హుజుర్‌నగర్ ఉప ఎన్నికతోనే ఉత్తమ్ భవితవ్యం..!

తెలంగాణాలో హుజుర్‌నగర్ ఉప ఎన్నిక పోలింగ్‌కు రోజులు దగ్గరపడుతున్నాయి. టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఈ నెల 21న పోలింగ్ జరగనుండగా.. 19వ తేదికి పార్టీల ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. కాగా ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున ఉత్తమ్ భార్య, కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఆమె గెలుపు బాధ్యత […]

హుజుర్‌నగర్ ఉప ఎన్నికతోనే ఉత్తమ్ భవితవ్యం..!
Follow us

| Edited By:

Updated on: Oct 14, 2019 | 11:31 AM

తెలంగాణాలో హుజుర్‌నగర్ ఉప ఎన్నిక పోలింగ్‌కు రోజులు దగ్గరపడుతున్నాయి. టీపీసీసీ చీఫ్, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఈ నెల 21న పోలింగ్ జరగనుండగా.. 19వ తేదికి పార్టీల ప్రచారం ముగియనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. కాగా ఈ స్థానం నుంచి కాంగ్రెస్ తరపున ఉత్తమ్ భార్య, కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఆమె గెలుపు బాధ్యత తనదేనని ప్రకటించిన ఉత్తమ్.. ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకొని.. భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, వీహెచ్, కోమటిరెడ్డి, జీవన్ రెడ్డి, షబ్బీర్ అలీ, శ్రీధర్ బాబు ఇలా కాంగ్రెస్ కీలక నేతలను ప్రచార బరిలోకి దింపుతున్నారు. ఇక 18, 19 తేదీల్లో రేవంత్ రెడ్డి కూడా ప్రచారం చేయబోతున్నారని వార్తలు వినిపిస్తుండగా.. కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి కూడా చివర్లో రెండ్రోజులు ప్రచారం చేస్తారని తెలుస్తోంది. మొత్తానికి పద్మావతి గెలుపు కోసం ఉత్తమ్ గట్టిగానే ప్రయత్నిస్తున్నారు.

ఇదిలా ఉంటే టీపీసీసీగా ఉత్తమ్ సారధ్యంలో జరిగే చివరి ఎన్నిక ఇదేననే ప్రచారం ఇప్పుడు జోరుగా సాగుతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తేనే ఆయనను టీపీసీసీ చీఫ్‌గా కొనసాగిస్తారని లేదంటే పదవి నుంచి తొలగిస్తారనే వాదన వినిపిస్తోంది. ఉత్తమ్ కుమార్ మాత్రం ఈ ప్రచారాన్ని కొట్టిపారేశారు. తన పదవీ కాలం పూర్తి కావొస్తోందని.. సహజంగానే తనను తప్పించి వేరే వారికి అవకాశం ఇస్తారని అంటున్నారు. హుజుర్‌నగర్ ఉప ఎన్నికకు, తన పదవికి సంబంధం లేదని ఆయన అంటున్నారు. ఉప ఎన్నికలో కాంగ్రెస్ కచ్చితంగా గెలుస్తుందంటున్న ఆయన.. కాంగ్రెస్ ఓడిపోతే మాత్రం మొత్తం బాధ్యత అతదేనని అంటున్నారు. ఇదిలా ఉంటే హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ అందరిలోనూ కొనసాగుతోంది.