Hyderabad: అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ ఎడ్విన్ అరెస్ట్.. 50వేల మందితో కాంటాక్ట్స్: సీపీ ఆనంద్

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్.. డ్రగ్స్ కింగ్ పిన్ ఎడ్విన్ న్యూన్స్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ వ్యాప్తంగా 50వేల మందితో ఎడ్విన్ కాంటాక్ట్ లో ఉన్నట్లు కీలక విషయాలు చెప్పారు సీపీ సీవీ ఆనంద్.

Hyderabad: అంతర్జాతీయ డ్రగ్ స్మగ్లర్ ఎడ్విన్ అరెస్ట్.. 50వేల మందితో కాంటాక్ట్స్: సీపీ ఆనంద్
Drugs Case
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Nov 05, 2022 | 9:28 PM

హైదరాబాద్ డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్.. డ్రగ్స్ కింగ్ పిన్ ఎడ్విన్ న్యూన్స్ ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశ వ్యాప్తంగా 50వేల మందితో ఎడ్విన్ కాంటాక్ట్ లో ఉన్నట్లు కీలక విషయాలు చెప్పారు సీపీ సీవీ ఆనంద్. డ్రగ్స్‌ కేసులో కీలక సూత్రదారి .. డ్రగ్స్‌ సరఫరా కింగ్‌పిన్‌ ఎడ్విన్‌ను హైదరాబాద్ నార్కోటిక్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గోవాలో అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. ఏడాది కాలంగా డ్రగ్స్ పై హైదరాబాద్ పోలీసులు ఉక్కు పాదం మోపుతున్నారని చెప్పారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ ఎడ్విన్ న్యూన్స్ ను అరెస్ట్ చేశామన్నారు. దేశ వ్యాప్తంగా 50వేల మందితో ఎడ్విన్ కాంటాక్ట్ లో ఉన్నారని కీలక విషయాలు చెప్పారు సీపీ. గోవాకు వచ్చే అంతర్జాతీయ టూరిస్ట్‌లతో మంచి సంబంధాలు ఏర్పరుచుకొని… వారికి ఎలాంటి మాదక ద్రవ్యాలపై కావాలో తెలుసుకొని సప్లై చేస్తున్నాడని సీపీ సీవీ ఆనంద్ చెప్పారు.

డ్రగ్స్ స్మగ్లర్ ఎడ్విన్ పై గోవాలో నాలుగు డ్రగ్స్ కేసులు, హైదరాబాద్‌లో మూడు డ్రగ్స్ కేసులు నమోదైనట్లు చెప్పారు సీపీ. గోవాలో బీజేపీ నేత సోనాలి ఫోగట్ హత్య కేసులో ఎడ్విన్ నిందితుడుగా తేలిందన్నారు. ఓ రెస్టారెంట్ లో వర్కర్ గా చేరిన ఎడ్విన్.. పదేళ్ల కాలంలో గోవాలో డ్రగ్స్ ఢీలింగ్ కోకింగ్ పిన్‌గా మారాడని చెప్పారు సీపీ. గోవాలో దిఫేమస్.. కర్లిన్ షాక్ మ్యూజిక్ పబ్ ను ఏర్పాటు చేశాడని చెప్పారు సీపీ. గోవా వెళ్లొచ్చిన ప్రతి ఒక్కరు కర్లిన్ గురించి మాట్లాడుకునేలా చేశాడన్నారు. గోవాలో పెద్ద మ్యూజిక్ పార్టీస్ ఏర్పాటు చేసి మూడు వీలాసవంతమైన ఇళ్లు నిర్మించినట్లు విచారణలో తేలిందన్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లర్ గా మారిన ఎడ్విన్.. గోవాలో అతను చెప్పిందే వేదం అన్నారు సీపీ సీవీ ఆనంద్.

మూడు నెలల క్రితం హైద‌రాబాద్‌లో డ్రగ్స్ స‌ర‌ఫ‌రా చేస్తున్న నారాయ‌ణ బోర్కర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు… హైద‌రాబాద్‌కు డ్రగ్స్ స‌ర‌ఫ‌రా చేయడంలో ఎడ్విన్ ది కీలక పాత్రగా గుర్తించారు. బోర్కర్ ఇచ్చిన స‌మాచారంతో దిమోస్ట్ వాంటెడ్ ఎడ్విన్‌పై మూడు నెల‌లుగా నిఘూ పెంచారు. పోలీసుల కళ్లు కప్పితిరుగుతున్న ఎడ్విన్‌ను గ‌త 15 రోజులుగా గోవాలోనే మ‌కాం వేసి ఎట్టకేలకు అరెస్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు నార్కోటిక్ పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..