AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Adulteration Cases: ప్రజారోగ్యానికి తూట్లు.. కల్తీకాండలో హైదరాబాద్ టాప్..!

మీ అందరికి ఒక ఛాలెంజ్ మీరు అంత సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నారు అని గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలరా..? పైకి అంత బాగానే ఉన్నా, మీ ఒంటిలో అవయవాలు కల్తీ దాటికి ఎప్పుడో చిద్రమై ఉంటాయి..!అవును.. మీరు అవునన్నా కాదన్న ఇది కల్తీ లేని నిక్కాసైనా నిజం.. తినే తిండి నుండి పీల్చే గాలి వరకు ప్రతిదీకల్తీయే.. పాలు కల్తీ.. నూనే కల్తీ.. మందులు కల్తీ.. ఏ వస్తువును తీసుకున్నా హెల్త్‌..వెల్త్‌ రెండూ మటాషే.

Adulteration Cases: ప్రజారోగ్యానికి తూట్లు.. కల్తీకాండలో హైదరాబాద్ టాప్..!
Hyderabad Top In Food Adulteration
Peddaprolu Jyothi
| Edited By: |

Updated on: Apr 15, 2024 | 6:26 PM

Share

మీ అందరికి ఒక ఛాలెంజ్ మీరు అంత సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉన్నారు అని గుండెల మీద చేయి వేసుకుని చెప్పగలరా..? పైకి అంత బాగానే ఉన్నా, మీ ఒంటిలో అవయవాలు కల్తీ దాటికి ఎప్పుడో చిద్రమై ఉంటాయి..!అవును.. మీరు అవునన్నా కాదన్న ఇది కల్తీ లేని నిక్కాసైనా నిజం.. తినే తిండి నుండి పీల్చే గాలి వరకు ప్రతిదీకల్తీయే.. పాలు కల్తీ.. నూనే కల్తీ.. మందులు కల్తీ.. ఏ వస్తువును తీసుకున్నా హెల్త్‌..వెల్త్‌ రెండూ మటాషే.

కలికాలంలో కల్తీకాలమ్‌ రాకెట్‌లా దూసుకెళ్తోంది. బియ్యం, మసాలాలు, చాక్లెట్స్ బిస్కెట్లు ఐస్ క్రీములు అంతకు ఎందుకు కూరల్లో వేసుకునే అల్లం పేస్ట్ నుంచి ఫేస్ కి వేసుకున్న ఫేస్ ప్యాక్ వరకు అన్ని అన్ని కల్తీలే… ప్రస్తుతం ఈ కల్తీ మహమ్మారి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మెట్రోపాలిటీ నగరాల్లో విపరీతంగా పెరిగిపోతుంది.. అయితే నగరంలో ఈ కల్తీ మహమ్మారి టాప్ ప్లేస్ లో ఉంది. ఎన్నో విషయాలలో టాప్ ప్లేస్ లో ఉన్న హైదరాబాద్ కల్తీ లో కూడా టాప్ ప్లేస్ ను సొంతం చేసుకుంది.

ఎన్‌సీఆర్‌బీ నివేదిక ప్రకారం దేశంలోని 19 నగరాల్లో ఆహార కల్తీకి సంబంధించి 291 కేసులు నమోదు అయినట్లుగా తెలిసింది. వాటిలో 246 కేసులు హైదరాబాద్ ప్రాంతానికి చెందినవే అంటే తీవ్రత ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ మహానగరంలో అల్లం వెల్లుల్లితో సహా పాలు, మామిడి కాయలు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్, నిత్యవసర వస్తువులు ఇలా కోకోలలుగా కల్తీ చేసే విక్రయిస్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ని చెట్ల పేర్లతో ఏ మాత్రం అనుమానం రాకుండా పేస్టును తయారు చేస్తూ ఉంటే, చిన్నపిల్లలు ఎంతో ఇష్టంగా తినేటటువంటి ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ లలో కూడా నాణ్యత లేనటువంటి పదార్థాలను ఫుడ్ కలర్స్ ను వాడుతూ పిల్లల ప్రాణాలతో చల్లగాటమాడుతున్నారు.

మరోవైపు వేసవికాలంలో వచ్చేటటువంటి మామిడి కాయలను సైతం మందును పెట్టి త్వరగా పండేలా చేస్తూ మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఒకప్పుడు మే నెలలో రావలసినటువంటి మామిడి కాయలు ఇప్పుడు నగరంలో ఏప్రిల్ నెలలోనే మామిడి పండ్లు కనిపిస్తున్నాయి. దీంతో మార్కెట్లో మామిడి పండ్లను చూసి మే నెలలో రావలసినటువంటి పండ్లు ఇప్పుడే వచ్చాయి ఏంటి అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా వాటి ధరలు సైతం కిలో 400 రూపాయలు చెప్పడంతో షాక్ కి గురవుతున్నారు.

ఇక కొన్ని హోటల్స్ రెస్టారెంట్లో బల్లులు, బొద్దింకలు సైతం తినే ఆహార పదార్థంలో రావడంతో కష్టమర్లు ఫుడ్ అధికారులకు ఫిర్యాదు చేసిన ఘటనలు సైతం హైదరాబాదులో ఎక్కువగానే నమోదు అయ్యాయి. కల్తీ ఆహార పదార్థాలు కోకొల్లలుగా పెరిగిపోవడంతో పక్కా సమాచారం అందుకున్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేస్తున్నప్పటికీ పుట్టగొడుగుల్లా పుట్టుకుని వస్తున్నారు కల్తీ రాయుళ్లు. ఇప్పుడు ఎన్ సి ఆర్ బి ఇచ్చిన నివేదిక ప్రకారం తినే తిండి విషయంలో జాగ్రత్త వహించాలని సూచిస్తున్నారు వైద్యులు.

కొన్నేళ్లుగా ఈ కల్తీ దందా నడుస్తోంది. ఎన్ని లక్షలమంది ప్రజలు ఈ కల్తీ వస్తువుల తీసుకుని అనారోగ్యం బారిన పడుతున్నారో తల్చుకుంటేనే భయం వేస్తోంది..

మరిన్ని హ్యమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ్ క్లిక్ చేయండి..