Balapur Laddu:1994 నుంచి 2021 వరకు బాలాపూర్ లడ్డు వేలం వివరాలు.. ఎవరెవరు దక్కించుకున్నారు..!

Balapur Laddu: భాగ్యనగర గణేష్‌ ఉత్సవాలు అంటే గుర్తుకు వచ్చేది బాలాపూర్‌ లడ్డూ.. ఏటా ఈ లడ్డూను దక్కించుకునేందుకు ఎంతోమంది సంపన్నులు పోటీపడుతుంటారు..

Balapur Laddu:1994 నుంచి 2021 వరకు బాలాపూర్ లడ్డు వేలం వివరాలు.. ఎవరెవరు దక్కించుకున్నారు..!
Balapur Laddu
Follow us
Subhash Goud

|

Updated on: Sep 19, 2021 | 11:23 AM

Balapur Laddu: భాగ్యనగర గణేష్‌ ఉత్సవాలు అంటే గుర్తుకు వచ్చేది బాలాపూర్‌ లడ్డూ.. ఏటా ఈ లడ్డూను దక్కించుకునేందుకు ఎంతోమంది సంపన్నులు పోటీపడుతుంటారు. వందలూ కాదు.. వేలూ కాదు.. లక్షలు పలుకుతుంది బాలాపూర్‌ లడ్డూ.. పాత రికార్డులను తిరగరాస్తూ.. 2021లో జరిగిన వేలంలో ఏకంగా మర్రి శశాంక్‌ రెడ్డి రూ.18 లక్షల 90 వేలు వేలం పాటలో దక్కించుకున్నారు. ఇంతకీ బాలాపూర్‌ లడ్డూ కథ ఏమిటో తెలుసుకుందాం.. కరోనా కారణంగా గత ఏడాది లడ్డూ వేలాన్ని రద్దు చేసింది బాలాపూర్‌ గణేష్ ఉత్సవ కమిటీ. అయితే బాలాపూర్ లడ్డుకున్న ప్రత్యేక వేరు. ప్రతి సంవత్సరం లడ్డు ఎంత ధరకైన సొంతం చేసుకునేందుకు పోటీ పడుతుంటారు భక్తులు. అయతే 1994 నుంచి 2021 వరకు వేలం పాట ఎంత పలికింది ఓసారి చూసేద్దాం.

1994 – కొలను మోహన్ రెడ్డి రూ. 450.

1995 – కొలను మోహన్ రెడ్డి రూ. 4,500.

1996 – కొలను కృష్ణా రెడ్డి రూ. 18 వేలు.

1997 – కొలను కృష్ణా రెడ్డి రూ. 28వేలు.

1998 – కొలను మోహన్ రెడ్డి రూ. 51 వేలు.

1999 – కల్లెం ప్రతాప్ రెడ్డి రూ. 65 వేలు.

2000 – కల్లెం అంజిరెడ్డి రూ. 66 వేలు.

2001- జి.రఘునందన రెడ్డి రూ. 85 వేలు.

2002 – కందాడ మాదవ్ రెడ్డి రూ.లక్షా 5వేలు.

2003 – చిగిరింత బాల్ రెడ్డి రూ. లక్షా , 55వేలు.

2004 -కొలను మోహన్‌రెడ్డి రూ. 2 లక్షల ఒక వేయి.

2005 – ఇబ్రహిం శేఖర్ రూ. 2లక్షల, 8వేలు.

2006 – చిగురింత తిరుపతిరెడ్డి రూ. 3 లక్షలు.

2007 – జి.రఘునందనాచారి రూ. 4 లక్షల 15వేలు.

2008 – కొలను మోహన్‌రెడ్డి రూ. 5లక్షల, 7వేలు.

2009 – సరిత రూ. 5లక్షల 10వేలు.

2010 – శ్రీధర్‌బాబు రూ. 5 లక్షల, 35వేలు.

2011 – కొలను ఫ్యామిలీ రూ. 5 లక్షల,45 వేలు.

2012 – పన్నాల గోవర్ధన్‌రెడ్డి రూ. 7 లక్షల,50 వేలు.

2013 – తీగల కృష్ణారెడ్డి రూ. 9 లక్షల,26 వేలు.

2014 – సింగిరెడ్డి జయేందర్ రెడ్డి రూ. 9 లక్షల,50 వేలు.

2015 – కళ్లెం మదన్‌మోహన్‌ రూ. 10 లక్షల,32వేలు.

2016 – స్కైలాబ్ రెడ్డి రూ. 14లక్షల,65వేలు.

2017 – నాగం తిరుపతి రెడ్డి రూ. 15లక్షల, 60 వేలు.

2018 – శ్రీనివాస్ గుప్తా రూ.16లక్షల.60 వేలు.

2019 – కొలను రాంరెడ్డి రూ.17 లక్షల 60 వేలు.

2020 – కరోనా కారణంగా వేలం జరగలేదు.

2021 – మర్రి శశాంక్‌ రెడ్డి రూ.18 లక్షల 90 వేలు.

ఇవీ కూడా చదవండి:

Bank Account Aadhaar Link: మీ ఆధార్‌ నెంబర్‌ ఏ బ్యాంకు ఖాతాకు లింక్‌ అయ్యిందో తెలుసుకోండిలా..!

Bank Balance: ఒకే రోజు కరోడ్‌పతి.. రైతు బ్యాంకు ఖాతాలో రూ.52 కోట్లు జమ.. షాకైన అధికారులు