Hyderabad: పబ్బుల్లోకి స్నిపర్ డాగ్స్.. బెండు తీస్తారు జాగ్రత్త

డ్రగ్స్ నిర్మూలనపై దూకుడు పెంచింది తెలంగాణ ప్రభుత్వం. డ్రగ్స్ మాఫియా బెండు తీస్తున్నారు నార్కోటిక్ పోలీసులు. పబ్బులపై ఫోకస్ చేశారు. వీకెండ్‌ లో స్నిపర్‌ డాగ్స్‌తో ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. యువత డ్రగ్స్ దూరంగా ఉండాలని సూచిస్తున్నారు.

Hyderabad: పబ్బుల్లోకి స్నిపర్ డాగ్స్.. బెండు తీస్తారు జాగ్రత్త
Police Raids
Follow us

|

Updated on: Jul 01, 2024 | 8:21 AM

హైదరాబాద్‌లో డ్రగ్స్ రాకెట్‌పై నార్కోటిక్ బ్యూరో ఉక్కుపాదం మోపుతోంది. డ్రగ్‌ మాఫియా బెండు తీస్తున్నారు తెలంగాణ పోలీసులు. డ్రగ్స్‌ నిర్మూలనపై దూకుడు పెంచిన అధికారులు.. హైదరాబాద్‌లోని పలు పబ్స్‌లో నార్కోటిక్‌ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వీకెండ్ కావడంతో రాత్రిపూట అనూహ్యంగా స్నిపర్ డాగ్స్‌తో తనిఖీలు చేశారు. డ్రగ్స్ ని అరికట్టడంలో భాగంగా తనిఖీలు ముమ్మరం చేసినట్లు చెప్తున్నారు అధికారులు.

డ్రగ్స్‌ తీసుకుంటూ దొరికిన ప్రముఖ డీజే సిద్ధార్థ్

ఇప్పటికే నగరంలోని హైటెక్‌సిటీ దగ్గర నలుగురిని అదుపులోకి తీసుకున్నారు అధికారులు. అందులో ఒకరు డ్రగ్ సప్లయర్.. ముగ్గురు కన్జ్యూమర్లు ఉన్నట్లు గుర్తించారు. నిందితుల దగ్గర ఉన్న కేజిన్నర గంజాయి సీజ్ చేశారు. మరో డ్రగ్ సప్లయర్ పరారీలో ఉన్నట్లు చెప్పారు పోలీసులు. నిందితులపై గతంలోనూ కేసులు ఉన్నట్లు గుర్తించారు. మరోవైపు డ్రగ్స్ కేసులో డీజే సిద్ధార్థ్ అడ్డంగా దొరికిపోయాడు. కొంతకాలం నుంచి సిద్దార్థ పెద్ద మొత్తంలో ఎండీఎంఏ డ్రగ్స్ తీసుకుంటున్నట్లు నార్కోటిక్ బ్యూరో పోలీసులు గుర్తించారు. ఆయన కదలికలపై పక్కా ఫోకస్ పెట్టి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపుతున్నారు నార్కోటిక్ బ్యూరో పోలీసులు. మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లో నిత్యం బబ్బులకు వెళ్తున్న వారిపై ఫోకస్ పెట్టారు.

విద్యాసంస్థలు అలర్ట్‌గా ఉండాలని హెచ్చరిక

మరోవైపు స్కూల్స్, కాలేజీల్లో డ్రగ్స్ నిర్మూలనపైనా నార్కోటిక్ బ్యూరో ఫోకస్ పెట్టింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని.. డ్రగ్స్ నిర్మూలనకు మేనేజ్మెంట్లు సహకరించాలని కోరారు. ప్రతిరోజూ స్కూల్ బ్యాగులను చెక్ చేయాల్సిందేనన్నారు. విద్యాసంస్థల్లో అలర్ట్‌గా ఉండాలని యాజమాన్యాలను హెచ్చరించారు.

డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యంగా తెలంగాణ సర్కార్‌ కృషి చేస్తుంది. తెలంగాణ ప్రజలు డ్రగ్స్‌కి దూరంగా ఉండాలంటూ.. డ్రగ్స్ నిర్మూలనకు సహకరించాలంటూ ప్రచారాలు నిర్వహిస్తున్నారు. రీసెంట్‌గా డ్రగ్స్ రహిత తెలంగాణపై యాంటీ నార్కోటిక్‌ టీమ్‌కు సహకరిస్తూ తన వంతు బాధ్యతగా సోషల్ మీడియా ఎక్స్‌ వేదికగా చిరంజీవి స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. రాష్ట్రంలో ఎవరైనా డ్రగ్స్ విక్రయిస్తున్నా, కొనుగోలు చేస్తున్నా… వెంటనే యాంటీ నార్కోటిక్స్ బ్యూరోకు ఇన్ఫర్మేషన్‌ ఇవ్వాలని కోరారు. డ్రగ్స్ రహిత తెలంగాణలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని విజ్ఞప్తి చేశారు చిరంజీవి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..