Spa Center: స్పా ముసుగులో వ్యభిచారం.. 10 మంది విటులు..10 మంది యువతుల అరెస్టు
హైదరాబాద్‌లోని మాదాపూర్ పరిధిలో సెలూన్,స్పా ముసుగులో నిర్వహిస్తున్న వ్యభిచార దందాలను పోలీసులు బట్టబయలుచేశారు. పక్కా సమాచారంతో 'స్పా'లపై దాడులు..
హైదరాబాద్‌లోని మాదాపూర్ పరిధిలో సెలూన్,స్పా ముసుగులో నిర్వహిస్తున్న వ్యభిచార దందాలను పోలీసులు బట్టబయలుచేశారు. పక్కా సమాచారంతో ‘స్పా’లపై దాడులు చేసి నిర్వాహకులు,సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. వారిపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. స్పాలో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో స్పాపై దాడులు చేసిన పోలీసులు.. సెక్స్ వర్కర్లను అదుపులోకి తీసుకున్నారు. మసాజ్ ముసుగులో వ్యభిచారం నియమించుకున్నట్లు గుర్తించారు.
హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ వ్యభిచార గృహంపై ఆదివారం సాయంత్రం ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. స్పా సెంటర్, బ్యూటీ సెలూన్ ముసుగులో వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నట్టు గుర్తించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ప్రధాన నిర్వాహకుడితో పాటు ఇద్దరు మేనేజర్లు, 10 మంది విటులు, 10 మంది యువతులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.73వేల నగదు, 28 మొబైల్ ఫోన్లు, ఓ కారు, రూ.4లక్షలు బ్యాలెన్స్ ఉన్న బ్యాంకు ఖాతాను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఆన్‌లైన్ ద్వారా విటులను ఆకర్షించి ఈ దందా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఇవి కూడా చదవండి: ట్రాఫిక్‌లో హారన్ శబ్ధాలు ఇబ్బంది పెడుతున్నాయా.. ఇక ఆ సౌండ్ పొల్యూషన్ వినిపించదు ఎందుకో తెలుసా..
Goat Farming: ఈ మొబైల్ యాప్ మీ దగ్గర ఉంటే చాలు.. మేకల పెంపకంలో లక్షలు సంపాదించడం నేర్పిస్తుంది..