బిగ్ బాస్: ఎలిమినేషన్‌లో శ్రీముఖి.. ఏం జరుగుతోంది..?
నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 3 తెలుగు.. మొదటి నుంచి కాస్త ఎమోషన్‌గా, కొంచెం కామెడీగా సాగుతోంది. టాస్క్‌లు కూడా మొదటి రెండు సీజన్ల కంటే కాస్త వెరైటీగా ఉన్నాయి. ప్రస్తుతం ఫైనల్ కోసం పోటీ పడేందుకు ఏడుగురు మాత్రమే మిగిలారు. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో మహేష్ విట్టా ఎలిమినేట్ కావడంతో శ్రీముఖి, శివజ్యోతి, వితికా, వరుణ్, రాహుల్, అలీ, బాబా భాస్కర్‌లు ఈ వారం బిగ్ బాస్ ఇంట్లో కొనసాగనున్నారు. కాగా, ఈరోజు ఎపిసోడ్‌కి […]
నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ 3 తెలుగు.. మొదటి నుంచి కాస్త ఎమోషన్‌గా, కొంచెం కామెడీగా సాగుతోంది. టాస్క్‌లు కూడా మొదటి రెండు సీజన్ల కంటే కాస్త వెరైటీగా ఉన్నాయి. ప్రస్తుతం ఫైనల్ కోసం పోటీ పడేందుకు ఏడుగురు మాత్రమే మిగిలారు. ఆదివారం నాటి ఎపిసోడ్‌లో మహేష్ విట్టా ఎలిమినేట్ కావడంతో శ్రీముఖి, శివజ్యోతి, వితికా, వరుణ్, రాహుల్, అలీ, బాబా భాస్కర్‌లు ఈ వారం బిగ్ బాస్ ఇంట్లో కొనసాగనున్నారు. కాగా, ఈరోజు ఎపిసోడ్‌కి సంబంధించిన ఓ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
13వ వారం నామినేషన్‌లో భాగంగా ఈ వారం బిగ్ బాస్ టాపర్ ఆఫ్ ది హౌస్ అనే టాస్క్ ఇచ్చారు. ఎవరి పొజీషన్ ఏంటో వారే తేల్చుకునేలా సెట్ చేశారు. గార్డెన్ ఏరియాలో వరుసగా నంబర్లు ఉన్న కడ్డీలను పెట్టి ఎవరు ఏ పొజిషన్‌లో ఉన్నారో వారినే తేల్చుకోమని చెప్పారు. దీంతో మొదటి ప్లేస్‌లో బాబా బాస్కర్ నిలబడగా.. చివరి ప్లేస్‌లో శ్రీముఖి నిలబడింది. మధ్యలో రాహుల్, వరుణ్, అలీ, శివజ్యోతి, వితికా వరుసగా నెంబర్లను ఎంపిక చేసుకున్నారు. అయితే తనకంటే వితికా బెటర్ కంటెస్టెంట్ అంటూ.. తన పొజిషన్‌ను ఆమెకు ఇవ్వడంతో.. శివజ్యోతి నో చెప్పింది. అందరూ డిఫెండ్ చేస్తేనే.. బెటాలియన్ ఫైనల్ వరకు వితిక వెళ్లిందని.. తానేమి బెటర్ కంటెస్టెంట్ కాదని కాసేపు శివజ్యోతి వాదించింది. ఇక ప్రతి టాస్క్‌లో లాగే రాహుల్, శ్రీముఖిలు ఇక్కడ కూడా ఫైట్ చేసుకున్నట్లు ప్రోమోలో తెలుస్తోంది. టాస్క్‌లో చివరి పొజిషన్‌లో ఉన్న శ్రీముఖి నిజంగానే ఎలిమినేట్ కానుందా..? తెలుసుకోవాలంటే ఈ వారం చివరి వరకూ ఆగాల్సిందే..