గుడ్‌న్యూస్: రెండు రూపాయలు తగ్గిన పెట్రోల్ ధరలు..!
వాహనాదారులకు గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఒకానొక దశలో లీటర్ పెట్రోల్ ధర 79 రూపాయలు దాటి.. వాహనదారులను హడలెత్తించింది. సెప్టెంబర్, ఆగష్టు నెలలో పెట్రోల్ ధరలు పెరుగుతూ వచ్చాయి. ‘అరాంకో’ చమురు కర్మాగారంపై జరిగిన డ్రోన్ దాడితో.. అంతర్జాతీయంగా మార్కెట్‌ను కుదిపేసింది. దీంతో దేశంలో పెట్రోల్, డీజీల్ ధరలు పెరుగుతాయనే వార్త అందరిలోనూ గుబులు రెకెత్తించింది. ఒకానొక టైంలో లీటర్ పెట్రోల్ 100 రూపాయలు దాటుతుందని అని అన్నారు. […]
వాహనాదారులకు గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. ఒకానొక దశలో లీటర్ పెట్రోల్ ధర 79 రూపాయలు దాటి.. వాహనదారులను హడలెత్తించింది. సెప్టెంబర్, ఆగష్టు నెలలో పెట్రోల్ ధరలు పెరుగుతూ వచ్చాయి. ‘అరాంకో’ చమురు కర్మాగారంపై జరిగిన డ్రోన్ దాడితో.. అంతర్జాతీయంగా మార్కెట్‌ను కుదిపేసింది. దీంతో దేశంలో పెట్రోల్, డీజీల్ ధరలు పెరుగుతాయనే వార్త అందరిలోనూ గుబులు రెకెత్తించింది. ఒకానొక టైంలో లీటర్ పెట్రోల్ 100 రూపాయలు దాటుతుందని అని అన్నారు. కానీ.. అందుకు విరుద్ధంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతూ వచ్చాయి.
అలాగే.. అంతార్జాతీయంగా కూడా పెట్రోల్, డీజిల్ ధరలు దిగి వస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్లో లీటర్ పెట్రోల్ ధర రూ.77.21గా ఉంది. డీజిల్ లీటర్ ధర 72 రూపాయలుగా ఉంది. అలాగే.. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోలు రూ.73.32 కాగా.. డీజిల్ రూ. 66.46గా ఉంది. ఇక దేశ ఆర్థికనగరం అంటే ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.78.93 కాగా.. డీజిల్ రూ.69.66గా ఉంది. ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.14 కాగా.. డీజిల్ రూ.70.20గా ఉంది. మొత్తంగా చూస్తే ముంబైలో పెట్రోల్, డీజిల్ ధరలు కాస్త ఎక్కువగా ఉన్నాయి.
ఒక రకంగా.. రెండు నెలల నుంచి పెట్రోల్ ధరలు గమనిస్తే.. దాదాపుగా ఇప్పుడు రెండు రూపాయలకు పైగానే ధర తగ్గిందని చెప్పవచ్చు. అక్టోబర్ నెల 1st నుంచి పెట్రోల్ ధరలు తగ్గుతూ వస్తున్నాయి.