Hyderabad: భాగ్యనగర వాసులకు గుడ్ న్యూస్.. మార్చిలో అందుబాటులోకి మరో ఫ్లైఓవర్
తెలంగాణ సర్కార్ హైదరాబాద్ అభివృద్ధి విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంది. సుందరీకరణ పనులతో పాటు ప్లై ఓవర్స్‌పై ఫోకస్ పెట్టింది.
Telangana: తెలంగాణ సర్కార్ హైదరాబాద్ అభివృద్ధి విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తుంది. సుందరీకరణ పనులతో పాటు ప్లై ఓవర్స్‌పై ఫోకస్ పెట్టింది. బహదూర్ పుర ఫ్లైఓవర్(Bahadurpura flyover)బ్రిడ్జి మార్చిలో అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టు మొత్తం రూ. 69 కోట్ల వ్యయం తో చేపట్టారు. బహదూర్ పుర ఫ్లైఓవర్ తో ట్రాఫిక్ వ్యవస్థ మెరుగు పడుతుంది. పడమర ప్రాంతం నుండి తూర్పు ప్రాంతం అనగా శంషాబాద్ నుండి ఆరాంఘర్ మీదుగా ఎల్.బి నగర్ ద్వారా యాదాద్రి, ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ఒక్కప్పుడు జంక్షన్ రద్దీతో పాటు ట్రాఫిక్ ఇబ్బందులు పడేవారు. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం (SRDP) కింద రోడ్ల అభివృద్ధి పటిష్టమైన చర్యలు తీసుకోవడం మూలంగా పాత బస్తీ ప్రాంతంలో కూడా సిగ్నల్ ఫ్రీ వ్యవస్థ మెరుగు పడుతుంది. ఇప్పటికే అబ్దుల్ కలాం ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చింది. బహదూర్ పుర ఫ్లైఓవర్ ను మార్చి మాసంలో ప్రారంభించనున్నారు. హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ద్వారా మౌలిక సదుపాయాలు అవసరమైన చోట ప్రాధాన్యత క్రమంలో చేపడుతున్నది. SRDP ప్రాజెక్టు ద్వారా సుమారు రూ. 8 వేల కోట్ల వ్యయంతో చేపడుతున్న అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్‌లు, ఆర్.ఓ.బిలు మిగిలిపోయిన అన్ని పనులు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు పూర్తి చేయనున్నారు.
ఆరు లైన్ల ఎలివేటెడ్ ఫ్లైఓవర్‌కు 24 పిల్లర్లు పూర్తయ్యాయి. ప్రయాణ సమయం తగ్గుతుంది. ఇంధనం ఆయిల్ (lubricant) వినియోగం తగ్గడంతో పాటు రెండు సైడ్స్ సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేసి.. నీటి నిల్వ కాకుండా మురుగు కాలువ నిర్మాణాలు చేపట్టారు. ఈ ఫ్లైఓవర్ వలన ఆరాంఘర్ నుండి ఎల్.బి నగర్ వరకు, పాత బస్తీ నుండి వచ్చే వాహనాలకు ఎలాంటి ట్రాఫిక్ రద్దీ లేకుండా సులువుగా ఉంటుంది. బహదూర్ పుర, అబ్దుల్ కలాం, ఫ్లైఓవర్ పూర్తి కాగా ఆరాంఘర్ నుండి జూపార్కు వరకు బైరమల్ గూడ ఫ్లైఓవర్ బ్రిడ్జిలు పూర్తయితే పాత బస్తీ వైపు మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది.
Also Read: Viral News: ఇంటి బేస్‌మెంట్ కింద రహస్య అర.. అందులోకెళ్లి చెక్ చేసిన పోలీసులు షాక్