AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రికార్డులు క్రియేట్​ చేస్తున్న BGauss ఎలక్ట్రిక్​ స్కూటర్.. 2026 నాలుగు నెలల్లో సాధించింది ఇదే

భారతదేశంలో ఎలక్ట్రిక్ టూ వీలర్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. పెట్రోల్ ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు పర్యావరణ అనుకూల ప్రయాణాన్ని కోరుకునే వినియోగదారులు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో ప్రముఖ ఆటోమొబైల్ సంస్థలతో పాటు కొత్త స్టార్టప్ కంపెనీలు కూడా ఈ రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. ఈ పోటీలో ముంబైకి చెందిన BGauss కీలక విజయాన్ని నమోదు చేసింది. భారత మార్కెట్లో తన ఎలక్ట్రిక్ స్కూటర్ల మొత్తం అమ్మకాలు లక్ష యూనిట్లను దాటినట్లు ప్రకటించింది.

రికార్డులు క్రియేట్​ చేస్తున్న BGauss ఎలక్ట్రిక్​ స్కూటర్.. 2026 నాలుగు నెలల్లో సాధించింది ఇదే
Bgauss Electric Scooter
Nikhil
|

Updated on: Nov 15, 2026 | 8:30 PM

Share

ఒకప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్ల కొనుగోలుపై వినియోగదారుల్లో అనేక సందేహాలు ఉండేవి. అయితే ఛార్జింగ్ సదుపాయాలు, కొత్త మోడళ్లు, మెరుగైన టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో మార్కెట్‌లో మార్పు కనిపిస్తోంది. ఈ పరిణామాల మధ్య BGauss అమ్మకాలు కూడా గణనీయంగా పెరిగాయి. ముఖ్యంగా 2026లో గత ఏడాదితో పోలిస్తే 104 శాతం వృద్ధిని నమోదు చేయడం కంపెనీకి ప్రోత్సాహకరంగా మారింది.

నాలుగేళ్లలో లక్ష యూనిట్ల అమ్మకాలు..

BGauss 2022 ఆగస్టులో భారత మార్కెట్లోకి ప్రవేశించింది. అప్పటి నుంచి 2026 నవంబర్ 9 వరకు మొత్తం 1,00,595 ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించింది. ఈ ఏడాది జనవరి నుంచి నవంబర్ 9 వరకు 41,849 యూనిట్లు అమ్ముడయ్యాయి. కంపెనీ ఇప్పటివరకు సాధించిన మొత్తం అమ్మకాల్లో ఇవి దాదాపు 42 శాతం కావడం విశేషం. గత ఏడాదితో పోలిస్తే 2026లో ఇప్పటివరకు విక్రయాలు 104 శాతం పెరిగాయి.

నెలవారీ అమ్మకాల పరంగా కూడా కంపెనీ మంచి గణాంకాలు నమోదు చేసింది. 2026 జూలైలో 5,560 యూనిట్లు, ఆగస్టులో 5,046 యూనిట్లు, సెప్టెంబర్‌లో 5,024 యూనిట్లు, అక్టోబర్‌లో 5,556 యూనిట్లను విక్రయించింది. ఇలా వరుసగా నాలుగు నెలలు 5 వేలకుపైగా స్కూటర్ల అమ్మకాలు నమోదు చేసింది. 2025 చివరి నాటికి అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్రాండ్లలో ఏడో స్థానంలో నిలిచింది. 2026లోనూ ప్రతి నెలా టాప్ 10 జాబితాలో కొనసాగుతోంది.

50 వేల యూనిట్ల లక్ష్యం

అమ్మకాలను మరింత పెంచుకునే దిశగా BGauss ఇటీవల C12 MaxR పేరుతో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేసింది. దీని ఎక్స్‌షోరూమ్ ధర రూ.1.60 లక్షలుగా నిర్ణయించింది. కంపెనీ ఇప్పటివరకు పరిచయం చేసిన అత్యంత శక్తివంతమైన ప్రీమియం మోడల్‌గా దీన్ని పేర్కొంది. మార్కెట్లో TVS iQube, Bajaj Chetak, Ather Rizta వంటి స్కూటర్లతో ఇది పోటీ పడుతోంది.

2026లో ఇప్పటివరకు 41,849 యూనిట్లను విక్రయించిన సంస్థ.. ఏడాది ముగిసేలోపు 50 వేల అమ్మకాల మైలురాయిని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకునే అవకాశం ఉంది. అయితే ఈ లక్ష్యాన్ని అందుకోవడానికి మిగిలిన కాలంలో మరో 8,151 యూనిట్లను విక్రయించాల్సి ఉంటుంది. టాప్ ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్రాండ్లలో మరింత మెరుగైన స్థానం సంపాదించాలంటే నెలవారీ అమ్మకాలను 7,000 యూనిట్లకు పైగా పెంచుకోవాల్సి ఉంటుందని అంచనా. రాబోయే నెలల్లో BGauss అమ్మకాల ప్రయాణం ఎలా ఉంటుందో ఆసక్తికరంగా మారింది.

Follow Us