Hyderabad Rains: భారీ వర్షానికి హైదరాబాద్‌లో ముగ్గురు గల్లంతు..
నిన్న రాత్రి కురిసిన కుండపోత వర్షం.. హైదరాబాద్‌ని షేక్ చేసింది. క్లౌడ్‌బరస్ట్ అయ్యిందా అన్నట్టుగా ఫ్లాష్‌ఫ్లడ్స్.. కాలనీలను ముంచెత్తాయి. వరద ఉధృతికి ముగ్గురు నాలాల్లో కొట్టుకుపోయారంటే ఏ స్థాయిలో వర్ష బీభత్సం ఉందో అర్థంచేసుకోవచ్చు. ఆసిఫ్‌నగర్ మాంగర్‌బస్తీలో ఇద్దరు కొట్టుకుపోవడం స్థానికంగా కలకలం రేపుతోంది.

నిన్న రాత్రి కురిసిన కుండపోత వర్షం.. హైదరాబాద్‌ని షేక్ చేసింది. క్లౌడ్‌బరస్ట్ అయ్యిందా అన్నట్టుగా ఫ్లాష్‌ఫ్లడ్స్.. కాలనీలను ముంచెత్తాయి. వరద ఉధృతికి ముగ్గురు నాలాల్లో కొట్టుకుపోయారంటే ఏ స్థాయిలో వర్ష బీభత్సం ఉందో అర్థంచేసుకోవచ్చు. ఆసిఫ్‌నగర్ మాంగర్‌బస్తీలో ఇద్దరు కొట్టుకుపోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. కాగా.. హైదరాబాద్ ఆసిఫ్‌నగర్‌లో గల్లంతైన ఇద్దరు వ్యక్తుల కోసం గాలింపు కొనసాగుతోంది హైడ్రా, జీహెచ్‌ఎంసీ కలిసి.. మాంగర్‌బస్తీ నాలాలో గాలింపు చర్యలు చేపట్టాయి.. నిన్న కురిసిన వర్షానికి నాలాలో కొట్టుకుపోయారు మామ, అల్లుడు.. మాంగర్‌బస్తీకి వచ్చిన హైడ్రా కమిషనర్, తహశీల్దార్‌లు.. అక్కడి పరిస్థితిని సమీక్షించారు. మాంగర్‌బస్తీ వాసులను తరలించేందుకు చాలాసార్లు ప్రయత్నించామని.. ఇందిరమ్మ ఇళ్లు కూడా ఇస్తామని చెప్పామంటున్నారు ఆసిఫ్‌నగర్ తహశీల్దార్ జ్యోతి.. అయితే, ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా వాళ్లు ఖాళీ చేయడం లేదంటున్నారు.
ఆసిఫ్‌నగర్ మాంగర్‌బస్తీలో సుమారు 15వందల ఇళ్లు ఉన్నాయి.. అన్నీ చిన్నచిన్న ఇళ్లే.. కొన్ని నాలాపై.. మరికొన్ని నాలాకు ఆనుకొని ఉన్నాయి.. 10వేల మందికి పైగా నివాసం ఉంటున్నారంటున్న స్థానికులు.. మహారాష్ట్ర నుంచి వలస వచ్చిన మాంగర్‌బస్తీ వాసులు.. వందేళ్లుగా ఇక్కడే ఉంటున్నామంటున్నామని పేర్కొంటుననారు. వరద ఉధృతికి నాలాలో ఇద్దరు కొట్టుకుపోవడంతో కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
కాగా.. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి ముషీరాబాద్‌లోని వినోభానగర్‌కు చెందిన దినేశ్(23) మోటార్ సైకిల్‌తో పాటు కొట్టుకుపోయాడు. ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న దినేశ్‌కు భార్య, కుమారుడు ఉన్నాడు. జీహెచ్‌ఎంసీ, హైడ్రా బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
