Hyderabad Metro: గుడ్‌న్యూస్.. హైదరాబాద్‌లో మెట్రో సమయాల్లో మార్పులు.. మరో అరగంట..
Hyderabad Metro train timings : తెలంగాణలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడుతోంది. ఈ క్రమంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ మెట్రో రైలు
Hyderabad Metro train timings : తెలంగాణలో కరోనా వైరస్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఇప్పుడిప్పుడే ప్రజా రవాణా వ్యవస్థ మెరుగుపడుతోంది. ఈ క్రమంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో అధికారులు మార్పులు చేశారు. సోమవారం (సెప్టెంబర్ 6) నుంచి మరో అరగంటపాటు మెట్రో సేవలను పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. రేపటి నుంచి రాత్రి వేళల్లో 10.15 గంటలకు చివరి మెట్రో సర్వీసు ఉంటుందని మెట్రో అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు రాత్రి 9.45 గంటల వరకు చివరి మెట్రో రైలు సర్వీసులు ఉండేవి. కాగా మరో అరగంటపాటు సర్వీసులను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు.
ప్రయాణికుల సౌకర్యార్థం కోసం మెట్రో రైళ్ల సమయాలను పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలాఉంటే.. ఎప్పటిలాగానే ఉదయం 7 గంటల నుంచి మెట్రో సేవలు ప్రారంభంకానున్నాయి. ప్రతి రోజు మూడు మార్గాల్లో వెయ్యి సార్లు రాకపోకలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.
కాగా.. కరోనా తర్వాత మెట్రో సర్వీసులకు బ్రేక్ పడిన విషయం తెలిసిందే. అనంతరం సర్వీసులు ప్రారంభం కాగా.. సెకండ్ వేవ్ సమయంలో కూడా సర్వీసులను రద్దు చేశారు. సెకండ్ వేవ్ అనంతరం కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో మెట్రో సర్వీసులను ప్రారంభించారు.
Also Read: