Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: హైదరాబాద్‌లో ఆఫ్రికన్ కాలనీ.. ఆ ప్రాంతం వైపే మొగ్గు చూపుతున్న విదేశీయులు.. కారణం ఎంటంటే..?

African Colony in Hyderabad: హైదరాబాద్ మహా నగరం.. ఎప్పుడూ బిజీబిజీనే.. నగరానికి ఎంతో మంది తమ పనుల నిమిత్తం వస్తు ఉంటారు.. పోతూ ఉంటారు.. ఒక రకంగా చెప్పాలి అంటే జీవనోపాధి కోసం వచ్చి ఇక్కడే స్థిరపడే వాళ్లే ఎక్కువ మంది ఉంటారు. ఇలా రాష్ట్రాల నుంచే కాదు.. ఇతర దేశాల నుంచి వచ్చి స్థిరపడి పోయే వారి సంఖ్య పెరిగిపోతోంది.

Hyderabad: హైదరాబాద్‌లో ఆఫ్రికన్ కాలనీ.. ఆ ప్రాంతం వైపే మొగ్గు చూపుతున్న విదేశీయులు.. కారణం ఎంటంటే..?
Hyderabad, Paramount Hill Colony
Follow us
Peddaprolu Jyothi

| Edited By: Shaik Madar Saheb

Updated on: Sep 25, 2023 | 10:36 AM

African Colony in Hyderabad: హైదరాబాద్ మహా నగరం.. ఎప్పుడూ బిజీబిజీనే.. నగరానికి ఎంతో మంది తమ పనుల నిమిత్తం వస్తు ఉంటారు.. పోతూ ఉంటారు.. ఒక రకంగా చెప్పాలి అంటే జీవనోపాధి కోసం వచ్చి ఇక్కడే స్థిరపడే వాళ్లే ఎక్కువ మంది ఉంటారు. ఇలా రాష్ట్రాల నుంచే కాదు.. ఇతర దేశాల నుంచి వచ్చి స్థిరపడి పోయే వారి సంఖ్య పెరిగిపోతోంది. చదువుతో పాటు వైద్య సాదుపాయలు ఎక్కువుగా ఉండటంతో హైదరాబాద్ నగరం వైపే ఎక్కువ మక్కువ చూపిస్తున్నారు ప్రజలు.. అయితే, నగరంలో కొన్ని ప్రదేశాలలో కొంత మంది తమ తమ రాష్టల నుంచి వచ్చే ప్రజలే ఎక్కువుగా కలిసి ఉండటానికి ఇష్ట పడతారు. అలా ఉన్న ప్రదేశాలలో బేగం బజార్, ఓల్డ్ సిటీ ప్రాంతాలతో పాటు పారమౌంట్ కాలనీలు.. బేగం బజార్ లాంటి ప్రాంతాల్లో ఎక్కువుగా మనకి మార్వాడీలు మనకు కనిపిస్తారు.. హోల్ సెల్ షాపులను ఏర్పాటు చేసుకొని కిరాణాలకు సామగ్రిని అమ్ముతుంటారు. ఇలా ఆ ప్రాంతంలో తమ కుటుంబ సభ్యులు, స్నేహితులతో వ్యాపారులు చేసుకుంటూ సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ జీవనోపాధిని పొందుతున్నారు.. అలానే నిత్యం వేలాది మంది సందర్శకులతో రద్దీగా ఉండే ప్రాంతం ఓల్డ్ సిటీ చిన్న చిన్న వ్యాపారలను చేసుకుంటూ ఎంతో మంది అక్కడికి వచ్చి బతుకుతున్నారు..

అలానే ఈ మధ్య కాలంలో టోలిచౌకిలో ఉన్న పారమౌంట్ కాలనీ ఎక్కువగా వార్తల్లో వినిపిస్తోన్నా ప్రాంతం.. ఒక్కసారి ఆ ప్రదేశానికి వెళ్లామంటే.. ఎలాంటి ఖర్చు లేకుండా ఆఫ్రికా వెళ్ళామా అనేలా ఉంటుంది. ఈ కాలనీలో ఎక్కువుగా ఆఫ్రికన్స్ కనిపిస్తారు.. సుమారు ఈ పారామౌంట్ కాలనీలో 6వేల మందికి పైగా ఆఫ్రికన్స్ నివసిస్తున్నట్లు సమాచారం.. తమ దేశంలో చదువు కోసం, వైద్యం కోసం ఇబ్బందులు పడుతున్న వారు హైదరాబాద్ బాట పడుతున్నారని ఆఫ్రికన్స్ చెప్తున్నారు. వారి దేశంలో పోలిస్తే తక్కువ ఖర్చుతో మంచి వైద్యం ఇక్కడ దొరుకుంతుంది అని అంటున్నారు. ఇలా ఒకరికి ఒకరు తమ దేశం విడిచి ఇక్కడికి వస్తున్నాము అంటున్నారు. ఇలా తమ ప్రాంతంలో ఒకరు ఒకరుగా ఉండటంతో చిన్న ఆఫ్రికన్స్ దేశంగా కనిపిస్తుందని పేర్కొంటున్నారు.

ఆఫ్రికన్స్ రాకతో..

ఆఫ్రికన్స్ రాకతో ఇక్కడ ఉన్న వ్యాపారస్థులు సైతం వారితో మాట్లాడుతూ ఇంగ్లీష్ భాషను నేర్చుకుంటున్నారు. మొదట వారి భాష అర్థం కాకపోయినా మెల్లిగా వారి భాషను నేర్చుకొని వ్యాపారం చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే కారం లేనిదే తెలుగోళ్లకు ముద్ద దిగదు. కానీ అంతటి కారాన్ని తినని వారి కోసం కొన్ని రెస్టారెంట్లను సైతం ఈ పారమౌంట్ కాలనిలో ఏర్పాటు చేశారు వ్యాపారస్తులు. ఇలా చిన్న ఆఫ్రికా దేశంగా మారిన పారమౌంట్ కాలనీలోనున్న ఆఫ్రికన్స్ హైదరాబాద్ తెగ నచ్చేసిందని.. ఇక్కడికి వస్తున్న వారంతా ఇక్కడే నివసిస్తున్నారని పేర్కొంటున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..