Reliance Jio: రిలయెన్స్ జియో సృష్టించిన డేటా విప్లవం.. ఇది ఐదేళ్ళ డిజిటల్ సంచలనం!

పరిమిత ఉచిత ఇంటర్నెట్ ను అందించేలా 2015లో ఫేస్ బుక్ ప్రవేశపెట్టిన ‘ఫ్రీ బేసిక్స్’ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. ఫ్రీ బేసిక్స్ వెనుక ఉన్న ఉద్దేశం భారతీయ మార్కెట్ ను విస్తరించుకోవడం.

Reliance Jio: రిలయెన్స్ జియో సృష్టించిన డేటా విప్లవం.. ఇది ఐదేళ్ళ డిజిటల్ సంచలనం!
Relience Jio

Reliance Jio: పరిమిత ఉచిత ఇంటర్నెట్ ను అందించేలా 2015లో ఫేస్ బుక్ ప్రవేశపెట్టిన ‘ఫ్రీ బేసిక్స్’ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంది. ఫ్రీ బేసిక్స్ వెనుక ఉన్న ఉద్దేశం భారతీయ మార్కెట్ ను విస్తరించుకోవడం.. మరెన్నో కోట్లమందిని ఆన్ లైన్ పైకి తీసుకురావడం. ఫ్రీ బేసిక్స్ విషయంలో విఫలమైనప్పటికీ, ఫేస్ బుక్ మాత్రం ఊహించని విధంగా వృద్ధి చెందుతూ వచ్చింది. 2016లో భారతదేశంలో ఫేస్ బుక్ యూజర్ల సంఖ్య 20.5 కోట్లు కాగా, ఇప్పుడది 42.5 కోట్లకు చేరుకుంది. అదే సమయంలో కోట్లాది భారతీయులకు వాట్సాప్ డిఫాల్ట్ మెసేజింగ్ ప్లాట్ ఫా మ్ గా మారింది. ఇదే కాలంలో దాని యూజర్ల సంఖ్య 190 మిలియన్ల నుంచి 390 మిలియన్లకు పెరిగింది.

ఆ సంస్థలు ఈ విధమైన మ్యాజిక్ నెంబర్లను సాధించడం వెనుక ఐదేళ్ల క్రితం రిలయన్స్ ఆవిష్కరించిన భారీ సంచలనం కూడా ఉంది. హైస్పీడ్ డేటాను అత్యంత చౌక ధరలకు అందిస్తూ జియో వాణిజ్యపరంగా తన 4జి సేవలను ప్రారంభించడమే ఆ సంచలనం. పోటీ సంస్థలతో పోలిస్తే ఆ టారిఫ్ లు 95 శాతం తక్కువ. ఓటీటీ ప్లాట్ ఫామ్ లతో కూడుకొని వాయిస్ కాల్స్ ఉచితం. దాంతో ఈ రంగంలో ఉన్న వారంతా కూడా జియో బాటలో నడవక తప్పలేదు. ఐదేళ్ళ తరువాత చూస్తే, జియో ప్రారంభించిన డేటా విప్లవం దేశంలో వ్యాపార సంస్థల, వినియోగదారుల తీరుతెన్నులను మార్చివేసింది.

జియో తీసుకువచ్చిన ఈ విప్లవం వినియోగదారులు షాపింగ్ చేయడం, సినిమాలు చూడడం, బీమా లేదా ఆహారపదార్థాలు కొనడం, హాలీడేస్ బుక్ చేసుకోవడం లేదా డాక్టర్ ను సంప్రదించడం ….ఇలా ఎన్నో అంశాల్లో ఎన్నో మార్పులు తీసుకువచ్చింది.

వినియోగదారులు వేగంగా నగదు నుంచి డిజిటల్ లావాదేవీలకు అలవాటుపడేలా చేసి వివిధ యాప్ లపై లావాదేవీలను సులభతరం చేసింది. 2016 ఆగస్టుతో పోలిస్తే యూపీఐ లావాదేవీల విలువ ఈ ఆగస్టు లో 2,06,000 రెట్లు అధికమైంది. పరిమాణం పరంగా చూస్తే 3,95,000 రెట్లు పెరిగింది. ఇది భారతీయులు యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవడంలో గణనీయ వృద్ధికి కూడా దారి తీసింది. ఒక డేటా ప్రకారం 2016లో యాప్స్ డౌన్ లోడ్స్ 6.5 బిలియన్లు కాగా, 2019లో అది మూడింతలై 19 బిలియన్లకు చేరుకుంది. ఇదే కాలానికి చైనాలో యాప్స్ డౌన్ లోడ్ 80 శాతం మాత్రమే పెరిగింది. ప్రపంచవ్యాప్త సగటు 45 శాతం మాత్రమే పెరిగింది.

డిజిటల్ ఆర్థిక వ్యవస్థకు ద్వారాలు తెరుచుకోవడాన్ని ఎన్నో సంస్థలు, ఎంతో మంది వ్యక్తులు ఎన్నో రకాలుగా ఉపయోగించుకున్నారు. ఆన్ లైన్ ట్రాకింగ్ ఏజెన్సీ 42 మ్యాటర్స్ ప్రకారం, గూగుల్ ప్లే లో ఇండియన్ పబ్లిషర్స్ వి 1,61,373 యాప్స్ ఉన్నాయి. వీటిలో 3 శాతం పెయిడ్ రకానివి. గణనీయంగా 40 శాతం యాప్స్ వాణిజ్య ప్రకటనల అండతో నడిచేవి. (ఈ విభాగంలో అంతర్జాతీయ సగటు 38 శాతం కంటే ఇది అధికం).
జియో సంచలనం ప్రభావం స్టార్టప్ విభాగంలో కూడా అత్యధికంగా మారింది. జియో రాక ముందు భారత్ 10 యూనికార్న్ లను కలిగిఉంది. జియో వచ్చిన తరువాత అది ఆరింతలై 51 దాటింది. రాబోయే రెండేళ్లలో ఇది మ్యాజిక్ 100 మార్క్ ను దాటుతుందని విశ్లేషకులు అంటున్నారు.

