Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Personal Loan: మీకు డబ్బు ఆత్యవసరం అయితే.. పర్సనల్ లోన్ మంచి ఎంపిక ఎలా అంటే..

మీకు డబ్బు అవసరం ఉన్నప్పుడు వ్యక్తిగత రుణం సరైన ఎంపిక. చాలా బ్యాంకులు 9%కంటే తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇస్తున్నాయి.

Personal Loan: మీకు డబ్బు ఆత్యవసరం అయితే.. పర్సనల్ లోన్ మంచి ఎంపిక ఎలా అంటే..
Personla Loan
Follow us
KVD Varma

|

Updated on: Sep 05, 2021 | 9:41 PM

Personal Loan: మీకు డబ్బు అవసరం ఉన్నప్పుడు వ్యక్తిగత రుణం సరైన ఎంపిక. చాలా బ్యాంకులు 9%కంటే తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇస్తున్నాయి. ఇది కాకుండా, SBI, పంజాబ్ నేషనల్ బ్యాంక్ వ్యక్తిగత రుణాలపై ప్రాసెస్ ఫీజులు వసూలు చేయకూడదని నిర్ణయించాయి. వ్యక్తిగత రుణం తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఈ ఉపయోగాలు ఏమిటి అనేది మీకోసం ఇప్పుడు తెలుసుకుందాం.

ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేని పర్సనల్ లోన్ అనేది అసురక్షిత రుణం. అందువల్ల దరఖాస్తుదారు రుణం కోసం ఎలాంటి భద్రతను అందించాల్సిన అవసరం లేదు. బ్యాంకులు సాధారణంగా రుణగ్రహీత ఆదాయం, నగదు ప్రవాహం, క్రెడిట్ స్కోర్, తిరిగి చెల్లించే సామర్థ్యం ఆధారంగా ఈ రుణాలను మంజూరు చేస్తాయి. దీని ఆధారంగా రుణ మొత్తం, వడ్డీ రేటు నిర్ణయిస్తారు. మంచి తిరిగి చెల్లించే సామర్థ్యం, మంచి క్రెడిట్ స్కోర్, ఆదాయం తక్కువ వడ్డీకి రుణాన్ని పొందడానికి దరఖాస్తుదారుని అనుమతిస్తుంది.

మీరు మీ అవసరానికి అనుగుణంగా వ్యక్తిగత రుణాన్ని ఉపయోగించవచ్చు మీ అవసరానికి అనుగుణంగా మీరు వ్యక్తిగత రుణ డబ్బును ఉపయోగించవచ్చు. కరోనా సమయంలో మీ వైద్య ఖర్చులు లేదా ఇతర అవసరాలను తీర్చడానికి మీకు డబ్బు అవసరమైతే, మీరు వ్యక్తిగత రుణాన్ని తీసుకోవడం ద్వారా ఈ అవసరాలను తీర్చవచ్చు. వ్యక్తిగత రుణ మొత్తం నేరుగా రుణగ్రహీతకు పంపిణీ చేస్తారు. వ్యక్తిగత రుణం తీసుకోవడం ఉద్దేశ్యాన్ని మీరు బ్యాంకుకు చెప్పనవసరం లేదు. అంటే ఇందుకోసం మీరు రుణం కావాలని అనుకుంటున్నారు అనే విషయాన్ని బ్యాంకులు అడగవు.

మీ రుణం ప్రకారం మీరు రుణ వ్యవధిని ఎంచుకోవచ్చు

వ్యక్తిగత రుణాలు సాధారణంగా 12 నెలల నుండి 60 నెలల మధ్య ఉండే సౌకర్యవంతమైన రీపేమెంట్ కాలపరిమితితో వస్తాయి. అటువంటి పరిస్థితిలో, మీరు మీ అవసరానికి అనుగుణంగా రుణం తీసుకోవాలనుకునే వ్యవధిని ఎంచుకోవచ్చు. వ్యక్తిగత రుణాలు కూడా ప్రీ-పేమెంట్, ప్రీ-క్లోజర్ ఛార్జీలతో వస్తాయి.

మీరు ముందస్తు ఆమోదం(ప్రీ అప్రూవల్) పొందినప్పుడు రుణం సులభంగా లభిస్తుంది ఒకవేళ మీకు మంచి క్రెడిట్ స్కోరు ఉంటే బ్యాంక్ మీకు ముందుగా ఆమోదించిన వ్యక్తిగత రుణాన్ని అందించవచ్చు. ఇందులో, మినిమం పేపర్ వర్క్ తో తక్షణ రుణం లభిస్తుంది. రుణ దరఖాస్తును బ్యాంక్ అందించిన లింక్ ద్వారా లేదా ఆన్‌లైన్ బ్యాంకింగ్‌కు లాగిన్ చేయడం ద్వారా చేయవచ్చు. ఆమోడం పొందిన తర్వాత, మీ రుణ మొత్తం నిమిషాల్లో మీ బ్యాంక్ ఖాతాకు నేరుగా జమ చేయబడుతుంది. మీరు ఈ రుణాన్ని సులభంగా, తక్కువ వడ్డీతో పొందవచ్చు.

పన్ను మినహాయింపు పొందవచ్చా

వ్యక్తిగత రుణానికి పన్ను ఉండదు. ఎందుకంటే రుణ మొత్తం ఆదాయంగా పరిగణించరు. కానీ మీరు బ్యాంక్ లేదా NBFC వంటి చట్టపరమైన మూలం నుండి రుణం తీసుకున్నారని గుర్తుంచుకోండి. అయితే, రుణంపై పన్ను మినహాయింపు పొందడానికి, మీరు అనేక పత్రాలను చూపించాల్సి ఉంటుంది. వీటిలో వ్యయం వోచర్, బ్యాంక్ సర్టిఫికేట్, లోన్ అప్రూవల్ లెటర్, ఆడిటర్ లెటర్ మొదలైన పత్రాలు ఉన్నాయి.

పంజాబ్ నేషనల్ బ్యాంక్..SBI బ్యాంకుల్లో ప్రాసెస్ ఫీజు ఉండదు..

పంజాబ్ నేషనల్ బ్యాంక్ డిసెంబర్ 31 వరకు హోమ్ లోన్, వెహికల్ లోన్, మై ప్రాపర్టీ లోన్, పర్సనల్ లోన్, పెన్షన్ లోన్, గోల్డ్ లోన్ వంటి ఉత్పత్తులపై ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేయకూడదని నిర్ణయించింది. గృహ, వ్యక్తిగత, కారు, బంగారు రుణాలపై సెప్టెంబర్ 14 వరకు SBI కూడా ప్రాసెసింగ్ ఫీజులను వసూలు చేయదు.

ఏ బ్యాంకు ఏ వడ్డీ రేటుతో రుణం ఇస్తోందంటే..

బ్యాంక్ వడ్డీ రేటు (%)
యూకో బ్యాంక్  8.45
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.45
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 8.90
పంజాబ్ నేషనల్ బ్యాంక్ 8.95
అలహాబాద్ బ్యాంక్ 9.05
బ్యాంక్ ఆఫ్ ఇండియా 9.35
ఎస్బీఐ  9.60