇన్ సమయంలో మోగిన అలారం.. ప్రయాణికుడి బ్యాగ్ చెక్‌ చేయగా..
చెక్‌ఇన్ సమయంలో మోగిన అలారం.. ప్రయాణికుడి బ్యాగ్ చెక్‌ చేయగా..
బెండకాయ నీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?
బెండకాయ నీరు ఉదయాన్నే ఖాళీ కడుపుతో తాగితే ఏం జరుగుతుందో తెలుసా..?
లక్నో కొత్త కెప్టెన్‌గా 21 కోట్ల స్టార్‌ ప్లేయర్.. ఎవరంటే?
లక్నో కొత్త కెప్టెన్‌గా 21 కోట్ల స్టార్‌ ప్లేయర్.. ఎవరంటే?
లక్షకు దిగి వస్తున్న తులం బంగారం ధర.. ఒక్క రోజులోనే భారీ పతనం!
లక్షకు దిగి వస్తున్న తులం బంగారం ధర.. ఒక్క రోజులోనే భారీ పతనం!