జొమోటో సహవ్యవస్థాపకుడు దీపీందర్ గోయల్ తన మెగా ఐపీఓ కన్నా ముందు తన సిబ్బందికి రాసిన లేఖలో ఈ మార్పు గురించి ప్రస్తావించారు. ‘‘జియో మెగా వృద్ధి మనం ఊహించని వృద్ది సాధించేందుకు దారి తీసింది’’ అని ఆయన పేర్కొన్నారు.

జొమాటో లిస్టింగ్ సాధించిన విజయంతో మరో డజనుకు పైగా స్టార్టప్ లు ఐపీఓ బాట పట్టాయి. రాబోయే 12-18 నెలల కాలంలో అవి రావచ్చు. వాటన్నింటి వాల్యూయేషన్ల 60 బిలియన్ డాలర్ల దాకా ఉంటుంది.
వాటిలో ఒకటైన బైజూస్ వాల్యూయేషన్ 16.5 బిలియన్ డాలర్ల దాకా ఉంటుంది. మరీ ముఖ్యంగా మహమ్మారి సమయంలో విద్యార్థులు ఆన్‌లైన్ బాట పట్టడంలో అది గణనీయ పాత్ర పోషించింది. ‘‘మాలాంటి ఎడ్‌టెక్ కంపెనీలు దేశవ్యాప్తంగా కోట్లాది మంది విద్యార్థులను చేరుకోవడంలో హై స్పీడ్ డేటా వెన్నుదన్ను గా నిలిచింది’’ అని వ్యవస్థాపకులు బైజు రవీంద్రన్ అన్నారు. 2016లో 1.57 మిలియన్ల పెయిడ్ ఎడ్ టెక్ యూజర్లు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు బైజూస్ ఒక్కటే 6.5 మిలియన్లకు పైగా పెయిడ్ యూజర్లను కలిగిఉంది. దానిలో నమోదైన విద్యార్థుల సంఖ్య 100 మిలియన్లకు పైగానే ఉంది.

ఓటీటీ విభాగంలోనూ, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, డిస్నీ హాట్ స్టార్ లాంటివి 2015-16 మధ్య కాలంలో ప్రవేశించినా, ఆదాయం పెద్ద సవాల్‌గా ఉండేది. కస్టమర్లను ఏ విధంగా పొందాలి ? ఈ సేవలకు డబ్బులిచ్చేదెవరు ? లాంటి ప్రశ్నలు వచ్చాయి.

వివిధ ప్లాట్‌ఫామ్ లపై 60 మిలియన్లకు పైగా పెయిడ్ (పాక్షికం లేదా పూర్తిస్థాయి) వినియోగదారులు ఉన్నారు. జియో వచ్చిన సమయంలో వీరి సంఖ్య 1.3 మిలియన్లు మాత్రమే. మొత్తం సబ్ స్క్రైబర్ బేస్ (పెయిడ్ మరియు నాన్ పెయిడ్) కూడా300 మిలియన్లకు చేరుకుంది.

జియో సంచలనంపై ఈ విధమైన ప్రశంసలు చేసింది మరెవరో కాదు.. సాక్షాత్తూ నెట్ ఫ్లిక్స్ సీఈఓ రీడ్ హేస్టింగ్స్. డేటా వ్యయాలను తగ్గించేందుకు ప్రతి దేశంలోనూ జియో లాంటి సంస్థ రావాలని ఆయన కోరుకున్నారు. జియో ప్రారంభించిన 4జి విప్లవం మరో రెండు అంశాలను కూడా తెరపైకి తీసుకువచ్చింది. స్మార్ట్ ఫోన్లు ప్రజల్లోకి బాగా చొచ్చుకెళ్లాయి. భారత్‌లో తయారయ్యే స్మార్ట్ ఫోన్ల సంఖ్య అధికమైపోయింది.
రాబోయే రెండేళ్లలో యుద్ధరంగమిక 5జి కానుంది. ఎయిర్ టెల్, జియో అందుకు సిద్ధమవుతున్నాయి. ఆటోమేషన్ రంగ ప్రవేశం, ఐఒటి విస్తరణ, రిమోట్ సర్జరీ మొదలుకొని అటానమస్ కార్ల దాకా లో లేటన్సీ సర్వీసెస్ లాంటివాటితో డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో మరో సంచలనానికి అది తెర తీయనుంది.

Also Read: Atal Pension Yojana: ఆకట్టుకుంటున్న కేంద్ర ప్రభుత్వ అటల్ పెన్షన్ యోజన.. కోట్లాదిమంది మనసులు దోచిన దీనిలో మీరూ చేరండిలా..

Mutual Funds: మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా? అయితే మీకోసమే ఈ సూచనలు..

Click on your DTH Provider to Add TV9 Telugu