AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TSPSC Group – 1: తెలంగాణ తొలి గ్రూప్ – 1 ప్రిలిమ్స్ నేడే.. 15 నిమిషాల ముందే గేట్లు బంద్.. నిబంధనలివే..

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ (ఆదివారం) గ్రూప్ - 1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న టీఎస్పీఎస్సీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న పరీక్షకు అధికారులు అన్ని రకాల...

TSPSC Group - 1: తెలంగాణ తొలి గ్రూప్ - 1 ప్రిలిమ్స్ నేడే.. 15 నిమిషాల ముందే గేట్లు బంద్.. నిబంధనలివే..
Tspsc Group1 Prelims
Ganesh Mudavath
|

Updated on: Oct 16, 2022 | 6:38 AM

Share

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ (ఆదివారం) గ్రూప్ – 1 ప్రిలిమ్స్ పరీక్ష జరగనున్నాయి. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా నిర్వహిస్తున్న టీఎస్పీఎస్సీ అధ్వర్యంలో నిర్వహిస్తున్న పరీక్షకు అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. 503 పోస్టుల భర్తీ కోసం ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరగనుంది. పరీక్ష కేంద్రంలోకి ఉదయం 8.30 నుంచి అనుమతిస్తారు. 10.15 తరువాత అనుమతి ఉండదని అధికారులు స్పష్టం చేశారు. ఈ మేరకు భారీ బందోబస్తు నిర్వహించారు. ప్రశ్నపత్రం ఓపెన్ చేయగానే అందులో 150 ప్రశ్నలూ ముద్రించారో లేదో చూసుకోవాలని, ఏవైనా పొరపాట్లు ఉంటే ఇన్విజిలేటర్లను అడిగి ఇంకో ప్రశ్నాపత్రం తీసుకోవాలని అభ్యర్థులకు సూచించారు. ఓఎంఆర్‌ షీట్లో సూచించిన చోట కాకుండా ఎక్కడైనా హాల్‌టికెట్‌ నంబరు రాసినా, ఇతర గుర్తులు వేసినా చెల్లనిదిగా పరిగణిస్తామని పేర్కొన్నారు. క్వశ్చన్ పేపర్ పై ఎలాంటి రాతలు ఉండకూడదని స్పష్టం చేశారు.

పరీక్ష పూర్తయిన తర్వాత అభ్యర్థుల ఓఎంఆర్‌ షీట్లను డిజిటల్‌ ఓఎంఆర్‌ కాపీలు వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు టీఎస్పీఎస్సీ తెలిపింది. అభ్యర్థులు పరీక్ష సమయంలో బయోమెట్రిక్‌ నమోదు చేయాలని తెలిపింది. హాల్‌టికెట్‌తో పాటు ప్రభుత్వం జారీచేసిన ఏదైనా గుర్తింపు కార్డు ఒరిజినల్ తీసుకురావాలని అభ్యర్థులకు వివరించింది. అయితే.. గతంలో ఈ సారి బహుళ సిరీస్‌ల ప్రశ్నపత్రాలు అభ్యర్థులకు ఇవ్వనున్నట్లు అధికారులు తెలిపారు. ఓఎంఆర్‌ షీట్‌లో జవాబులను బ్లూ లేదా బ్లాక్‌ బాల్‌పాయింట్‌ పెన్‌తో మాత్రమే బబ్లింగ్‌ చేయాలని సూచించారు. ఓఎంఆర్‌ షీట్‌లో 150 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించడంతో పాటు అభ్యర్థి పేరు ఇంగ్లిష్‌ క్యాపిటల్‌ లెటర్స్‌లో రాయాల్సి ఉంటుంది. డబుల్‌ బబ్లింగ్‌, చాక్‌పౌడర్‌, రబ్బరు వాడి జవాబును చెరిపిన, తప్పుగా వివరాలు పేర్కొన్న జవాబు పత్రాలను పరిగణలోకి తీసుకోరు.

కాగా.. తెలంగాణ తొలి గ్రూప్ -1 పరీక్షకు 3.80 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే శనివారం అర్ధరాత్రి వరకు 3.41 లక్షల మంది మాత్రమే వెబ్ సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. పరీక్ష కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,019 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసింది. మేడ్చల్‌ జిల్లాలో 51,931 మంది, ములుగు జిల్లా నుంచి 1,933 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి