AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టిక్‌టాక్ వీడియో కోసం పులితో ఆటలు.. చివరికి దారుణం..!

సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం చేసే ప్రమాదకర ప్రయోగాలు ఎంతటి విషాదాన్ని మిగిలిస్తాయో ఈ ఘటన మరోసారి నిరూపించింది. పాకిస్థాన్‌లో టిక్‌టాక్ వీడియో కోసం ఏకంగా బోనులో ఉన్న ఆడపులిని బయటకు వదిలారు. అయితే కెమెరా ముందు వీడియో తీయాలనుకున్న వారి ప్రయత్నం ఊహించని మలుపు తిరిగింది. ఒక్కసారిగా రెచ్చిపోయిన ఆ పులి అక్కడ పనిచేస్తున్న 19 ఏళ్ల యువకుడిపై దాడి చేసింది. పులి దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఇప్పుడు పాకిస్థాన్‌లో సంచలనంగా మారింది.

టిక్‌టాక్ వీడియో కోసం పులితో ఆటలు.. చివరికి దారుణం..!
Tigress Released From Cage For Tiktok Video Shoot Mauls Pakistani Teen To Death
Sharada V
|

Updated on: Nov 15, 2026 | 8:24 PM

Share

సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం చేసే ప్రమాదకర వీడియోలు ఎంతటి విషాదాన్ని మిగిలిస్తాయో ఈ ఘటన మరోసారి నిరూపించింది. పాకిస్థాన్‌లో టిక్‌టాక్ వీడియో కోసం ఏకంగా బోనులో ఉన్న ఆడపులిని బయటకు వదిలారు. అయితే కెమెరా ముందు వీడియో తీయాలనుకున్న వారి ప్రయత్నం ఊహించని మలుపు తిరిగింది. ఒక్కసారిగా రెచ్చిపోయిన ఆ పులి అక్కడ పనిచేస్తున్న 19 ఏళ్ల యువకుడిపై దాడి చేసింది. పులి దాడిలో తీవ్రంగా గాయపడిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఇప్పుడు పాకిస్థాన్‌లో సంచలనంగా మారింది.

ఫామ్ హౌస్ బోనులోంచి పులి బయటకు

ఈ దారుణ ఘటన పాకిస్థాన్‌లోని లాహోర్ జిల్లా కహ్నా ప్రాంతంలో చోటుచేసుకుంది. అక్కడ ఉన్న ఓ ప్రైవేట్ ఫామ్ హౌస్ లో తల్హా (19) అనే యువకుడు పనిచేస్తున్నాడు. ఈ ఫామ్‌ హౌస్ కు  నోమన్ అనే టిక్‌టాక్ కంటెంట్ క్రియేటర్ వీడియో షూటింగ్ కోసం వచ్చాడు. ఈ సందర్భంగా వీడియో మరింత ఆసక్తికరంగా ఉండాలనే ఉద్దేశంతో బోనులో ఉన్న ఆడపులిని బయటకు వదలాలని కోరాడు.

అతడి కోరిక మేరకు పులిని ఎన్‌క్లోజర్ నుంచి బయటకు తీసుకొచ్చారు. అయితే ఆ తర్వాతే అసలు ప్రమాదం జరిగింది. ఒక్కసారిగా దూకుడుగా మారిన పులి అక్కడే ఉన్న తల్హాపై విరుచుకుపడింది. ఊహించని ఈ దాడితో అక్కడున్నవారు భయాందోళనకు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన తల్హాను వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చికిత్స పొందుతూ బుధవారం అతడు ప్రాణాలు విడిచాడు.

పులి దాడిని కుక్క దాడిగా చిత్రీకరించే ప్రయత్నం

ఈ ఘటనలో మరో షాకింగ్ విషయం బయటపడింది. యువకుడిపై దాడి చేసింది పులి అయినప్పటికీ అసలు విషయాన్ని బయటకు రానివ్వకుండా కొందరు ప్రయత్నించినట్లు ఆరోపణలు వచ్చాయి. పులి దాడిని కుక్క దాడిగా చిత్రీకరించేందుకు ప్రయత్నించారు. ఈ కేసులో ఫామ్ హౌస్ యజమాని ఫయ్యాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. వీడియో షూటింగ్ కోసం వచ్చిన టిక్‌టాకర్ నోమన్ పాత్రపైనా దర్యాప్తు కొనసాగుతోంది. పులిని బోను నుంచి బయటకు తీసుకురావాలని ఎవరు కోరారు? అందుకు ఎవరు అనుమతి ఇచ్చారు? ప్రమాదం జరిగిన తర్వాత నిజాన్ని ఎందుకు దాచిపెట్టాలని చూశారో దర్యాప్తులో తేలనుంది.

వన్యప్రాణి అధికారుల ఆధీనంలోకి పులి

మరోవైపు, యువకుడిపై దాడి చేసిన ఆడపులిని వన్యప్రాణి సంరక్షణ అధికారులు తమ అధీనంలోకి తీసుకున్నారు. ప్రైవేట్ ఫామ్‌లో పెద్దపులిని పెంచేందుకు సరైన అనుమతులు ఉన్నాయా? జంతువును ఉంచే ప్రాంతంలో తగిన భద్రతా ఏర్పాట్లు చేశారా? అనే కోణంలో విచారిస్తున్నారు.

ఈ ఘటనపై లాహోర్ పోలీసులు తీవ్రంగా స్పందించారు. సోషల్ మీడియాలో కంటెంట్ కోసం చేసే ప్రయత్నాలు మనుషుల ప్రాణాలను బలితీసుకునేలా ఉండకూడదని స్పష్టం చేశారు. యువకుడి మృతికి నిర్లక్ష్యంతో పాటు, ప్రమాదం జరిగిన తీరును కప్పిపుచ్చేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపైనా పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

Follow Us