AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అమెరికా వెళ్లబోతున్న GHMC వర్కర్.. చెత్త అమ్మాయి అన్నవాళ్లే ఉత్తమ అమ్మాయి అనేలా..

Hyderabad: జీహెచ్ఎంసీ పరిధిలోని ఇంటి ఇంటికి తిరుగుతూ.. చెత్తను ఎరుతూ.. తన తల్లికి తోడుగా ఉంటుంది జయలక్ష్మి అనే ఓ యువతి.. చేసే పని ఎంత ఇబ్బందిగా ఉన్న కడుపుకి అన్నం పెడుతూ ఉండటంతో ఈ పనే తనకు చాలా ఇష్టం అంటుంది.. చిన్నతనం నుండి తన తల్లితో పాటు చెత్త వేసేందుకు వెళ్లిన జయలక్ష్మి.. చెత్తను ఎరుతూనే ఎంతో ఎత్తుకు ఎదుగుతుంది.. మరి చిత్తశుద్ధి తో చెత్త పని చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న జయలక్ష్మి పై స్పెషల్ స్టోరీ..

Hyderabad: అమెరికా వెళ్లబోతున్న GHMC వర్కర్.. చెత్త అమ్మాయి అన్నవాళ్లే ఉత్తమ అమ్మాయి అనేలా..
Jaya Lakshmi
Peddaprolu Jyothi
| Edited By: శివలీల గోపి తుల్వా|

Updated on: Sep 09, 2023 | 2:44 PM

Share

హైదరాబాద్, సెప్టెంబర్ 9: తిని పడేసిన చెత్తను.. తీసి పక్కనే ఉన్న డస్ట్ పిన్‌లో పడేయడానికి చాలా మంది బద్ధకాన్ని ప్రదర్శిస్తుంటారు.. ఒక్క రోజు చెత్త మన ఇంట్లోనే అలా ఉండిపోతే ముక్కు మూసుకొని ఇంటి ముందు ఎదురు చూసుకుంటూ ఉంటాం. ఆ వ్యర్థాల కోసం మున్సిపల్ వర్కర్లు ఎవరైనా వచ్చినా చెత్త వేసుకొని పోయేవాళ్లే వచ్చారని అనుకుంటాం.. ఇక రెండు రోజులు బంద్ పెట్టారా ఇక ధ్యాసంతా వాళ్ళ పైనే ఉంటుంది. అలా జీహెచ్ఎంసీ పరిధిలోని ఇంటి ఇంటికి తిరుగుతూ.. చెత్తను ఎరుతూ.. తన తల్లికి తోడుగా ఉంటుంది జయలక్ష్మి అనే ఓ యువతి.. చేసే పని ఎంత ఇబ్బందిగా ఉన్న కడుపుకి అన్నం పెడుతూ ఉండటంతో ఈ పనే తనకు చాలా ఇష్టం అంటుంది.. చిన్నతనం నుండి తన తల్లితో పాటు చెత్త వేసేందుకు వెళ్లిన జయలక్ష్మి.. చెత్తను ఎరుతూనే ఎంతో ఎత్తుకు ఎదుగుతుంది.. మరి చిత్తశుద్ధి తో చెత్త పని చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తోంది.

తాజాగా యునైటెడ్ స్టేట్స్ ఇండియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ (USIEF) వారి గాంధీ కింగ్ ఎక్స్చేంజ్ ఇనిషియేటివ్ ఆధ్వర్యంలో స్కాలర్షిప్‌ను పొందింది. 2 వారాల పాటు మార్టిన్ లూథర్ కింగ్ మార్గంలో అహింసా పద్ధతిలో ప్రజా ఉద్యమాలు ఎలా నిర్వహించాలో అధ్యయనం చేసి రావడానికి దరఖాస్తులు కోరినప్పుడు దేశవ్యాప్తంగా వేల అప్లికేషన్లు వచ్చాయి. ఇక వారిలో పది మందిని మాత్రమే ఎంపిక చేశారు, పదిమంది లో తెలుగు రాష్ట్రాల నుంచి ముగ్గురు ఉండడం విశేషం. అందులో జయలక్ష్మికి కూడా అవకాశం దక్కింది.. రాయలసీమ ప్రాంతానికి చెందిన జయలక్ష్మి కుటుంబం ఉపాధి కోసం హైదరాబాదులోని ముసరాంబాగ్‌కు వలస వచ్చింది. అక్కడ పిండిని అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగిస్తోంది. అయితే తల్లిదండ్రులు చెత్త బండి నడపడాన్ని ఉపాధిగా చేసుకున్న తర్వాత అదే వాళ్ళ జీవనాధారంగా మారింది.. చేసే పని అత్యంత దయనీయమైనది అయినప్పటికీ అందరూ ఏమనుకున్నా సరే ఈ పని చేసేందుకు చిన్నప్పటి నుంచి అమ్మతోపాటు తోడుగా వెళ్లే దాన్ని అని, తనకు అన్నయ్య చెల్లెలు ఉన్నారని మంచి ఉద్యోగాలలో స్థిరపడాలంటే ఈ పని చేయక తప్పదు అంటూ అమ్మ చెప్తూ ఉండేదని జయలక్ష్మి చెబుతోంది.

అయితే చిన్నప్పటి నుంచి జయలక్ష్మి బడిలో సహా ఏ సమస్యపై అయినా మాట్లాడేందుకు చురుగ్గా ఉండేది.. పేద వర్గాల కోసం పనిచేసే ఓ ఎం సి ఓ సంస్థ జయలక్ష్మిని గుర్తించి ఆమెను ప్రోత్సహించారు. ఇంగ్లీష్ మీడియం చదవాలనుకునే పిల్లల కోసం తానే నాలుగు కిలో మీటర్ల వరకు నడుచుకుంటూ వెళ్లి కరోనా సమయంలో ఎంతో మంది చిన్న పిల్లలకు ట్యూషన్ చెప్తూ పాఠం నేర్పించానని జయలక్ష్మి పేర్కొంది. అయితే తనకు ఐఏఎస్ కావాలన్నది కోరిక అని, యువత తమ హక్కుల కోసం పోరాడాలి వారికి నాయకత్వ లక్షణాలు సైతం ఉండాలి ఈ సమయంలో తనకు వచ్చినటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫర్ ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని, అమెరికా వెళ్లి యువత పోరాటాల విజయకాంతలను అధ్యయనం చేయడం అదృష్టంగా భావిస్తున్నానని జయలక్ష్మి అంటుంది. ఇలా చెత్త అమ్మాయి అని పిలిచే కొందరికి ఉత్తమ అమ్మాయిగా పిలిపించుకుంటున్నానని, ఇది తనకు సంతోషాన్నిస్తోందని జయలక్ష్మి అంటోంది.

మరిన్నీ తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..