అప్పుడు ‘అర్జున్ రెడ్డి’… ఇప్పుడు ‘జార్జ్ రెడ్డి’!

ఈ మధ్య టాలీవుడ్‌లో చిన్న సినిమాల హవా ఎక్కువైంది. భారీ తారాగణం, అధిక బడ్జెట్‌తో తీస్తున్న బడా చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సోసోగా కలెక్షన్స్ రాబడుతుంటే.. లో బడ్జెట్ చిత్రాలు మాత్రం భారీ విజయాలు అందుకుంటున్నాయి. అంతేకాక వాటికి సంబంధించిన టీజర్లు కూడా జనాలను విపరీతంగా ఆకట్టుకోవడం విశేషం. అప్పుడెప్పుడో ‘అర్జున్ రెడ్డి’ సినిమా టీజర్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేయగా.. ఇన్నాళ్లకు మళ్ళీ ‘జార్జ్ రెడ్డి’ అనే సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో విశేషాధారణ పొందుతోంది. ‘అర్జున్ […]

అప్పుడు 'అర్జున్ రెడ్డి'... ఇప్పుడు 'జార్జ్ రెడ్డి'!
Follow us

| Edited By:

Updated on: Oct 14, 2019 | 9:39 AM

ఈ మధ్య టాలీవుడ్‌లో చిన్న సినిమాల హవా ఎక్కువైంది. భారీ తారాగణం, అధిక బడ్జెట్‌తో తీస్తున్న బడా చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద సోసోగా కలెక్షన్స్ రాబడుతుంటే.. లో బడ్జెట్ చిత్రాలు మాత్రం భారీ విజయాలు అందుకుంటున్నాయి. అంతేకాక వాటికి సంబంధించిన టీజర్లు కూడా జనాలను విపరీతంగా ఆకట్టుకోవడం విశేషం. అప్పుడెప్పుడో ‘అర్జున్ రెడ్డి’ సినిమా టీజర్‌తోనే సెన్సేషన్ క్రియేట్ చేయగా.. ఇన్నాళ్లకు మళ్ళీ ‘జార్జ్ రెడ్డి’ అనే సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో విశేషాధారణ పొందుతోంది.

‘అర్జున్ రెడ్డి’.. ఈ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిన్న చిత్రంగా విడుదలై పెద్ద సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది. అప్పట్లో ఈ చిత్రం టీజర్ యూట్యూబ్‌లో సంచలనం సృష్టించింది. టీజర్ ముందు వరకు హీరో విజయ్ దేవరకొండకు చెప్పుకోదగ్గ క్రేజ్ లేదు. కానీ, ఆ తర్వాత విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. సరిగ్గా ఇలాగే ఇప్పుడు ‘జార్జ్ రెడ్డి’ ట్రైలర్ యువతను ఆకట్టుకుంటోంది.

‘జార్జ్ రెడ్డి’… ఇండియన్ చేగువేరా అని చెప్పాలి. ధైర్యం, సాహసానికి ప్రతీకగా ఈ పేరు నిలుస్తుంది. 1967లో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమాలకు బీజం వేసిన జార్జ్ రెడ్డి అనే విద్యార్థి నాయకుడి జీవిత కథ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యూనివర్సిటీలో చదువుతూ ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు తిరుగులేని నాయకుడిగా ఎదిగిన జార్జ్ రెడ్డిని చిన్న వయసులోనే కొందరు ప్రత్యర్ధులు క్యాంపస్‌లోనే హత్య చేశారు. 1965-75 మధ్య ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న ప్రతీ విద్యార్థికి జార్జ్ జీవితం గురించి తెలుసు. అలాంటి టెరిఫిక్ లీడర్ జీవితకథను ఈ తరానికి తెలిసే విధంగా ఈ మూవీను రూపొందించారు.

దసరా పండుగ నాడు విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. కంటెంట్, క్వాలిటీ పరంగా ట్రైలర్ అదుర్స్ అని చెప్పాలి. మైక్‌ మూవీస్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమా 1960, 70లలోని రాజకీయ, సామాజిక, ఆర్థిక పరిస్థితులను వెండితెరపై ఆవిష్కరించనుంది. లేట్ ఎందుకు మీరు కూడా ఆ ట్రైలర్‌పై ఓ లుక్కేయండి.