AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kaushik Reddy: కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం..

క్వారీ యజమానిని బెదిరించిన కేసులో పోలీసుల రిమాండ్‌ పిటిషన్‌ను తిరస్కరించిన కాజీపేట కోర్టు.. పాడి కౌశిక్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. మరోవైపు బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే అరెస్ట్‌ వ్యవహారం..అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం రేపుతోంది. రేవంత్‌ సర్కార్‌ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందన్న బీఆర్‌ఎస్‌ ఆరోపణలకు.. అంతే ధీటుగా కౌంటర్‌ ఇస్తోంది హస్తంపార్టీ..

Kaushik Reddy: కౌశిక్ రెడ్డికి బెయిల్ మంజూరు.. బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం..
BRS MLA Padi Kaushik Reddy
Shaik Madar Saheb
|

Updated on: Jun 21, 2025 | 9:14 PM

Share

క్వారీ యజమానిని బెదిరించిన కేసులో పోలీసుల రిమాండ్‌ పిటిషన్‌ను తిరస్కరించిన కాజీపేట కోర్టు.. పాడి కౌశిక్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది. సుదీర్ఘంగా విచారించిన న్యాయమూర్తి కౌశిక్ రెడ్డికి సొంత పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది. అయితే.. హుజూరాబాద్‌ బీఆర్ఎస్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్‌.. వరంగల్‌లో హైటెన్షన్‌ క్రియేట్‌ చేసింది. గ్రానైట్ వ్యాపారి మనోజ్‌రెడ్డిని బెదిరించడంతోపాటు 50 లక్షలు డిమాండ్ చేశారన్న కేసులో కౌశిక్‌రెడ్డిని శనివారం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ దగ్గర అరెస్ట్‌చేసిన పోలీసులు అనంతరం వరంగల్ సుబేదారి పీఎస్‌కు తరలించారు. అక్కడి నుంచి కౌశిక్‌రెడ్డిని కోర్టుకు తరలించే క్రమంలో వరంగల్‌ సుబేదారి పోలీస్‌స్టేషన్‌ దగ్గర హైడ్రామా నడిచింది. కౌశిక్‌రెడ్డి అరెస్ట్‌పై సుబేదారి పోలీస్‌స్టేషన్‌ ముందు బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఆందోళనకు దిగాయి. పీఎస్‌ను ముట్టడించి.. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు, బీఆర్‌ఎస్‌ నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. అనంతరం సుబేదారీ పోలీసు స్టేషన్‌ నుంచి ఎంజీఎం వరకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పోలీసులు..వైద్య పరీక్షల అనంతరం జడ్జి ముందు కౌశిక్‌రెడ్డిని ప్రవేశపెట్టారు.

మరోవైపు కౌశిక్‌రెడ్డి అరెస్ట్‌ దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు..బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీమంత్రి కేటీఆర్‌.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే కౌశిక్‌పై కక్షకట్టారని..అందుకే అక్రమంగా అరెస్ట్‌ చేశారని మండిపడ్డారు. కౌశిక్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మాజీమంత్రి హరీష్‌రావు.. పాలనను గాలికి వదిలేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం.. రాజకీయ కక్షసాధింపులనే పనిగా పెట్టుకుందని ఆరోపించారు. కేసులు, అరెస్టులు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేవని స్పష్టం చేశారు హరీష్‌రావు.

హుజూరాబాద్‌ నియోజకవర్గంలో కౌశిక్ రెడ్డి అనేక అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపించారు..కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్. కౌశిక్‌ రెడ్డి ఆరాచకాలపై బాధితులు ఫిర్యాదు చేస్తే..కేటీఆర్‌, హరీష్‌రావు సెటిల్‌ చేయలేదా అని ప్రశ్నించారు.

ఫోన్‌ ట్యాపింగ్‌, కాళేశ్వరంతో పాటు బనకచర్ల ఇష్యూపై ఇప్పటికే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇప్పుడు వాటికి తోడు కౌశిక్‌రెడ్డి ఇష్యూ కూడా తోడయింది. దీంతో తెలంగాణ పాలిటిక్స్‌ మరింత హీటెక్కాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..