AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Municipal Elections: ఏపీలో 23పట్టణ స్థానికసంస్థలకు కూటమి అభ్యర్థుల ఖరారు.. ఇదిగో ఫుల్‌ లిస్ట్‌

ఏపీలో 23పట్టణ స్థానికసంస్థలకు కూటమి అభ్యర్థులను ఖరారు చేసింది. ఒక కార్పొరేషన్, 10మున్సిపాలిటీ స్థానాల్లో TDP పోటీ చేయనుండగా.. 2 కార్పొరేషన్లు, 3 మున్సిపాలిటీల్లో జనసేన పోటీ చేస్తోంది. ఒక కార్పొరేషన్, 2 మున్సిపాలిటీల్లో బీజేపీ పోటీ చేయనుంది. ఇందుకు సంబందించి తాజాగా అభ్యర్థులను ప్రకటించాయి ఆయా పార్టీలు.

Municipal Elections: ఏపీలో 23పట్టణ స్థానికసంస్థలకు కూటమి అభ్యర్థుల ఖరారు.. ఇదిగో ఫుల్‌ లిస్ట్‌
Ap Municipal Elections 2026
Anand T
|

Updated on: Nov 15, 2026 | 8:23 PM

Share

ఏపీలో పెండింగ్‌లో ఉన్న 23 మున్సిపాలిటీలకు త్వరలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను కూటమి పార్టీ ప్రకటించాయి. టీడీపీ 4 నగర పంచాయతీ అభ్యర్థులతో పాటు మేయర్, చైర్మన్ అభ్యర్థులను ప్రకటించింది. అటు జనసేన రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, మూడు మున్సిపాలిటీలలో మేయర్, ఛైర్మన్ అభ్యర్థులను ఖరారు చేసింది. అలాగే బీజేపీ రెండు మున్సాపిటీలకు అభ్యర్థులను ఖరారు చేసింది.

టీడీపీ అభ్యర్థుల ప్రకటన

టీడీపీ పార్టీ ఒక కార్పొరేషన్‌తో పాటు 10 మున్సిపాలిటీలకు అభ్యర్థుల ఖరారు చేసింది. వీరిలో మంగళగిరి-తాడేపల్లి మేయర్ అభ్యర్థిగా ఏడుకొండలు, ఆమదాలవలస మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా ప్రమీల, తణుకు మున్సిపల్ చైర్మన్‌ అభ్యర్థిగా రామకృష్ణ, పాలకొల్లు మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా ఉషారాణి, తాడిగడప మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా పీతా గోపీచంద్, గుడివాడ మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా కరుణ, నరసరావుపేట చైర్మన్ అభ్యర్థిగా రూపేష్‌ గుప్తా, పొన్నూరు చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా విజయలక్ష్మి పోటీలో ఉన్నారు.

అలాగే కందుకూరు చైర్మన్‌ అభ్యర్థిగా వెంకటేశ్వర్లు, గూడూరు మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా శిరీష , శ్రీకాళహస్తి మున్సిపల్ చైర్మన్‌ అభ్యర్థిగా బాలాజీ , నాలుగు నగర పంచాయతీ స్థానాలకు టీడీపీ అభ్యర్థులు , చింతలపూడి-ఎస్తేరు రాణి, పొదిలి-అనిల్‌కుమార్ అల్లూరు-సునీల్‌కుమార్‌, బి.కొత్తకోట-శ్రీనివాసులు బరిలో దిగనున్నారు.

జనసేన అభ్యర్థుల వివరాలు

ఇక జనసేన పార్టీ రెండు మున్సిపల్ కార్పొరేషన్లు, మూడు మున్సిపాలిటీలలో మేయర్, ఛైర్మన్ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థులను ఆదివారం సాయంత్రం ఖరారు చేసింది. వీరిలో శ్రీకాకుళం కార్పొరేషన్ నుంచి డా. దానేటి రాధా రాణి, కాకినాడ కార్పొరేషన్ నుంచి ఆకుల భవాని మేయర్ అభ్యర్థులుగా పోటీ చేయనుండగా.. రాజాం నుంచి బనిశెట్టి సౌజన్య లత, భీమవరం నుంచి డా.చుండూరి మల్లేశ్వరి, తాడేపల్లి గూడెం నుంచి పాలూరు వెంకటేశ్వర రావు చైర్మన్ అభ్యర్థులుగా పోటీలో ఉన్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us