Ganesh Chaturthi 2021: చవితి దగ్గరపడుతున్నా కనిపించని సందడి.. వేల కోట్ల రూపాయల వ్యాపారం ఆవిరి.. ఎందుకు ఇలా జరుగుతోంది..

Sanjay Kasula

Sanjay Kasula |

Updated on: Sep 05, 2021 | 5:30 PM

వినాయక చవితి వస్తోందంటే ఆ సందడే వేరుగా ఉంటుంది. జనంలో జోష్ పీక్ కి వెళ్తుంది. నాలుగైదు నెలల ముందు నుంచే విగ్రహాల తయారీ మొదలైతే, రెండు మూడు వారాల ముందుగానే గల్లీల్లో హడావిడి స్టార్టవుతుంది.

Ganesh Chaturthi 2021: చవితి దగ్గరపడుతున్నా కనిపించని సందడి.. వేల కోట్ల రూపాయల వ్యాపారం ఆవిరి.. ఎందుకు ఇలా జరుగుతోంది..
Ganesh

వినాయక చవితి వస్తోందంటే ఆ సందడే వేరుగా ఉంటుంది. జనంలో జోష్ పీక్ కి వెళ్తుంది. నాలుగైదు నెలల ముందు నుంచే విగ్రహాల తయారీ మొదలైతే, రెండు మూడు వారాల ముందుగానే గల్లీల్లో హడావిడి స్టార్టవుతుంది. మండపాల ఏర్పాటు దగ్గర్నుంచి, విగ్రహాల ఏర్పాటు వరకు ఆ సందడే సెపరేట్ గా ఉంటుంది. కరోనా దెబ్బకు రెండేళ్లుగా ఆ సందడే మాయమైంది. ఈ ఏడాది కూడా ఇళ్లల్లోనే వినాయక చవితిని జరుపుకోవాలంటూ ప్రభుత్వాలు తేల్చిచెప్పడంతో ఎక్కడా వినాయక చవితి హడావిడి కనిపించడం లేదు. దాంతో, చిరు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. ముఖ్యంగా విగ్రహ తయారీదారుల్లో ఎన్నడూలేనంత నిరాశ కనిపిస్తోంది.

వినాయక చవితి వస్తే.. ఎలక్ట్రీషియన్లకు, లైటింగ్ అండ్ సౌండ్ సిస్టమ్స్ వాళ్లకు పెద్దఎత్తున ఉపాధి లభించేది. కానీ, ఇప్పుడు వాళ్లకే పనే లేకుండా పోతోంది. గణేష్ నవరాత్రుల టైమ్ లో పూల వ్యాపారులపై కనక వర్షం కురుస్తుంది. కానీ, ఇప్పుడు వాళ్లందరి పరిస్థితి అయోమయంలో పడింది. విజయవాడలో పూల వ్యాపారుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా గణేష్ ఉత్సవాలతో ఏటా వేల కోట్ల బిజినెస్ జరిగేదని వారు అంటున్నారు. కోవిడ్ దెబ్బకు తమ వ్యాపారులు పూర్తిగా నేల చూపులు చూస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు గణేష్ విగ్రహాల ఏర్పాటుకు అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. కోవిడ్ ఆంక్షలు కారణంగా ఎవరి ఇళ్లల్లో వాళ్లే వినాయక చవితిని జరుపుకోవాలని సూచిస్తున్నారు. ఇప్పుడున్న కరోనా పరిస్థితుల్లో ఎవరింట్లో వాళ్లే వినాయక చవితిని జరుపుకుంటే మంచిదని పూజారులు కూడా అంటున్నారు.

ఇవి కూడా చదవండి: ట్రాఫిక్‌లో హారన్ శబ్ధాలు ఇబ్బంది పెడుతున్నాయా.. ఇక ఆ సౌండ్ పొల్యూషన్‌కు వినిపించదు ఎందుకో తెలుసా..

Mosquito-Plant: ఈ చిట్కాలు పాటిస్తే.. మీ ఇంట్లో ఒక్క దోమ కూడా లేకుండా పరార్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu