AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

26ఏళ్ల తర్వాత జత కట్టనున్న హిట్ పెయిర్..?

సైరాతో గ్రాండ్ సక్సెస్‌ను ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి..  కొరటాల దర్శకత్వంలో 152వ చిత్రంలో నటించనున్నాడు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల పూర్తి అవ్వగా.. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇందుకోసం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీలో హీరోయిన్‌గా పలువురి పేర్లు వినిపిస్తుండగా.. కీలక పాత్ర కోసం లేడి అమితాబ్ విజయశాంతిని కొరటాల సంప్రదించినట్లు […]

26ఏళ్ల తర్వాత జత కట్టనున్న హిట్ పెయిర్..?
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 14, 2019 | 12:37 PM

Share

సైరాతో గ్రాండ్ సక్సెస్‌ను ఖాతాలో వేసుకున్న మెగాస్టార్ చిరంజీవి..  కొరటాల దర్శకత్వంలో 152వ చిత్రంలో నటించనున్నాడు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి రామ్ చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల పూర్తి అవ్వగా.. త్వరలోనే ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇందుకోసం ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ మూవీలో హీరోయిన్‌గా పలువురి పేర్లు వినిపిస్తుండగా.. కీలక పాత్ర కోసం లేడి అమితాబ్ విజయశాంతిని కొరటాల సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇక తన పాత్రను గురించి తెలుసుకున్న విజయశాంతి, ఇందులో నటించేందుకు ఒప్పుకున్నట్లు తాజా సమాచారం.

అయితే టాలీవుడ్‌లో చిరు, విజయశాంతిలకు హిట్ పెయిర్ అన్న పేరుంది. ఈ కాంబినేషన్‌లో అప్పట్లో 19 సినిమాలు రాగా.. అందులో 10కి పైగా పెద్ద విజయాలు అందుకున్నాయి. అందుకే అప్పట్లో దర్శకనిర్మాతలు వీరిద్దరితో సినిమాలు తీసేందుకు క్యూ కట్టేవారు. ఇక 1993లో చివరి సారిగా వీరిద్దరు ‘మెకానిక్ అల్లుడు‌’లో కనిపించారు. అయితే ఆ తరువాత ఈ ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని.. అందుకే అవకాశం వచ్చినా కలిసి నటించలేదన్న టాక్ ఫిలింనగర్‌లో బాగా వినిపించింది. ఇదంతా పక్కనపెడితే తాజా సమాచారం ప్రకారం ఈ ఇద్దరు మళ్లీ కలిసి నటిస్తే మాత్రం చిరు సినిమాకు మరో అదనపు ఆకర్షణ అయ్యే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా దాదాపు 12ఏళ్లు సినిమాలకు దూరంగా ఉన్న విజయశాంతి.. మహేష్ బాబు హీరోగా నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’తో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే.

Follow Us
కృష్ణ మనసులో ఆ ఇద్దరూ.. న్యాచురల్ యాక్టర్స్ ఎవరంటే..
కృష్ణ మనసులో ఆ ఇద్దరూ.. న్యాచురల్ యాక్టర్స్ ఎవరంటే..
అది నా అదృష్టం.. దేశ ప్రజలే నా దేవుళ్లు: ప్రధాని మోదీ
అది నా అదృష్టం.. దేశ ప్రజలే నా దేవుళ్లు: ప్రధాని మోదీ
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
నిరుద్యోగులకు ఛాన్స్.. నెలకు రూ.1.33 లక్షల జీతంతో TGPSC ఉద్యోగాలు
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
ఆకలి తీర్చే ఇలవైకుంఠం.. తిరుమలలో రోజుకు ఎన్నిలక్షల మందికి అన్న..
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మృత్యుపాశమైన గోడ.. గాలిలో కలిసిన చిన్నారి ప్రాణాలు
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
మరికొన్ని గంటల్లోనే ఇంటర్ సప్లిమెంటరీ 2026 ఫలితాలు విడుదల
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
ఏపీలోని నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. అమరావతికి మరో గ్లోబల్ సంస్థ
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
9 ఏళ్ల తర్వాత లంక గడ్డపై అడుగుపెట్టనున్న టీమిండియా
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
స్త్రీలు రుద్రాక్షా ధరించకూడదా? అసలు శాస్త్రం ఏం చెబుతుందంటే?
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు
చేపలు కళ్లు మూయకుండానే నిద్రపోతాయా? ఎందుకో తెలిస్తే షాక్ అవుతారు