Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: పెళ్లి డెకరేషన్ సామాగ్రి గోడౌన్​లో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!

అప్పటికే గోదాంలో సామాగ్రి అగ్నికి ఆహుతి అయ్యింది. గోదాంలో మంటలు అంటుకోవడానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని స్థానికులు అంటున్నారు. గోదాంలో మంటలు చెలరేగడానికి కారణం షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుందా లేదా? ఇంకా ఏదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.... తమకు బస్తీలో ఎలాంటి సౌకర్యాలు లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Watch: పెళ్లి డెకరేషన్ సామాగ్రి గోడౌన్​లో అగ్ని ప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం..!
Decoration Warehouse
Noor Mohammed Shaik
| Edited By: Jyothi Gadda|

Updated on: Jun 21, 2025 | 10:02 PM

Share

రాచకొండ కమిషనరేట్ పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధి వాదియే ముస్తఫా కాలనీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి మండపాలలో డెకరేషన్ కు ఉపయోగించే సామాగ్రి గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పొగలు ఆకాశాన్ని అంటాయి. పొగలను గమనించిన స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. గోదాము వద్దకు వెళ్లి చూడడంతో గోదాంలో మంటలు అంటుకుని పొగలు ఆకాశాన్ని తాకాయి. విషయాన్ని పహాడ్ షరీఫ్ పోలీసులకు చెప్పడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పహాడీషరీ పోలీసులు ఫైర్ ఇంజన్ ను రప్పించి మంటలను అదుపు చేశారు.

అప్పటికే స్థానికంగా ఉండే కొందరు గోదాం లో నుండి సామాన్ లను బయటకు చేర్చే ప్రయత్నం చేశారు. అప్పటికే గోదాంలో సామాగ్రి అగ్నికి ఆహుతి అయ్యింది. గోదాంలో మంటలు అంటుకోవడానికి కారణం షార్ట్ సర్క్యూట్ అని స్థానికులు అంటున్నారు. గోదాంలో మంటలు చెలరేగడానికి కారణం షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుందా లేదా? ఇంకా ఏదైనా కారణం ఉందా? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు…. తమకు బస్తీలో ఎలాంటి సౌకర్యాలు లేవని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

ఇవి కూడా చదవండి

ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు ఎవరు కూడా సమయానికి స్పందించడం లేదని అంటున్నారు. ఇక్కడ మంటలు అంటుకుని భయాందోళనకు గురైతు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని జీవిస్తున్నామని అధికారులకు సమాచారం అందించిన గంటన్నరకు ఇక్కడికి చేరుకున్నారని అంటున్నారు. బస్తీలో తమకు ఈలాంటి ప్రమాదాలు జరిగినా కాపాడేందుకు సౌకర్యాలు లేవని అధికారులు తమకు వెంటనే సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కోరారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..