Women’s day 2022: మహిళా అధికారికి అరుదైన గౌరవం.. తెలంగాణలో తొలి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా మధులత..

ఉమెన్స్‌ డే నేపథ్యంలో ప్రస్తుత కొత్తాల్‌ సీవీ ఆనంద్‌ దీనికి భిన్నంగా వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సిటీ పోలీసు విభాగంలో ఓ మహిళ ఇన్‌స్పెక్టర్‌ను శాంతిభద్రతల విభాగం పోలీసుస్టేషన్‌కు స్టేషన్‌ హౌస్‌..

Women's day 2022: మహిళా అధికారికి అరుదైన గౌరవం.. తెలంగాణలో తొలి స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా మధులత..
Hyderabad Police Appoints C
Follow us

|

Updated on: Mar 08, 2022 | 5:25 PM

ఉమెన్స్‌ డే (Women’s day 2022) నేపథ్యంలో ప్రస్తుత కొత్తాల్‌ సీవీ ఆనంద్‌(CP CV Anand) దీనికి భిన్నంగా వినూత్న నిర్ణయం తీసుకున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా సిటీ పోలీసు విభాగంలో ఓ మహిళ ఇన్‌స్పెక్టర్‌ను శాంతిభద్రతల విభాగం పోలీసుస్టేషన్‌కు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌గా (SHO) నియమిస్తున్నారు. మహిళా దినోత్సవం నేపథ్యంలో మంగళవారం రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌అలీ, కొత్వాల్‌ ఆనంద్‌ సమక్షంలో లాలాగూడా ఎస్‌హెచ్‌ఓగా సదరు అధికారిణి బాధ్యతలు స్వీకరించనున్నారు. 174 ఏళ్ల హైదరాబాద్‌ పోలీసు చరిత్రలో తొలిసారిగా ఒక మహిళ స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌గా వచ్చారు.. మహిళా దినోత్సవం రోజున 2002 బ్యాచ్‌ పోలీసు అధికారి మధులతను లాలాగూడ పోలీసు స్టేషన్‌ SHOగా నియమించారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో లాలాగూడ స్టేషన్ హౌస్ ఆఫీసర్‌గా మధులత విధులు నిర్వహించనున్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని పోలీసు విభాగంలో మహిళా సిబ్బంది, అధికారిణిల సంఖ్య చాలా తక్కువగా ఉండేది. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత పోలీసు నియామకాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ కల్పించారు. దీంతో నానాటికీ వీరి సంఖ్య పెరుగుతోంది. అదనపు డీజీ నుంచి కానిస్టేబుళ్ల వరకు కలిపి తెలంగాణలో ప్రస్తుతం 3,803 మంది ఉన్నారు. వీరు మాత్రమే కాకుండా హోంగార్డులు అదనంగా ఉన్నారు. ఇన్‌స్పెక్టర్‌ స్థాయిలో ఉన్న వారి సంఖ్యే 31గా ఉంది. అయితే వీరిలో ఏ ఒక్కరూ శాంతిభద్రతల విభాగం ఠాణాకు ఎస్‌హెచ్‌ఓగా లేరు. రాజధానిలోని మూడు కమిషనరేట్లలో ఇప్పటి వరకు ఇలాంటి నియామకం జరగలేదు.

అయితే.. అటవీ, ఎక్సైజ్, ఆర్టీఏ, రెవెన్యూ శాఖల్లో మాత్రం మహిళలను దీనికి సమానమైన హోదాల్లో నియమిస్తున్నా.. పోలీసు విభాగంలో మాత్రం ఎస్‌హెచ్‌ఓ నియామకం జరగలేదు. కేవలం మహిళ పోలీస్ స్టేషన్లు, ఉమెన్‌ సేఫ్టీ స్టేషన్లు, భరోస కేంద్రాలు, లేక్‌ పోలీస్‌ స్టేషన్‌ వంటి వాటికి మాత్రమే మహిళల అధికారులు నేతృత్వం వహిస్తున్నారు. ఇది వారిలో ఆత్మన్యూనతా భావానికి కారణం అవుతోందని.. ఫలితంగా ప్రతిభ ఉన్న వారికీ తమ పనితీరు ప్రదర్శించే అవకాశం ఉండట్లేదని కొత్తాల్‌ సీవీ ఆనంద్‌ భావించారు.

