Goat Farming: ఈ మొబైల్ యాప్ మీ దగ్గర ఉంటే చాలు.. మేకల పెంపకంలో లక్షలు సంపాదించడం నేర్పిస్తుంది..

గొర్రెలు, మేకల పెంపకం అనాదిగా వ్యవసాయానికి అనుబంధంగానే కాకుండా ఉపవృత్తిగానూ కొనసాగుతున్నది. గొర్రెలు, మేకల పెంపకానికి గ్రామాలను ఆనుకొని..

Goat Farming: ఈ మొబైల్ యాప్ మీ దగ్గర ఉంటే చాలు.. మేకల పెంపకంలో లక్షలు సంపాదించడం నేర్పిస్తుంది..
Goat Farming
Follow us

|

Updated on: Sep 05, 2021 | 7:55 PM

గతంలో భారత దేశంలో మేకల పెంపకంను పేదవానికి ఉపాధి మార్గంగా మాత్రమే ఉండేది.. కానీ ఇప్పుడు ఆ లెక్క మారింది. మేకల పెంపకం అతి ప్రముఖమైన ఉపాధిగా ఇప్పుడు మార్పు చేందుతోంది. గొర్రెలు, మేకల పెంపకం అనాదిగా వ్యవసాయానికి అనుబంధంగానే కాకుండా ఉపవృత్తిగానూ కొనసాగుతున్నది. గొర్రెలు, మేకల పెంపకానికి గ్రామాలను ఆనుకొని ఉన్న బంజర్లు, బీడు భూములు, అటవీ భూములే ప్రధాన ఆధారంగా ఉండేవి. అయితే, విస్తరిస్తున్న పట్టణీకరణ నేపథ్యంలో మాంసాహారానికి రోజు రోజుకూ గిరాకీ పెరుగుతూనే ఉంది. ఒక అంచనా ప్రకారం.. కేవలం హైదరాబాద్ నగరంలోనే రోజుకు 8 వేలకు పైగా గొర్రెలు, మేకలు, ఐదు లక్షల కోళ్ల వినియోగం జరుగుతున్నది. మాంసాహారానికి నానాటికీ పెరుగుతున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుంటే వ్యవసాయానుబంధంగా గొర్రెలు, మేకల పెంపకం లాభదాయకమైన వ్యాపారమే.

మేకల పెంపకం అద్భుతమైన వ్యాపారం. దీనిలో నష్టపోయే అవకాశం చాలా తక్కువ. మేక పాలు, మాంసంతో రైతులు మంచి ఆదాయాన్ని పొందవచ్చు. మార్కెట్‌లో మేక ఉత్పత్తులకు చాలా డిమాండ్ ఉంటుంది. రైతులు ఇతర వ్యవసాయ కార్యకలాపాలతో పాటు మేకల పెంపకాన్ని ప్రారంభించవచ్చు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, న్యూఢిల్లీకి చెందిన సెంట్రల్ మేక రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ఒక మొబైల్‌ను రూపొందించింది. ఇక్కడ రైతులు జాతులు, పథకాలతో సహా మేకల పెంపకానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇందులో ఉంటుంది.

మేకల పెంపకం రైతుల ఆదాయాన్ని పెంచే ప్రధాన వనరుగా చెప్పబడింది. ఎందుకంటే ఇది ప్రారంభించడానికి ఎక్కువ ఖర్చు అవసరం లేదు. రైతులు ఇతర వ్యవసాయ పనులతో పాటు దీనిని ప్రారంభించవచ్చు. కేంద్ర ప్రభుత్వంతోపాటు శాస్త్రవేత్తలు కూడా ఈ దిశగా నిరంతరం కృషి చేస్తున్నారు. ఈ దిశగా సెంట్రల్ గోట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (CIRG) మేకల పెంపకం యాప్‌ను రూపొందించింది. మేకల పెంపకం ప్రారంభానికి ఈ మొబైల్ యాప్ చాలా ప్రభావవంతం చేస్తోంది.

భారతీయ మేకల జాతి..

ఈ మొబైల్ యాప్‌లో భారతీయ మేకల జాతుల గురించి చాలా సమాచారం ఇవ్వబడింది. మీరు మేకలను కేవలం మాంసం కోసం ఉంచాలనుకుంటే.. మీరు ఏ రకాలను ఎంచుకోవాలి.. లేదా బొచ్చు, పాలు కోసం ఏ జాతులు మంచివి.. ఇలాంటి చాలా సమాచారం ఇందులో పొందుర్చారు.

వ్యవసాయ పరికరాలు, పశుగ్రాసం ఉత్పత్తి..

మేకల పెంపకంలో ఏ వ్యవసాయ పరికరాలు అవసరం.. లేదా పశుగ్రాసాన్ని ఎలా ఉత్పత్తి చేయాలి అనే అంశాలపై చాలా వివరాలు ఈ మేకల పెంపకం మొబైల్ యాప్‌లో ఇవ్వబడ్డాయి. పశుగ్రాసం ఉత్పత్తి చేయాలనుకుంటే పొలం తయారీకి ఏ పరికరాలు అవసరమో కూడా చాలా క్లుప్తంగా ఇవ్వబడింది.

ఆరోగ్యం, గృహ నిర్వహణ..

యాప్‌లో మేకల ఆరోగ్యాన్ని మీరు ఎలా చూసుకుంటారు. వారి జీవనానికి వసతి ఎలా ఏర్పాటు చేయబడుతుందో కూడా చెప్పబడింది. యాప్ ద్వారా మేకల పెంపకందారులు మేకల వల్ల వచ్చే సాధారణ వ్యాధుల లక్షణాలు.. వాటిని నివారించే చర్యల గురించి సమాచారం పొందుపర్చారు.

మేకల పెంపకం యాప్‌ను ఎలా.. ఎక్కడ పొందాలి..

మేకల పెంపకం యాప్ కోసం ముందుగా మీరు Google Play Store కి వెళ్లాలి. అక్కడికి వెళ్లి CIRG మేకల పెంపకం అని టైప్ చేయండి, యాప్ కనిపిస్తుంది. ఇది హిందీ, ఇంగ్లీష్, తమిళం, తెలుగులో దాదాపు 80 MB లో అందుబాటులో ఉంది. మీరు ఈ యాప్‌ను ఓపెన్ చేసిన వెంటనే భాష ఎంపిక ఎంపిక అడుగుతుంది. ఆ తర్వాత మీకు కావల్సిన పూర్తి సమాచారం ఇందులో ఉంది. 

ఇవి కూడా చదవండి: ట్రాఫిక్‌లో హారన్ శబ్ధాలు ఇబ్బంది పెడుతున్నాయా.. ఇక ఆ సౌండ్ పొల్యూషన్‌కు వినిపించదు ఎందుకో తెలుసా..

Mosquito-Plant: ఈ చిట్కాలు పాటిస్తే.. మీ ఇంట్లో ఒక్క దోమ కూడా లేకుండా పరార్..