AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: వలపు వల.. గురువు విలవిల.. ఇదో పెద్ద కామ క్రైమ్ కథా చిత్రమ్..

Hyderabad: వలపు వల.. గురువు విలవిల.. ఇదో పెద్ద కామ క్రైమ్ కథా చిత్రమ్..

Shaik Madar Saheb
|

Updated on: Sep 15, 2025 | 1:06 PM

Share

కష్టపడకుండానే కోట్లు సంపాదించాలి..! గడప దాటకుండానే ఇంటికి డబ్బు రావాలని ఆలోచించిన ఓ గ్యాంగ్... యోగా గురువుని ట్రాప్‌ చేసింది. బ్యాగ్రౌండ్‌ చెక్‌ చేసుకునిమరీ రంగంలోకి దిగింది. కానీ సులభ సంపాదన చిక్కులు తెస్తుందని ఆతర్వాతే ఆ గ్యాంగ్‌కు అర్ధమైంది. ఈజీ మనీ అంత ఈజీ కాదని బుర్రకెక్కింది. ఫలితంగా జైల్లో ఉచలు లెక్కబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.

కష్టపడకుండానే కోట్లు సంపాదించాలి..! గడప దాటకుండానే ఇంటికి డబ్బు రావాలని ఆలోచించిన ఓ గ్యాంగ్… యోగా గురువుని ట్రాప్‌ చేసింది. బ్యాగ్రౌండ్‌ చెక్‌ చేసుకునిమరీ రంగంలోకి దిగింది. కానీ సులభ సంపాదన చిక్కులు తెస్తుందని ఆతర్వాతే ఆ గ్యాంగ్‌కు అర్ధమైంది. ఈజీ మనీ అంత ఈజీ కాదని బుర్రకెక్కింది. ఫలితంగా జైల్లో ఉచలు లెక్కబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్లలో ఉన్న యోగా ఆశ్రమమిది. రోజూ వందలాది మంది వచ్చిపోయే ప్రాంగణమిది. రంగారెడ్డి అనే ఓ యోగా గురువు ఈ ఆశ్రమాన్ని ఎన్నో ఏళ్లుగా నడుపుతున్నాడు. ఇక యోగా ఆశ్రమం అనగానే దేశ, విదేశాల నుంచి ఎంతో మంది వస్తుంటారు…! వచ్చినవాళ్లు పెద్ద ఎత్తున నిధులు ఇస్తుంటారు…! ఇదే విషయాన్ని కొన్నాళ్లుగా గమనించిన అమర్‌ అండ్‌ గ్యాంగ్. ఎలాగైనా యోగా గురువు దగ్గరున్న డబ్బును ఈజీగా కొట్టేయాలని పక్కా ప్లాన్‌ వేసింది.

అట్లాంటిట్లాంటి ప్లాన్‌ కాదిది…! గట్టిగా ఇరికించాలి… దండిగా డబ్బు రాబట్టాలంటూ ఇద్దరు మహిళలతో యోగా గురువు రంగారెడ్డి‌పై హానీ ట్రాప్ వల విసిరింది అమర్‌ గ్యాంగ్. బాగా ట్రైన్‌ చేసి అనారోగ్య సమస్యల పేరుతో ఇద్దరు మహిళలను ఆశ్రమంలోకి పంపింది. ఇక ఆశ్రమంలోకి దిగిన కొన్నిరోజులకే ఆ మహిళలు రంగారెడ్డి‌తో క్లోజ్‌గా మూవ్ కావడం మొదలుపెట్టారు. నకిలీ ప్రెస్‌ కార్డులతో కొన్న స్పై కెమెరాలు వాడి రంగారెడ్డితో సన్నిహితంగా ఉంటూ ఫోటోలు, వీడియోలు తీశారు. ఇకా వీడియోలను అమర్‌ గ్యాంగ్‌కు పంపారు. ఇకప్పుడు రంగంలోకి దిగిన గ్యాంగ్.. గురువును బ్లాక్ మెయిల్‌ చేయడం మొదలుపెట్టింది . మొదట 50 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు… అయితే వాటికి సంబంధించిన చెక్కులను వాళ్లకిచ్చాడు రంగారెడ్డి. ఆ తర్వాత కోట్లకు ప్లాన్‌ వేశారు కేటుగాళ్లు. రెండు కోట్లు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశారు. ఇక పరిస్థితి గమనించిన గురువు గంగారెడ్డి తానో మాస్టర్‌ ప్లాన్‌ వేసి అమర్‌ గ్యాంగ్‌కు దిమ్మతిరిగే ట్విస్ట్‌ ఇచ్చాడు.

రెండు కోట్లు ఇచ్చేందుకు ఓకే చెప్పాడు రంగారెడ్డి. డబ్బులు ఇచ్చేందుకు గొల్కొండకు రావాలని అటు అమర్‌ గ్యాంగ్‌ను పిలిచాడు… ఇటు పోలీసులకు సమాచారమిచ్చాడు. ఫలితంగా అమర్‌ గ్యాంగ్‌ పోలీసులకు రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికింది. అమర్‌తోపాటు మౌలాలి, రాజేష్, మంజుల, రజినీలను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు లోతుగా విచారణ మొదలుపెట్టారు. నిందితులు అంతా రియల్‌ ఎస్టేట్‌లో ఉన్నట్లు గుర్తించారు. ట్రాప్‌ చేయడం ఇదే మొదటిసారా… ఇలానే ఇంకేమైనా చేశారా..? అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు.

ఇవి కూడా చదవండి

Panipuri: అబ్బ.. పానీపూరీ తింటున్నారా..? 30 రోజులు ఆస్పత్రి పాలైన ఇంజనీర్.. ఈ కథ తెలిస్తే కళ్లు బైర్లే

Hyderabad: ఇలా తయారయ్యారేంట్రా బాబూ.. 5 గదుల్లో విద్యార్థులకు క్లాస్‌లు.. 6వ గదిలో భయంకరమైన రహస్యం

Follow Us