దీంతో ఎస్‌హెచ్‌ఓగా అవకాశం ఇస్తే ఆ స్ఫూర్తితో ప్రస్తుతం డిపార్ట్‌మెంట్‌లో ఉన్న, భవిష్యత్‌లో అడుగుపెట్టనున్న వాళ్లూ సమర్థవంతంగా పని చేస్తారని నిర్ణయం తీసుకున్నారు. సీపీ ఆనంద్ ఆలోచన మేరకు మహిళ ఇన్‌స్పెక్టర్‌ను ఎంపిక చేశారు. భవిష్యత్‌లో ఈ సంఖ్యను పెంచాలని భావిస్తున్నారు. మహిళ అధికారిణుల ప్రతిభ ఆధారంగా ఎస్‌హెచ్‌ఓల్లోనూ 33 శాతం వీరే ఉండేలా ఉన్నతాధికారులు ప్లాన్ చేశారు.

అయితే.. తనకు దక్కిన అరుదైన అవకాశంపై ఆనందం వ్యక్తం చేశారు లాలాగూడా కొత్త SHO మధులత.. తన తండ్రి ప్రోత్సాహం, పోలీసు అధికారిగా ఉన్న భర్త సహకారంతో ఈ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహిస్తానని అన్నారు. హైదరాబాద్‌ సిటీ మహిళలకు దేశంలోనే సేఫెస్ట్‌ సిటీ అన్నారు సీపీ సీవీ ఆనంద్‌.. మహిళలు అన్ని రంగాల్లో ముందుకొవచ్చేందుకు కుటుంబ సభ్యులు సహకరించాలని సూచించారు.. పురుషులు మేల్‌ ఇగోను పక్కన పెట్టాన్నారు సీపీ.

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కొత్త శకం ప్రారంభమయింది. హైదరాబాద్ నగర పోలీసు చరిత్రలో మొట్టమొదటిసారిగా మహిళా సీఐ మధులత ఎస్‌హెచ్‌ఓగా బాధ్యతలు చేపట్టారు. హోంమంత్రి మహమూద్ అలీ, నగర సీపీ సీవీ ఆనంద్…మధులతకు ఎన్‌హెచ్‌ఓగా బాధ్యతలు అప్పగించారు. లాలాగూడ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ మహిళ ఇన్‌స్పెక్టర్ అధికారి మధులత బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమెను అభినందించారు. మధులత ఉద్వేగానికి గురయ్యారు.

మధులత 2002 బ్యాచ్ కు చెందిన మహిళా సర్కిల్ ఇన్ స్పెక్టర్. సౌత్ జోన్ పాతబస్తీ ఉమెన్ పోలీస్ స్టేషన్. సీఐగా, ఎస్ బి వింగ్ సీఐగా సమర్ధంగా విధులు నిర్వహించారు మధులత. మహిళా సీఐ పేరు సీల్డ్ కవర్ లో సర్ప్రైజ్ గా ఉంచారు సిటీ పోలీస్ బాస్ సీవీ ఆనంద్. హోంమంత్రి మహమూద్ అలీ , సీపీ ఆనంద్ సమక్షంలో బాధ్యతల స్వీకరణ కార్యక్రమంలోనే ఆమె పేరు అధికారికంగా ప్రకటించారు.

ఇవి కూడా చదవండి: AP Capital: ఏపీ రాజధాని హైదరాబాదే.. తెరపైకి కొత్త పేరు.. మంత్రి బొత్స షాకింగ్ కామెంట్స్

Latest Articles