AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: అర్ధరాత్రి కుండపోత.. చిగురుటాకులా వణికిన భాగ్యనగరం.. వాహనదారులు తీవ్ర అవస్థలు..

గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీగా వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లో అర్థరాత్రి వర్షం..

Hyderabad: అర్ధరాత్రి కుండపోత.. చిగురుటాకులా వణికిన భాగ్యనగరం.. వాహనదారులు తీవ్ర అవస్థలు..
Telangana Rain Alert
Ganesh Mudavath
|

Updated on: Oct 16, 2022 | 7:47 AM

Share

గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో వర్షాలు కురుస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురుస్తుండగా.. మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీగా వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లో అర్థరాత్రి వర్షం దంచికొట్టింది. శనివారం రాత్రి పది గంటల నుంచే చినుకులుగా స్టార్ట్ అయ్యి, అర్థ రాత్రికి భారీ వర్షంగా మారింది. ఎల్బీనగర్, మలక్ పేట, చార్మినార్, రాజేంద్రనగర్, జూబ్లీహిల్స్, కూకట్ పల్లి, మాదాపూర్, హయత్ నగర్, రామాంతపుర్, అంబర్ పేట్, ఉప్పల్, అమీర్ పేట్, బేగంపేట్, మైత్రివనం, ఎస్ ఆర్ నగర్, పంజాగుట్టట ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. గచ్చిబౌలి లో అత్యధికంగా 5.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. హయత్ నగర్ లో 3.9 , జూ పార్క్ వద్ద 3.7, బండ్లగుడా 3.1, దూధ్ బౌలిలో 3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

భారీ వర్షానికి వరద పోటెత్తడంతో పలు లోతట్టు ప్రాంతాలు జలమలం అయ్యాయి. రాత్రి సమయం కావడం, వీకెండ్ అవడంతో సరదాగా బయటకు వచ్చిన వారు వర్షానికి తడిచిపోయారు. రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడడంతో వానదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇంటికి చేరుకునేందుకు అవస్థలు ఎదుర్కొన్నారు. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ వర్షం కురిసింది. ఉమ్మడి నల్గొండ జిల్లా, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి