Khairatabad Ganesh: మధ్యాహ్నం 2 గంటలకు గంగమ్మ ఒడికి చేరనున్న ఖైరాతాబాద్ గణేశుడు
మధ్యాహ్నం 2గంటలకు ఈ మహా గణపతి గంగమ్మ ఒడికి చేరనున్నాడు. కాళనాగేశ్వరి, శ్రీకృష్ణకాళ సమేతంగా కొలువుదీరిన ఖైరతాబాద్ గణేశుని శోభయాత్ర.. టెలిఫోన్ భవన్ మీదుగా తెలుగుతల్లి ఫ్లై ఓవర్ నుంచి మొత్తం 2.5 కిలోమీటర్ల మేర సాగనుంది.
హైదరాబాద్‌కే తలమానికమైన ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర కొనసాగుతోంది. 40 అడుగుల ఎత్తులో కొలువుదీరిన పంచముఖ రుద్ర మహాగణపతి సాగరం వైపు కదులుతున్నాడు. మధ్యాహ్నం 2గంటలకు ఈ మహా గణపతి గంగమ్మ ఒడికి చేరనున్నాడు. కాళనాగేశ్వరి, శ్రీకృష్ణకాళ సమేతంగా కొలువుదీరిన ఖైరతాబాద్ గణేశుని శోభయాత్ర.. టెలిఫోన్ భవన్ మీదుగా తెలుగుతల్లి ఫ్లై ఓవర్ నుంచి మొత్తం 2.5 కిలోమీటర్ల మేర సాగనుంది. ట్యాంక్ బండ్‌పై 4వ నంబర్ క్రేన్ వద్ద మహాగణపతిని నిమజ్జనం చేయనున్నారు. వేలాదిగా బారులు తీరిన గణనాథులను చూసేందుకు పెద్దసంఖ్యలో తరలివస్తున్నారు నగరవాసులు. భారీగా తరలివచ్చే ప్రజలకు తగ్గట్టుగా ఏర్పాట్లుచేశారు పోలీసులు. బాలాపూర్ నుంచి హుస్సేన్ సాగర్ వరకు అడుగడుగునా బలగాలను మోహరించారు.
కాగా భాగ్యనగరంలో ఎటు చూసినా గణనాథుల సందడే..గణపతి బప్పా మోరియా..బై బై గణేషా నామస్మరణతో వీథులన్నీ మార్మోగిపోతున్నాయి. 9 రోజుల పాటు మంటపాల్లో విశేష పూజలందుకున్న గణనాథులు..ట్యాంక్‌బండ్ వైపు కదులుతున్నారు. మరోవైపు వినాయక మండపాల వద్ద లడ్డూల వేలం ఆసక్తిగా కొనసాగుతుంది. ముఖ్యంగా బాలాపూర్ లడ్డూ ఎప్పటిలానే ఈ ఏడాది కూడా పాత రికార్డులు బద్దలుకొట్టింది. కొత్త హిస్టరీ క్రియేట్ అయ్యింది. వెయ్యి నూట పదహార్ల దగ్గర మొదలైన లడ్డూ వేలం.. ఇప్పుడు 18 లక్షల 90 వేలు పలికింది. పోటాపోటీగా సాగిన వేలంపాటలో కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన ఎమ్మెల్సీ రమేశ్ యాదవ్‌తో కలసి నాదర్‌గుల్ వాసి మర్రి శశాంక్‌రెడ్డి లడ్డూను 18లక్షల 90లకు దక్కించుకున్నారు. ఐతే గతేడాది కొవిడ్ కారణంగా బాలాపూర్ లడ్డూకు వేలం వేయలేదు. ఆ లడ్డూను సీఎం కేసీఆర్‌కు అందించారు నిర్వాహకులు. ఐతే ఈసారి కరోనా నిబంధనలు సడలించడంతో వేలం వేశారు. 1994లో ప్రారంభమైన ఈ బాలాపూర్ లడ్డూ వేలం అప్పుడు కేవలం 450 రూపాయలు పలికింది. ఆ తర్వాత ఏటా కొత్త రికార్డులు సృష్టిస్తోంది.
బాలాపూర్ లడ్డూ వేలంపాటలో స్థానికులైతే మరుసటి ఏడాది డబ్బు చెల్లించేలా నిబంధన ఉంది. అదే స్థానికేతురులైతే అప్పటికప్పుడు చెల్లించాలి. ఈక్రమంలోనే.. 2019లో బాలాపూర్ లడ్డూను దక్కించుకున్న కొలను రాంరెడ్డి.. గతేడాది కరోనా ఎఫెక్ట్ కారణంగా.. ఇప్పుడు 17 లక్షల 60 వేల రూపాయలను చెల్లించారు. ఇక.. ఈ ఏడాది లడ్డూను సొంతం చేసుకున్న స్థానికేతురులైన ఏపీ ఎమ్మెల్సీ రమేష్, శశాంక్ రెడ్డి.. ఇప్పటికిప్పుడే 18 లక్షల 90 వేలను చెల్లించారు.
Also Read: ఈ కోతి భలే హుషారైనది..! గాడిదపై కూర్చొని స్వారీ చేస్తుంది.. వీడియో చూస్తే నవ్వకుండా ఉండలేరు..