Hyderabad: చంపి పాతరేసిన పూజారి.. అప్సర కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

అప్సర హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు వెలుగుచూస్తున్నాయి. తనను పెళ్లి చేసుకోవాల్సిందిగా పూజారి సాయికృష్ణపై అప్సర ఒత్తిడి తెచ్చిన విషయం వాస్తవమేనని పోలీసులు విచారణలో తేల్చారు. యువతికి గతంలోనే ప్రెగ్సెన్సీ రావడంతో.. నిందితుడు అబార్షన్ చేయించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

Hyderabad: చంపి పాతరేసిన పూజారి.. అప్సర కేసులో వెలుగులోకి సంచలన విషయాలు
Apsara Murder Case
Follow us
Ram Naramaneni

|

Updated on: Jun 09, 2023 | 3:00 PM

శంషాబాద్ అప్సర కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అప్సరతో వివాహేతర సంబంధం పెట్టుకున్న పూజారి వెంకట సాయి కృష్ణ ఈ హత్య చేసినట్లు నిర్థారించారు పోలీసులు. శంషాబాద్‌లో హత్య చేసి.. కారులో డెడ్ బాడీనీ సరూర్ నగర్ డంప్ చేసి.. సరూర్‌నగర్ లోని మ్యాన్ హోల్‌లో పడేశాడు. గుట్టు బయటపడకుండా ఉండేందుకు మ్యాన్ హోల్ కు కాంక్రీట్ వేశాడు. నిందితుడు సాయి కృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అప్సర డెడ్ బాడీని వెలికి తీశారు. ఈనెల 3న అప్సరతో కలిసి బయటకు వెళ్లిన సాయికృష్ణ హత్యకు ప్లాన్ చేశాడు. అప్సరకు ట్యాబ్లెట్స్‌ ఇచ్చి మత్తులోకి దించి.. ఆ తర్వాత బండరాయితో మోది చంపినట్లు విచారణలో తేల్చారు పోలీసులు. హత్య నుంచి బయటపడేందుకు ఈనెల 5న శంషాబాద్‌ పీఎస్‌కి వెళ్లి మేనకోడలు మిస్సింగ్‌ అంటూ తప్పుడు కంప్లైంట్‌ చేశాడు. పోలీసులను పక్కదారి పట్టించే ప్రయత్నం చేశాడు సాయికృష్ణ. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఇన్వెస్టిగేషన్‌లో సంచలన విషయాలు బయటపెట్టారు.

అప్సర తన మేనకోడలంటూ సాయికృష్ణ ఇచ్చిన కంప్లైంట్ పై సాయి కృష్ణ తండ్రి స్పందించారు. అప్సర తమ బంధువు కాదని.. ఆమెను ఒకసారి గుడిలో చూసి హెచ్చరించానని చెప్పారు సాయికృష్ణ తండ్రి. మూడు నెలలుగా తమ కొడుకుని వేధించడంతో హత్య చేసి ఉండవచ్చునని అన్నారు. సాయికృష్ణ హత్య చేయగానికి గల కారణాలను పోలీసులు ఎంక్వైరీ చేయాలని.. అప్సర బిహేవియర్‌ను వెరిఫై చేయాలని పోలీసులను కోరుతున్నారు నిందితుడు సాయికృష్ణ తండ్రి. పూజారి సాయికృష్ణను ఉరితీయాలని డిమాండ్ చేస్తుందని అప్సర తల్లి. కోయంబత్తూర్ కని తీసుకెళ్లి హత్య చేశాడని చెప్తున్నారు అప్సర తల్లి. అక్కయ్యగారు అన్నం పెట్టండి అని అడిగిన వ్యక్తి పెళ్లి గురించి అడిగితే మాట్లాడే వాళ్లం కదా అని చెప్తున్నారు అప్సర మథర్.

సాయికృష్ణ తమకు పూజారి గానే తెలుసని .. ఆయన వెనుక ఇలాంటి కోణం ఉందని తెలిస్తేనే భయంగా ఉందని చెప్తున్నారు సరూర్ నగర్ స్థానిక కార్పోరేటర్. అప్సర మృతదేహాన్ని పడేసిన మ్యాన్ హోల్ ఉపయోగం లేనిదని అక్కడ తిరిగే ప్రతి ఒక్కరి తెలుసంటున్నారు కార్పోరేటర్. కేసును సీరియస్‌గా తీసుకోని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నార కార్పోరేటర్. అప్సర రెగ్యులర్ గా టెంపుల్ కి వచ్చేదని చెప్తున్నారు ఆలయ నిర్వాహకులు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం