ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతం.. బస్టాపుల వద్ద బైఠాయింపు..

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె పదవ రోజుకి చేరుకుంది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల వ్యాప్తంగా బంద్ చేపట్టారు. ఆదివారం వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వం వెనక్కు తగ్గడంతో.. కార్మికులు సమ్మెను మరింత ఉదృతం చేశారు. చివరకు ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి నిరసనగా వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో నిరసన తెలుపనున్నట్లు కార్మికులు తెలిపారు. నేటి ఉదయం నుంచే బస్టాపుల వద్ద బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. […]

ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతం.. బస్టాపుల వద్ద బైఠాయింపు..
Follow us

| Edited By:

Updated on: Oct 14, 2019 | 7:29 AM

తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె పదవ రోజుకి చేరుకుంది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల వ్యాప్తంగా బంద్ చేపట్టారు. ఆదివారం వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. తమ డిమాండ్లను నెరవేర్చడానికి ప్రభుత్వం వెనక్కు తగ్గడంతో.. కార్మికులు సమ్మెను మరింత ఉదృతం చేశారు. చివరకు ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. దీనికి నిరసనగా వారం రోజుల పాటు వివిధ కార్యక్రమాలతో నిరసన తెలుపనున్నట్లు కార్మికులు తెలిపారు. నేటి ఉదయం నుంచే బస్టాపుల వద్ద బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ ఉద్యోగులు శ్రీనివాస్ రెడ్డి, సురేందర్ గౌడ్‌ల ఆత్మహత్యలకు నిరసనగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల వ్యాప్తంగా బంద్ పాటిస్తున్నారు. కార్మికుల బంద్‌కు ప్రజలు కూడా మద్దతు తెలుపుతున్నారు. ఆర్టీసీ కార్మికులకు ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు కూడా మద్దతిస్తున్నాయి. దీంతో కేసీఆర్ ప్రభుత్వం ఒంటరి అవుతోంది. నేటి నుంచి మంత్రుల్ని కూడా ఎక్కడికక్కడ అడ్డుకుంటామని కార్మికులు చెబుతున్నారు.