AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: కావాలనే కూతురు కళ్లదుట చంపారు..! పేట్‌బషీరాబాద్‌ పరువు హత్యకేసులో 10 మంది అరెస్ట్..

కూతురు ఎదుటే.. ఆమె ప్రేమించిన వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. మార్చి 1వ తేదీ రాత్రి హైదరాబాద్‌ శివారు పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని..

Hyderabad: కావాలనే కూతురు కళ్లదుట చంపారు..! పేట్‌బషీరాబాద్‌ పరువు హత్యకేసులో 10 మంది అరెస్ట్..
Honour Killing
Shaik Madar Saheb
|

Updated on: Mar 06, 2023 | 9:23 AM

Share

హైదరాబాద్‌ శివారు పేట్‌బషీరాబాద్‌ పరువు హత్యకేసులో పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. నిందితులకు రిమాండ్‌ విధించారు. కూతురు ఎదుటే.. ఆమె ప్రేమించిన వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. మార్చి 1వ తేదీ రాత్రి హైదరాబాద్‌ శివారు పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని దూలపల్లిలో జరిగిన పరువుహత్య కేసులో పోలీసులు 10 మంది నిందితులను అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు దీన్‌దయాళ్‌, అతనికి సహకరించిన నరేష్‌, వెంకటేష్‌, రోహిత్‌, అక్షయ్‌కుమార్‌, పర్వారీ అనికేత్‌, మనీష్‌, సాయినాథ్‌, రాజేంద్ర, గౌతి నవనీత్‌లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కి తరలించారు. అయితే, విచారణలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. కావాలనే కూతురు ఎదుట ఆమె ప్రేమించిన వ్యక్తిని చంపినట్లు తెలుస్తోంది..

హరీశ్ అనే డీజే ఆపరేటర్.. కొన్ని నెలల క్రితం దూలపల్లి సూరారం కాలనీకి వచ్చి తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడు. గతంలో హరీశ్ ఎర్రగడ్డ ప్రాంతంలోని ఎల్లారెడ్డి గూడలో నివాసం ఉండేవాడు. ఆ సమయంలో వేరే వర్గానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఈ విషయంలో యువతి తల్లిదండ్రులు హరీశ్‌ను హెచ్చరించారు. అప్పుడు నివాసం మార్చిన హరిశ్..యువతితో ప్రేమను కొనసాగించాడు. కొన్నాళ్ల తర్వాత ఆమెను పెళ్లి కూడా చేసుకున్నాడు. అయితే, పెద్దలకు తెలియకుండా వివాహం చేసుకున్న ఈ జంట..ఎవరి ఇంట్లో వాళ్లు ఉంటూనే అప్పుడప్పుడూ కలుసుకుంటున్నారు. వీరిద్దరిపై నిఘా పెట్టిన యువతి కుటుంబసభ్యులకు పెళ్లి చేసుకున్నారన్న విషయం తెలిసింది. ఈ క్రమంలో తమ బిడ్డను తమకు కాకుండా చేశాడన్న హరీష్ అడ్డు తొలగించుకోవాలని పథకం వేశారు. ఇందులో భాగంగా హరీష్, ఆ యువతి కదలికలపై నిఘా పెట్టి అదును కోసం ఎదురు చూశారు.

దూలపల్లి ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో వీరిద్దరిని చూసిన బంధువులు ఒక్కసారిగా ఎటాక్ చేశారు. దూలపల్లిలో నడిరోడ్డుపై ఆమె ముందే హరీష్‌ను పాశవికంగా హత్య చేసి.. అనంతరం ఆ యువతిని తమ వెంట తీసుకెళ్లిపోయారు. వేరే వర్గానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడన్న కారణంతోనే తమ కుమారుడిని హత్య చేశారని హరీశ్ కుటుంబసభ్యులు ఆరోపించారు. అన్నీ కోణాల్లో విచారించిన పోలీసులు, దీన్‌దయాళ్‌, అతనికి సహకరించిన అందర్నీ అదుపులోకి తీసుకుని విచారించారు. మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..