Hyderabad: పోలీసులు సీజ్ చేసిన వాహనాలకు వేలం.. మీ వెహికల్ ఉంటే ఇలా వెంటనే ఇలా చేయండి!
Hyderabad: రాచకొండ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో సీజ్ అయిన బండ్లను అంబర్పేట్ లోని పోలి హెడ్ క్వార్టర్స్ లో ఉంచారు. అలా 261 బండ్లను ప్రభుత్వం వేలం వేయాలని నిర్ణయించిందని, అందులో వెహికల్స్ కు సంబంధించిన ఓనర్స్ ఎవరైనా ప్లేన్ చేయాలి అనుకుంటే..

వివిధ కారణాల చేత పోలీసులు వెహికల్స్ ని సీజ్ చేస్తారు. అలా ఏళ్ల తరబడి సీజ్ చేసిన వెహికల్స్ ఎవరూ క్లెయిమ్ చేసుకోకపోతే అవి అలాగే ఉండి తుప్పు పట్టి పాడైపోయే స్థితికి చేరుకుంటాయి. అలాంటి వాహనాలను పోలీసులు వేలం వేస్తుంటారు. వేలం వేసిన ప్రతిసారి కనీసం రెండు మూడు వందల వాహనాలు ఉంటాయి. అయితే వేలం వేసే ముందు దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది. పలానా పలానా ప్రాంతాల్లో వివిధ కారణాల చేత సీజ్ చేసిన వెహికల్స్ పోలీసులు వేలం వేయాలని నిర్ణయించుకున్నారంటూ మొదట ఒక పత్రిక ప్రకటన విడుదల చేస్తారూ. అందులో ఎవరైనా తమ వాహనాలు ఉన్నాయని భావిస్తే సంబంధిత వాహనానికి సంబంధించిన డాక్యుమెంట్స్ తీసుకొని బండి ఓనర్ మొదట పోలీసులను సంప్రదించాల్సి ఉంటుంది.
డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ జరిగిన తరువాత అన్నీ సరిగా ఉన్నాయని భావిస్తే వాహనాలను ఓనర్‌కి తిరిగి అప్పగిస్తారు. అయితే పత్రికా ప్రకటన విడుదల చేసినప్పటి నుంచి ఆరు నెలల సమయం వరకే తమ బండ్లను క్లెయిమ్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఆరు నెలల సమయం గడిచిపోయిన తరువాత ఆ వాహనాలను అన్ క్లైమెండ్ వెహికల్స్ గా గుర్తించి ప్రభుత్వం వేలం వేస్తుంది. బండి కండిషన్ ని బట్టి వాహనాల ధర నిర్ణయించబడుతుంది. కానీ ఓవరాల్ గా అతి తక్కువ రేట్ కి వాహనాలు వేలంలో దక్కించుకోవచ్చు. అయితే కొన్ని వాహనాల కండిషన్ బాగుండి చిన్న చిన్న రిపేర్లతో వాడుకునే అవకాశం ఉన్న కొన్ని వాహనాలు పూర్తిగా విరిగిపోయి తుప్పు పట్టి కేవలం స్క్రాప్కు మాత్రమే పనికొచ్చే కండిషన్ లో ఉంటాయి. అయినా కూడా అలాంటి వాహనాలను కొనుగోలు చేసి అందులోని విడిభాగాలను తీసి మార్కెట్లో సెకండ్ హ్యాండ్ కు అమ్మి డబ్బు సంపాదిస్తుంటారు.
ఇక రాచకొండ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లలో సీజ్ అయిన బండ్లను అంబర్పేట్ లోని పోలి హెడ్ క్వార్టర్స్ లో ఉంచారు. అలా 261 బండ్లను ప్రభుత్వం వేలం వేయాలని నిర్ణయించిందని, అందులో వెహికల్స్ కు సంబంధించిన ఓనర్స్ ఎవరైనా ప్లేన్ చేయాలి అనుకుంటే ఆరు నెలల లోపుగా ఒరిజినల్ డాక్యుమెంట్స్ తో రావాలని ఒక ప్రకటన విడుదల చేసింది. వెహికల్ వివరాలు తెలియాలంటే www . Rachakondapolice.telangana.gov.in వెబ్సైట్లో పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు. అందులో వెహికల్ ఫోటోతో పాటు వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఎప్పుడు ఎక్కడ సీజ్ చేయబడింది అనే వివరాలు ఉంటాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
