అల్లూరి జిల్లా జీ మాడుగుల మండలంలోని మత్స్యపురం వద్ద విశాఖ పోలీసులు భారీ గంజాయి పట్టివేత జరిపారు. పోలీసుల తనిఖీల్లో కోటి రూపాయల విలువైన వెయ్యి కిలోల గంజాయి, దానిని తరలిస్తున్న బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో ఐదుగురు గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేశారు.